PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan5d66ce6d-c364-4e4b-a55b-26574fcb385c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan5d66ce6d-c364-4e4b-a55b-26574fcb385c-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నారు. ఆ కలను నిజం చేసుకునేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మరెన్నో రకాల అవమానాలను ఎదుర్కొంటున్నారు. అసలు పవన్ రాజకీయం ఏమిటి అనేది సొంత పార్టీ నాయకులకు అర్థం కాని పరిస్థితి ఉన్నా, ఏదో రకంగా పార్టీని అధికారం వైపు నడిపించేందుకు ఆయన గట్టిగానే కష్టపడుతున్నారు. సొంతంగా ఎన్నికలకు వెళ్లే కంటే , బలమైన జాతీయ పార్టీ బీజేపీతో జత కట్టి ముందుకు వెళితేనే మంచిదనే అభిప్రాయం ఉన్నా, పవన్ కు ఆ పార్టీ నాయకులు ఊహpavan janasena bjp tirupathi ghmc elections;auto;pawan;allu aravind;kalyan;krishna;tiru;bharatiya janata party;andhra pradesh;janasena;mp;government;tirupati;husband;letter;janasena party;yatra;partyపవన్ మళ్లీ ఒంటరే ? ఆ తుఫాన్ తో క్లారిటీ ?పవన్ మళ్లీ ఒంటరే ? ఆ తుఫాన్ తో క్లారిటీ ?pavan janasena bjp tirupathi ghmc elections;auto;pawan;allu aravind;kalyan;krishna;tiru;bharatiya janata party;andhra pradesh;janasena;mp;government;tirupati;husband;letter;janasena party;yatra;partyTue, 01 Dec 2020 22:00:00 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నారు. ఆ కలను నిజం చేసుకునేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మరెన్నో రకాల అవమానాలను ఎదుర్కొంటున్నారు. అసలు పవన్ రాజకీయం ఏమిటి అనేది సొంత పార్టీ నాయకులకు అర్థం కాని పరిస్థితి ఉన్నా, ఏదో రకంగా పార్టీని అధికారం వైపు నడిపించేందుకు ఆయన గట్టిగానే కష్టపడుతున్నారు. సొంతంగా ఎన్నికలకు వెళ్లే కంటే , బలమైన జాతీయ పార్టీ బీజేపీతో జత కట్టి ముందుకు వెళితేనే మంచిదనే అభిప్రాయం ఉన్నా, పవన్ కు ఆ పార్టీ నాయకులు ఊహించిన విధంగా షాక్ లు ఇస్తూ, షేక్ చేస్తున్నారు. అసలు జనసేన తో తమకు సంబంధం లేదన్నట్లు గా, బిజెపి వ్యవహరిస్తున్న తీరు పవన్ కు ఆగ్రహం కలిగిస్తోంది. 




ఇటీవల గ్రేటర్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న జనసేన పై   నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పూర్తిగా చులకన చేసినట్టు గా జనసేన విషయంలో వ్యవహరించడంతో ,పవన్ కు ఆగ్రహం కలిగింది. ఇక ఏపీలో సొంతంగా బలం పెంచుకునేందుకు చూస్తున్నారు  ప్రభుత్వంపై ఆందోళన చేద్దామని ప్రయత్నిస్తున్నారు. చాలా సందర్భాల్లో జనసేన నిర్ణయాలను బిజెపి అడ్డుకోవడం, ప్రతి అంశంలోనూ బిజెపికి చెప్పి జనసేన ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండడం, ఇవన్నీ లెక్కలు వేసుకుని ఏపీలో ఒంటరిగానే బలం పెంచుకోవాలి అని నిర్ణయించుకున్నారో ఏమో తెలియదు కానీ, ఇప్పుడు నివర్ తుఫాన్ కారణంగా పంటలు దెబ్బతిని రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చొరవ చూపించడం లేదని ఆరోపిస్తూ పవన్ రెండో తేదీ నుంచి కృష్ణ, గుంటూరు జిల్లాలో, 3 4 5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.అయితే ఎక్కడా బీజేపీని సంప్రదించకపోవడం, సొంతంగానే జనసేన ఈ కార్యక్రమం చేపట్టడంతో ఇకపై బీజేపీని పరిగణలోకి తీసుకునే ఆలోచనలో పవన్ లేనట్టుగానే అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి.



 ఇటీవల తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో జనసేన అభ్యర్థి త్వరలో ఈ విషయమై బీజేపీ అభ్యంతరం చెప్పినట్లు వార్తలు వచ్చిన క్రమంలో చిత్తూరు జిల్లాలో పర్యటన పెట్టుకోవడం, తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు సమావేశాలు ఏర్పాటు చేయడం వంటి వ్యవహారాలు చూస్తుంటే బీజేపీ కలిసి వచ్చినా, రాకపోయినా సొంతంగానే బలం పెంచుకునే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరి పవన్ రైతు యాత్ర పై బిజెపి ఏ విధంగా స్పందిస్తుందో.. ఆ తర్వాత జరగబోయే పరిణామాలు ఏమిటి అనేది ఉత్కంఠగా మారింది.



గ్రేటర్ యుద్ధం : టీయారెస్ ముచ్చట ఈసారీ తీరదా ?

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?

గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>