PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war963dc605-8acf-4114-9b8f-80a83450b2f6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war963dc605-8acf-4114-9b8f-80a83450b2f6-415x250-IndiaHerald.jpgప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారని, ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ప్రజలకు డబ్బులు పంచుతున్నారని భోలక్‌ఫూర్‌ డివిజన్‌ బీజేపీ అభ్యర్థి ఆర్‌.విశ్వం ఆరోపించారు. సోమవారం భోలక్‌పూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ విధానాల పట్ల ప్రజలు విసుగు చెందరన్నారు. వారి ఆగడాలు చూడలేని ప్రజలు బీజేపీకి మద్దతు పలికారని పేర్కొన్నారు. greater-war;poorna;vishwa;bharatiya janata party;telangana rashtra samithi trs;aquaగ్రేటర్ యుద్ధం: ‘‘గెలుపు కోసం టీఆర్ఎస్ డబ్బుల దందా’’గ్రేటర్ యుద్ధం: ‘‘గెలుపు కోసం టీఆర్ఎస్ డబ్బుల దందా’’greater-war;poorna;vishwa;bharatiya janata party;telangana rashtra samithi trs;aquaTue, 01 Dec 2020 12:32:18 GMTబీజేపీ అభ్యర్థి ఆర్‌.విశ్వం ఆరోపించారు. సోమవారం భోలక్‌పూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ విధానాల పట్ల ప్రజలు విసుగు చెందరన్నారు. వారి ఆగడాలు చూడలేని ప్రజలు బీజేపీకి మద్దతు పలికారని పేర్కొన్నారు. డివిజన్‌లోని ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని మాటలకే పరిమితమైన టీఆర్‌ఎస్‌కు తమ ఓటు హక్కుతో గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. భోలక్‌పూర్‌లో కలుషిత నీటి సమస్య విపరీతంగా ఉందని, టీఆర్ఎస్ దాని గురించి కనీసం పట్టించుకోలేదన్నారు. తనను గెలిపిస్తే కలుషిత నీటి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని పేర్కొన్నారు. డివిజన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రజలందరూ బీజేపీకి సంపూర్ణ మద్దతు పలికారన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజీపీ నాయకులు పాల్గొన్నారు.

మంచి అభ్యర్థికే ప్రజలు ఓటేయాలని భోలక్‌ఫూర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బింగి నవీన్‌ అన్నారు. సోమవారం భోలక్‌పూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రవేశపెట్టిన పథకాలే టీఆర్‌ఎస్‌ విజయానికి దోహదపడతాయన్నారు. డివిజన్‌లోని హిందూ ముస్లింలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచారన్నారు. వారు అభివృద్ధిని కోరుకుంటున్నారు కాబట్టే టీఆర్ఎస్ గెలుపును కోరుకుంటున్నారు. ఎంఐఎం, కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల స్వార్థ రాజకీయాలను ప్రజలు గుర్తించారని, వారికి ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. డివిజన్‌లోని ప్రజల మద్దతు టీఆర్‌ఎస్‌కే ఉందన్నారు. ప్రజల మధ్య మత కల్లోలాలు సృష్టించి లాభం పొందాలని బీజేపీ నాయకులు చూస్తున్నారు. గ్రేటర్  ప్రజలు తమ ఓటు ద్వారా వారికి తగిన బుద్ధి చెబుతారన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో విజయం ఖాయమని బింగినవీన్‌ ధీమా వ్యక్తం చేశారు.


గ్రేటర్ యుద్ధం : పోలింగ్ కేంద్రాల్లో గులాబిరంగు మాస్కులు..?

గ్రేటర్ యుద్ధం: శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి.. 105 స్ల్రయిక్ పోర్స్ రంగంలోకి?

మహేశ్‌ను పట్టుకున్న సితార.. నాన్న నా నుంచి తప్పించుకోలేవంటూ...

కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు

తెలుగు హీరోస్ ఆటోగ్రాఫ్స్ ఎలా ఉంటాయి..మీరెన్నడు చూడని హీరోల సంతకాలు

గ్రేటర్ యుద్ధం: చిరంజీవి సహా సినీ వర్గం ఓటు ఎటువైపు..?

బ్రేకింగ్: గ్రేటర్ లో ఎగ్జిట్ పోల్స్ నిషేధం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>