Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/arya-outstanding-transformation-for-klywood-movie2fd88fbf-c5e5-4528-bf48-0c227304f8b6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/arya-outstanding-transformation-for-klywood-movie2fd88fbf-c5e5-4528-bf48-0c227304f8b6-415x250-IndiaHerald.jpgసిక్స్‌పాక్, కండలు తిరిగిన దేహం.. మొదట్లో ఇవన్నీ బాలీవుడ్‌కే సొంతం. అయితే టాలీవుడ్‌కి సిక్స్‌ప్యాక్‌ను పరిచయం చేసింది మాత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇందులో ఎలాంటి అనుమానమూ లేదు. అయితే ఇప్పుడు ఈ ఫిట్ మంత్ర తమిళ నటులు కూడా ఫాలో అవుతున్నారు. విశాల్ ఎప్పుడో ఈ ఫీట్ సాధించాడు. ఇప్పుడు మరో స్టార్ హీరో ఆర్య కూడా అదే తరహాలో రెడీ అవుతున్నాడు. అయితే ఆర్యకు ఎప్పటినుంచో...arya;pawan;allu arjun;arya;geetha;jeevitha rajaseskhar;pawan kalyan;santhosh;santhosh narayanan;sundar;vishal krishna;holi;cinema;sangeetha;telugu;tamil;hero;arjun 1;kick;kaala;santhossh jagarlapudi;aryaa;mantra;chitramఅమ్మో! అల్లు అర్జున్ విలన్ ఇలా మారాడేంటి..? అంతా సినిమా కోసమేనా!అమ్మో! అల్లు అర్జున్ విలన్ ఇలా మారాడేంటి..? అంతా సినిమా కోసమేనా!arya;pawan;allu arjun;arya;geetha;jeevitha rajaseskhar;pawan kalyan;santhosh;santhosh narayanan;sundar;vishal krishna;holi;cinema;sangeetha;telugu;tamil;hero;arjun 1;kick;kaala;santhossh jagarlapudi;aryaa;mantra;chitramWed, 02 Dec 2020 15:04:00 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇందులో ఎలాంటి అనుమానమూ లేదు. అయితే ఇప్పుడు ఈ ఫిట్ మంత్ర తమిళ నటులు కూడా ఫాలో అవుతున్నారు. విశాల్ ఎప్పుడో ఈ ఫీట్ సాధించాడు. ఇప్పుడు మరో స్టార్ హీరో ఆర్య కూడా అదే తరహాలో రెడీ అవుతున్నాడు. అయితే ఆర్యకు ఎప్పటినుంచో సిక్స్‌ప్యాక్ ఉంది కదా..? అనుకుంటున్నారా..? ఉన్నమాట నిజమే కానీ... ఇప్పుడు ఓ కొత్త సినిమా కోసం ఆర్య విపరీతంగా వర్కౌట్లు చేస్తున్నాడు. అతడి ట్రాన్స్‌ఫర్మేషన్ చూస్తుంటే అభిమానులకు మతి పోతోంది.


బ్యాక్సింగ్ నేపథ్యంలో సాగే సినిమాలకు ఎప్పుడూ భారీగా ఫాన్స్ ఉంటారు. తెలుగులో ఇలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. పవన్ కల్యాణ్ తమ్ముడు నుంచి వెంకటేశ్ గురు వరకు అన్ని సినిమాలనూ ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు అలాంటి సినిమాతోనే తమిళనటుడు ఆర్య మనముందుకు రానున్నాడు. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం ఆర్య తన లుక్ పూర్తిగా మార్చేశాడు. అతడి కండలు తిరిగిన దేహం చూస్తుంటే బాక్సింగ్ దిగ్గజం హోలీ ఫీల్డ్‌లా కనిపిస్తున్నాడు.


ఆర్య హీరోగి కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం సల్ఫత్తా.  ఈ మధ్యనే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర బృందం. పోస్టర్‌లో ఆర్య వెనక్కి తిరిగి నిలబడి ఉండగా.. అతడి వీపు భాగం మొత్తం కండలు తిరిగి సూపర్‌గా ఉన్నాడు. కే9 స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో దుషారా విజయన్ కథానాయికగా నటిస్తోంది. డగా, పార్థిబాన్ రాధాకృష్ణన్, సంతోష్ ప్రతాప్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ చిత్రం చెన్నైకి చెందిన ఓ ప్రముఖ బాక్సర్‌ జీవిత గాధ అని జరుగుతున్న ప్రచారం సినిమాపై మరింత అంచనాలు పెంచుతోంది. అంతేకాకుండా ఈ సినిమా ఆర్యకు 30వ సినిమా కావడం అతడి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. అంతేకాకుండా రజనీతో కాలా, కబాలీ వంటి క్రేజీ సినిమాలను తెరకెక్కించిన పా.రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం కొసమెరుపు.

ఇక ఈ సినిమాతో పాటు ఆర్య తన తదుపరి చిత్రం అరన్మానై-3 షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి సుందర్ సీ దర్శకుడు. ఈ చిత్ర షూటింగ్ కోసం ఆర్య ప్రస్తుతం పొల్లాచిలో న్నాడు. విచిత్రమేంటంటే ఈ చిత్రంలో ఆర్య దెయ్యంగా కనిపిస్తారంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.


జగన్ కు ఆటో డ్రైవర్ ల వార్నింగ్

విజేతను తేల్చేసింది ఆ పది వేలేనా ?

వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్.. బెనిఫిట్స్ ఏంటంటే..?

వారంలో హైదరాబాద్ కు పొంచి ఉన్న ముప్పు...!

బండి సంజయ్ కు మోదీ ఫోన్ జీహెచ్ఎంసీ ఎన్నికల పై ఆరా

ఏపీలో విప్లవం వస్తుంది: జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీ పోలీసులకు అవార్డుల పంట, జగన్ ఫుల్ హ్యాపీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>