MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nikhil98b5d0de-379b-4a20-8f3b-f41a8bf37760-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nikhil98b5d0de-379b-4a20-8f3b-f41a8bf37760-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యమైన కథలతో, విభిన్నమైన పాత్రలతో ట్రావెల్ అవుతోన్న యంగ్ హీరో నిఖిల్ సిథ్థార్థ. ఎర్లియర్ గా ఈ హీరో అర్జున్ సురవరం సినిమాతో మంచి విజయం సొంతం చేసుకున్నాడు. nikhil;nikhil;chandoo mondeti;karthikeya;kartikeya;tollywood;cinema;hero;arjun 1365 దీపాలను వెలిగించిన టాలీవుడ్ యాంగ్ హీరో..!365 దీపాలను వెలిగించిన టాలీవుడ్ యాంగ్ హీరో..!nikhil;nikhil;chandoo mondeti;karthikeya;kartikeya;tollywood;cinema;hero;arjun 1Tue, 01 Dec 2020 10:00:00 GMT నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యమైన కథలతో,  విభిన్నమైన పాత్రలతో ట్రావెల్ అవుతోన్న యంగ్ హీరో నిఖిల్ సిథ్థార్థ. ఎర్లియర్ గా ఈ హీరో అర్జున్ సురవరం సినిమాతో మంచి విజయం సొంతం చేసుకున్నాడు. అదే ఊపులో త్వరలో ‘కార్తికేయ 2’ చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అతడి కిట్టీలో ఉన్నాయి.

ఇక టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ కుర్ర హీరో ఇటీవలే ఓ ఇంటివాడైన విషయం అందరికి తెలిసిందే. అయితే సోమవారం కార్తీక పూర్ణమి కావడంతో  గుడిలో దీపాలను వెలిగించాడు నిఖిల్. సికింద్రాబాద్ స్కందగిరిలోని కార్తికేయ స్వామి వారి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్బంగా 365 దీపాలను వెలిగించాడు నిఖిల్. కుటుంబ సభ్యులతో ఆలయానికి వెళ్లిన నిఖిల్ మిగిలిన భక్తులతో పాటు దేవాలయంలో దీపాలను వెలిగించాడు.

ఇక ప్రతి ఏడాది తాను ఇలా దీపాలను వెలిగిస్తానంటూ చెప్పుకొచ్చాడు ఈ యాంగ్ హీరో. ప్రతి ఏడాది కార్తీక మాసంలో ఏదో ఒక రోజున కార్తికేయ స్వామికి దీపాలను వెలిగించడం ఆనవాయితీగా వస్తుందని నిఖిల్ తెలిపారు. ప్రస్తుతం నిఖిల్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వీటిలో ‘కార్తికేయ’ సీక్వెల్ పైన మంచి బజ్ ఏర్పడింది. గతంలో వచ్చిన ‘కార్తికేయ’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో ఈ సీక్వెల్ పైన ప్రత్యేక దృష్టిపెట్టాడు నిఖిల్. మరో రెండు సినిమాలను వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు ఈ కుర్రహీరో. చందు మొండేటి దర్శకత్వంలోనే రెండో భాగం తెరకెక్కుతోంది. మొదటి భాగానికి మించిన స్థాయిలో ఈ సినిమా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు. మరి నిఖిల్ కు ఆ సుబ్రహ్మేశ్వర స్వామి అనుగ్రహం నిండుగా మెండుగా దక్కి ఆ సినిమా భారీ హిట్టవ్వాలని కోరుకుందాం.




గ్రేటర్ యుద్ధం:మెజారిటీ కోసం బిజెపి కొత్త ప్రయత్నాలు

కేటిఅర్ ఎక్కడ ఓటు వేసారు అంటే...!

గ్రేటర్ యుద్ధం : ఎన్ని బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారో తెలుసా..!?

గ్రేటర్ యుద్దం : ఎన్ని ప్రత్యేకతలో..నేడే పోలింగ్ !!

గ్రేటర్ యుద్ధం : జూబ్లీహిల్స్ లో ఏయే సెలబ్రిటీ ఎక్కడ ఓటు వేస్తారంటే ?

గ్రేటర్ యుద్ధం : అందరి దృష్టంతా ఆ నియోజకవర్గంపైనే..!

గ్రేటర్ లో సెటిలర్లు ఎవరివైపు ఉంటారు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>