LifeStyleSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/savings6c5096c2-6a50-416f-b12b-54e905fd7ab9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/savings6c5096c2-6a50-416f-b12b-54e905fd7ab9-415x250-IndiaHerald.jpgప్రస్తుత రోజుల్లో మనం ఎంత సంపాదించినా మన అవసరాలకు సరిపోవట్లేదు అనే భావన చాలామందికి ఉండటం సహజమే... అలాగే కొంతమంది సంపాదించినది అంతా అవసరాలకే సరిపోతుంది. ఆదా చేసుకోవటం అసలు కుదరట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. అయితే మనం కొన్ని చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టి తగిన చిట్కాలు పాటించినట్లు అయితే మన కష్టార్జితంలో కొంతవరకు ఆదా చేసుకోవచ్చు. savings;adah sharma;bhavana;bank;idea;coffeeకష్టార్జితాన్ని ఆదా చేసుకునే కొన్ని విలువైన చిట్కాలుకష్టార్జితాన్ని ఆదా చేసుకునే కొన్ని విలువైన చిట్కాలుsavings;adah sharma;bhavana;bank;idea;coffeeWed, 02 Dec 2020 10:00:00 GMTప్రస్తుత రోజుల్లో మనం ఎంత సంపాదించినా మన అవసరాలకు సరిపోవట్లేదు అనే భావన చాలామందికి ఉండటం సహజమే...  అలాగే కొంతమంది సంపాదించినది అంతా అవసరాలకే సరిపోతుంది. ఆదా చేసుకోవటం అసలు కుదరట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. అయితే మనం కొన్ని చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టి తగిన చిట్కాలు పాటించినట్లు అయితే మన కష్టార్జితంలో కొంతవరకు ఆదా చేసుకోవచ్చు. అవేంటంటే...





1. తక్షణం అవసరం లేని వస్తువులని కొనకూడదు.


2. అప్పు చేస్తే అప్పు తీర్చడానికే సరిపోతుంది, సేవ్ చేయడానికి ఏం మిగలదు. కాబట్టి అప్పుల జోలికి వెళ్లొద్దు


3. మీరు వారమంతా పక్కన పెట్టిన డబ్బులని వారాంతంలో బ్యాంక్ లో వేసేయండి, ఈ ఎకౌంట్ లో నుండి అత్యవసరం అయితే తప్ప మనీ బయటకి తీయకూడదు అని రూల్ పెట్టుకోండి.


4. మీరు వాడని సబ్స్క్రిప్షన్స్ క్యానిల్ చేసేయండి.


5. కమోడిటీ యాప్స్ ని అన్ఇన్స్టాల్ చేసేయండి.


6. బయట తినడం తగ్గించి ఇంటి భోజనమే తీసుకోండి, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆదాకి ఆదా.


7. మొబైల్ డేటా కంటే ఇంట్లో ఉన్న వైఫై ని ఎక్కువ వాడుకోండి.


8. బయటకి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కునే అలవాటు తగ్గించండి. మీతో పాటూ మంచి నీరు తీసుకు వెళ్ళండి.


9. మీకు అవసరం లేని వస్తువులని ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ లో అమ్మేయండి.


10. షాపింగ్ కి వెళ్ళినప్పుడు లిస్ట్ రాసుకుని ఆ లిస్ట్ ప్రకారమే కొనండి.


11. అనుకోకుండా వచ్చిన బోనస్ లాంటి డబ్బులని ఎక్స్ట్రా ఎకౌంట్ లో వేయండి.


12. ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకోండి, ఉదాహరణకి వాషింగ్ మెషీన్ ఫుల్ లోడ్ వెయ్యటం లాంటివి.


13. వీలున్నంత వరకూ క్యాష్ పేమెంట్ చేయండి. ఎన్ని డబ్బులు ఖర్చు అయ్యాయో మీకు తెలుస్తుంది.


14. వారానికి ఒక రోజు "నో మనీ స్పెండింగ్ డే" అని పెట్టుకుని ఆ రోజున అత్యవసరమయితే తప్ప ఎలాంటి ఖర్చూ పెట్టకండి.


15. లైబ్రరీల్లో పుస్తకాలు తీసుకోండి, మీకు మరీ నచ్చితే తప్ప కొనకండి.


16. అసలు ముందు రోజుకి ఎంత ఖర్చు అవుతోందో ఒక లెక్క వేసుకోండి.


17. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తును మాత్రమే దృష్టిలో పెట్టుకుని సేవ్ చేయండి..


18. మీకు బాగా నచ్చిన ఐటెం ఏదైనా ఇరవై నాలుగు గంటల వేచి చూడండి, ఇరవై నాలుగు గంటల తరువాత కూడా మీకు అది ఇంకా నచ్చితే అప్పుడు కొనుక్కోండి.


19. మీరు బయటకి వెళ్ళినప్పుడు ఒక కాఫీ తాగితే, ఇంటికొచ్చాక ఆ కాఫీ కి అయిన ఖర్చు ఒక ఎకౌంట్ లో వేయండి.


20. వారానికి సరిపాడా మీల్ ప్లాన్ చేసుకుని ఆ ప్రకారం వస్తువులు తెచ్చుకుంటే మీకూ ఒక ఐడియా ఉంటుంది, అనవసరమైన ఖర్చు ఉండదు.

21. పాడైపోని వస్తువులని బల్క్ లో తెచ్చుకోండి, కొంచెం డబ్బులు కలిసి వస్తాయి.


22. ఏదైనా వస్తువు కొనే ముందు ఇంట్లో ఉన్నవి రీసైకిల్ చేయవచ్చేమో చూడండి.


23. బేసిక్ టైలరింగ్ నేర్చుకుంటే తెలియని ఖర్చు తగ్గుతుంది.


24. అప్లయన్సెస్ కొనేటప్పుడు సరైనవే కొనండి, తరవాత రిపెయిర్ కాస్ట్ తగ్గుతుంది.


25. వీలున్నంత వరకూ గిఫ్ట్స్ ఇంట్లో తయారు చేయవచ్చేమో చూడండి, లేదు కొనాలి అంటే ముందే కొనండి, లాస్ట్ మినిట్ షాపింగ్ లో ఎప్పుడూ ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది.



ఇవన్నీ ఒకసారి పాటించి చూడండి. కచ్చితంగా ఫలితం కనిపిస్తుంది.




పవన్ కళ్యాణ్ ఇక కొత్త అవతారమెత్తబోతున్నారా..?

గ్రేటర్ యుద్దం: పెరిగిన పోలింగ్ శాతం అధికారుల్లో సంతోషం.

చంద్రబాబు ప్రవర్తనలో అది కనపడుతుందా...?

గ్రేటర్ యుద్ధం : నిద్ర లేవని నగరం.. పాపం చలికాలం కాబోలు..!?

త్వరలో ఆరు గంటల ప్రయాణ సమయాన్ని తగ్గించేలా టైం టేబుల్ - రైల్వే బోర్డు

బ్రేకింగ్: తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం... స్పాట్ లోనే

ఏపీలో అడుగు పెడుతున్న పవన్... ఈసారి ఎక్కడికి అంటే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>