PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/greater-wareb4ee15f-186d-4c98-8987-dce2ed1787ff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/greater-wareb4ee15f-186d-4c98-8987-dce2ed1787ff-415x250-IndiaHerald.jpgముషీరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సాగిన విధానం చూసి ఈసారి పోలింగ్ భారీగా నమోదవుతుందని రాజకీయ పార్టీలు లెక్కలు వేసుకున్నాయి. నగర వాసులు కూడా ఎన్నికల ప్రచారాలకు, పాద యాత్రలకు భారీ మద్దనిచ్చారు. పలు రోడ్‌ షోలకు బ్రహ్మరథం పట్టారు. ఆ హడావుడి చూసి గత ఎన్నికల కంటే ఈసారీ పోలింగ్ భారీగా నమోదవుతుంని ఊహించారు. greater-war;ram madhav;government;huzur nagar;research and analysis wingగ్రేటర్ యుద్ధం: ముషీరాబాద్ లో సాయంత్రం 6 వరకు పోలింగ్ వివరాలు ఇవి..గ్రేటర్ యుద్ధం: ముషీరాబాద్ లో సాయంత్రం 6 వరకు పోలింగ్ వివరాలు ఇవి..greater-war;ram madhav;government;huzur nagar;research and analysis wingWed, 02 Dec 2020 14:21:00 GMT
పోలింగ్ తగ్గడం వెనుక కారణమేంటని రాజకీయ నాయకులను సంప్రదించగా.. కరోనా భయంతోనే ఓటర్లు పోలింగ్‌కు రాలేదని చెబుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక దూరం నిబంధనకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేయలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వంపై నిరసక్తితో ఓటరు పోలింగ్ కేంద్రాలకు రాలేదని ఆరోపిస్తున్నారు. అధికారపార్టీ వాళ్లే ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి పోలింగ్ కేంద్రాలకు వెళ్లనివ్వకుండా చేశారని అంటున్నారు.

మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు వార్డుల వారీగా పోలైన ఓట్ల వివరాలు ఓసారి చూస్తే.. అడిక్‌మెట్ డివిజన్‌లో 42.56 శాతం పోలింగ్ కాగా, ముషీరాబాద్ డివిజన్‌లో 48.68 శాతం, రాంనగర్ డివిజన్‌లో 45.49శాతం, భోలక్‌పూర్ డివిజన్‌లో 48.04 శాతంగా నమోదైంది. ఇక ముషీరాబాద్ నియోజకవర్గంలోనే అతితక్కువగా గాంధీనగర్ డివిజన్‌లో పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు గాంధీనగర్ డివిజన్‌లో 36.00 శాతం పోలింగ్ నమోదైంది. కవాడిగూడ డివిజన్ విషయానికొస్తే 39.00 శాతం పోలింగ్ నమోదైంది. తుది లెక్కలు వచ్చే సరికి రెండు శాతం అటు ఇటుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఉదయం మాత్రమే పోలింగ్ బాగా నమోదైందని, మధ్యాహ్నాం తర్వాత ఓటర్లు కనీసం కేంద్రాల వద్దకు కూడా రాలేదని అధికారులు పేర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే పోలింగ్ కన్నాముందే ఏజెంట్లు టేబుల్ తొలగించేశారు.


జగన్ కు ఆటో డ్రైవర్ ల వార్నింగ్

విజేతను తేల్చేసింది ఆ పది వేలేనా ?

వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్.. బెనిఫిట్స్ ఏంటంటే..?

వారంలో హైదరాబాద్ కు పొంచి ఉన్న ముప్పు...!

బండి సంజయ్ కు మోదీ ఫోన్ జీహెచ్ఎంసీ ఎన్నికల పై ఆరా

ఏపీలో విప్లవం వస్తుంది: జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీ పోలీసులకు అవార్డుల పంట, జగన్ ఫుల్ హ్యాపీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>