PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/settlers-votes-in-ghmc-electionsf87f77c1-a5da-4b9e-afdd-eb13dafb3370-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/settlers-votes-in-ghmc-electionsf87f77c1-a5da-4b9e-afdd-eb13dafb3370-415x250-IndiaHerald.jpgజీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిఓటూ కీలకమే. అందులోనూ సెటిలర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ముఖ్యంగా టీఆర్ఎస్ లో కాస్త గుబులుగానే ఉంది. ఏపీనుంచి వచ్చినవారి జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆయా ఓట్లు ఏ పార్టీకి పడితే, వారు గెలుస్తారనే అంచనా ఉంది. అందుకే సెటిలర్ల ఓట్లపై గట్టి నమ్మకంతో ఉంటాయి అన్ని పార్టీలు. అయితే పోలింగ్ మొదలై గంటలు గడుస్తున్నా.. సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న డివిజన్లలో ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నట్టు సమాచారం. greater-war;bharatiya janata party;telangana rashtra samithi trs;janasena;media;population;tdp;local language;janasena party;party;mantraగ్రేటర్ యుద్ధం: బయటకు రాని సెటిలర్లు.. అభ్యర్థుల్లో గుబులు..గ్రేటర్ యుద్ధం: బయటకు రాని సెటిలర్లు.. అభ్యర్థుల్లో గుబులు..greater-war;bharatiya janata party;telangana rashtra samithi trs;janasena;media;population;tdp;local language;janasena party;party;mantraTue, 01 Dec 2020 11:00:00 GMTటీఆర్ఎస్ లో కాస్త గుబులుగానే ఉంది. ఏపీనుంచి వచ్చినవారి జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆయా ఓట్లు ఏ పార్టీకి పడితే, వారు గెలుస్తారనే అంచనా ఉంది. అందుకే సెటిలర్ల ఓట్లపై గట్టి నమ్మకంతో ఉంటాయి అన్ని పార్టీలు. అయితే పోలింగ్ మొదలై గంటలు గడుస్తున్నా.. సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న డివిజన్లలో ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నట్టు సమాచారం.

గ్రేటర్ ఎన్నికల్లో ఉదయం 7 గంటలనుంచే సందడి మొదలైంది. ప్రముఖులంతా తొలి గంటలోనే తమ ఓటు హక్కు వినియోగించుకుని ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇక ప్రముఖులు ఓటు వేసే బూత్ ల వద్ద మీడియా హడావికి కూడా బాగా ఎక్కువగా కనిపించింది. రాగా పోగా.. సెటిలర్ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ మందకొడిగా సాగుతున్నట్టు సమాచారం.

సెటిలర్ల ఓట్లపై ఆశలు పెట్టుకున్న పార్టీలన్నీ ఇప్పుడు ఆందోళనలో పడ్డాయి. ముఖ్యంగా టీడీపీ సెటిలర్ల ఓట్లపై ఆశలు పెట్టుకుంది. ఆయా డివిజన్లలో టీడీపీ జెండా ఎగరేయాలని, తెలంగాణలో పార్టీ ఇంకా బతికే ఉందనే సంకేతాలు పంపాలని టీడీపీ ఆశపడుతోంది. అధిష్టానం ప్రచారానికి రాకపోయినా పూర్తిగా సోషల్ మీడియాపై ఆధారపడి బరిలో నిలిచారు టీడీపీ అభ్యర్థులు. మరోవైపు టీఆర్ఎస్ కూడా అభివృద్ధి మంత్రంతో సెటిలర్ల ఓట్లగు గాలమేయాలని చూస్తోంది. అటు బీజేపీ, జనసేన మద్దతుతో సెటిలర్ల ఓట్లలో మెజార్టీ భాగం తమకే దక్కుతాయని ఆశపడుతోంది. మరి ఆయా వర్గాలు ఏమనుకుంటున్నాయనే విషయం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఉదయాన్నే సెటిలర్ల ప్రాంతాల్లో ఓటింగ్ పెద్దగా జరక్కపోవడంతో.. వారి ఓటు ఎటువైపు అనే ఆలోచనలు నిండిపోయాయి. దీంతో మధ్యాహ్నం వరకు సెటిలర్ల ఓట్లపై సస్పెన్స్ కొనసాగేలా ఉంది. మరోవైపు స్థానికంగా ఉన్న నేతల్ని పురమాయించి వారికి ఫోన్లు చేయించాలని, పోలింగ్ బూత్ ల వరకు తెప్పించాలని చూస్తున్నారు. 


గ్రేటర్ యుద్ధం: ‘‘నిర్భయంగా ఓటేయండి.. మరోసారి గెలిపించండి..’’

సమంతే తల బాదుకుంటుంటే.. ఆమె బాటలో నడుస్తుందట !

ఆఖరి రోజు అగ్రనేతల హల్చల్.. విజయం ఎవరికీ దక్కేనో..?

గ్రేటర్ యుద్ధం : పలుచోట్ల బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఘర్షణ..?

గ్రేటర్ యుద్దం: ఓటు వేసి సైలెంట్ గా వెళ్ళిన చిరు..అందుకేనా ?

కొనసాగుతున్న రైతుల ఆందోళన

తొలిసారి సస్పెన్షన్ అయిన చంద్రబాబు ప్రతిపక్ష నేతపై వేటు ఆనవాయితీ కాదు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>