BusinessSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/money/126/money-moneyfa629d91-4af4-48b7-beb7-2e62050ccc72-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/money/126/money-moneyfa629d91-4af4-48b7-beb7-2e62050ccc72-415x250-IndiaHerald.jpgసీఎస్‌బీ బ్యాంక్ (క్యాథలిక్ సిరియన్ బ్యాంక్) కూడా తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసీఎల్ఆర్ రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎంసీఎల్ఆర్ రేటులో 0.10 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. ఆరు నెలల కాల పరిమితిలోని రుణాలకు ఇది వర్తిస్తుంది. దీంతో రుణ గ్రహీతలకు బెనిఫిట్ కలుగుతుంది. ఈ తగ్గించిన కొత్త రుణాల రేట్లు డిసెంబర్ 1 నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది.bank;amala akkineni;rbi;bank;december;karnataka 1;job;hdfc;punjabరుణాల వడ్డీ రేట్లను తగ్గించిన సీఎస్ బి... నేటి నుంచే అమలు!రుణాల వడ్డీ రేట్లను తగ్గించిన సీఎస్ బి... నేటి నుంచే అమలు!bank;amala akkineni;rbi;bank;december;karnataka 1;job;hdfc;punjabTue, 01 Dec 2020 15:40:00 GMTకరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలకు కొంత ఉపశమనం కలిగించేందుకు వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే చాలా బ్యాంకులు తమ కస్టమర్ల ఆర్థిక భారాన్ని తగ్గించే క్రమంలో వారి కోసం వారు తీసుకున్న రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే... అయితే ఇప్పుడు సీఎస్‌బీ బ్యాంక్ (క్యాథలిక్ సిరియన్ బ్యాంక్) కూడా తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసీఎల్ఆర్ రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎంసీఎల్ఆర్ రేటులో 0.10 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. ఆరు నెలల కాల పరిమితిలోని రుణాలకు ఇది వర్తిస్తుంది. దీంతో రుణ గ్రహీతలకు బెనిఫిట్ కలుగుతుంది. ఈ తగ్గించిన కొత్త రుణాల రేట్లు డిసెంబర్ 1 నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది. ఇకపోతే ఏడాది కాల పరిమితిలోని ఎంసీఎల్ఆర్‌లో ఎలాంటి మార్పు లేదు. ఏడాది కాల పరిమితిలో తీసుకునే రుణాలకు వడ్డీ రేటు 9.5 శాతంగా ఉంది. ఒక రోజు నుంచి ఆరు నెలల కాల పరిమితిలోని రుణాలపై ఎంసీఎల్ఆర్ 7.7 శాతం నుంచి 8.5 శాతం మధ్యలో ఉంది.



కేవలం ఈ బ్యాంక్ మాత్రమే కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి సంస్థలు కూడా ఎంసీఎల్ఆర్ రేటును సవరించాయి. ఇకపోతే సీఎస్‌బీ బ్యాంక్ ఇటీవలనే ఐపీవోకు కూడా వచ్చింది. ఈ బ్యాంక్ ఐపీవోలో డబ్బులు పెట్టిన వారికి అదిరిపోయే రాబడి వచ్చింది. రూ.195 పెట్టి షేర్లు కొంటే లిస్టింగ్‌లో షేరు ధర రూ.275 వద్ద లిస్ట్ అయ్యింది. ఇకపోతే ఈ సీఎస్ బీ బ్యాంక్ ప్రధానంగా కేరళలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక అలాగే కేరళతో పాటుగా తమిళనాడు, కర్నాటక, మహరాష్ట్రలలో కూడా తన విస్తృత సేవలు వినియోగదారులకు నిరంతరాయంగా అందిస్తోంది. 




ఒకరితో పెళ్లి.. మరొకరితో విహారం... ఆమె నా పెళ్లాం ఎవరికీ చెప్పొద్దని కోరిందన్న భర్త

కేసీఆర్ ఢిల్లీ వెళ్తారా...?

స్మిత్ కు ఆ వీక్నెస్ వుంది.. భారత బౌలర్లకు ఆ మాత్రం తెలియదా..?

గ్రేటర్ యుద్ధం: తెరాస పార్టీ ఓడిపోతే ఇదే కారణం...?

ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్

చిత్రసీమలోనే కాదు.. సమాజ సేవలోనూ సూపర్ స్టార్..! మహేష్ బాబుపై నమ్రత ఎమోషనల్

గ్రేటర్ యుద్ధం: గ్రేటర్ ఎన్నికల్లో స్లో ఓటింగ్.. ఇంకా 20శాతమే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>