PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tiger0d0ec352-76f2-465a-89f9-9633d6aad097-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tiger0d0ec352-76f2-465a-89f9-9633d6aad097-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో పెద్ద పులిల దాడులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి హడలెత్తించింది. కాగజ్ నగర్ మండలం కడంబ అటవీ ప్రాంతంలో మేతకు వెళ్ళిన నాలుగు బర్రెల పై పెద్ద పులి దాడి చేసింది. ఒక్కసారిగా పులి దాడికి దిగడంతో బెదిరిపోయిన ఆ బర్రెలు పారిపోయి అడవి మార్గం ద్వారా ఆడెపల్లికి గ్రామానికి చేరుకున్నాయి.tiger;tiru;huzur nagar;village;fort;tiger;cow slaughter;petta;asifabadఆసిఫాబాద్ జిల్లాలో మరో సారి పెద్ద పులి కలకలం..!ఆసిఫాబాద్ జిల్లాలో మరో సారి పెద్ద పులి కలకలం..!tiger;tiru;huzur nagar;village;fort;tiger;cow slaughter;petta;asifabadTue, 01 Dec 2020 20:43:30 GMTఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి హడలెత్తించింది. కాగజ్ నగర్ మండలం కడంబ అటవీ ప్రాంతంలో మేతకు వెళ్ళిన నాలుగు బర్రెల పై పెద్ద పులి దాడి చేసింది. ఒక్కసారిగా పులి దాడికి దిగడంతో బెదిరిపోయిన ఆ బర్రెలు పారిపోయి అడవి మార్గం ద్వారా ఆడెపల్లికి గ్రామానికి చేరుకున్నాయి.

ఈ బర్రెలు కడంబ గ్రామానికి చెందిన కోట మల్లయ్య బర్రెలుగా గ్రామస్థులు గుర్తించారు. కాగజ్ నగర్ మండలం మాణిక్ పటార్ అటవీ ప్రాంతంలో పెద్దపులి గ్రామస్థులకు తారసపడింది. పులి పాద ముద్రలు కూడా లభ్యమయ్యాయి. ఇదిలా ఉంటె నిన్న పెంచికల్ పేట మండలం మేరేగుడా గ్రామ సమీపంలో పత్తి చేనులో పత్తి ఏరుతున్న జాడి ఏమజి, హేమలత లకు పులి కనించడంతో వారు భయంతో అరుస్తు అక్కడి నుంచి పారిపోయారు. వారి అరుపులు విన్న పులి అడవిలోకి పారిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు. అధికారులు స్పందించి తమకు పెద్ద పులి నుంచి రక్షణ కల్పించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

ఈ నెల 11న దహెగాం మండలం దిగుడ గ్రామంలో ఓ పులి గిరిజన యువకుడిపై దాడి చేసి హతమార్చింది. ఈ సంఘటన జరిగి నెల రోజులు కూడా కాకముందే మరో ఘటన చోటుచేసుకోవడం జిల్లాలోని సరిహద్దు గ్రామాల ప్రజలను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. అయితే దాని జాడ లభించకపోగా పలుచోట్ల పులి ఆవుల మందపై దాడి చేయడం, బాటసారులను హడలెత్తించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఈ ఘటన ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఇదిలా ఉంటే గతంలో యువకుడిపై దాడి చేసిన పులి, యువతిని హతమార్చిన పులి ఒక్కటేనా అని నిర్ధారణ కావాల్సి ఉంది. అసలు జిల్లాలో ఎన్ని పులులు తిరుగుతున్నాయి, అవి ఏ ప్రాంతం నుంచి వచ్చాయన్నది కూడా తెలియాల్సి ఉంది. జిల్లాలో వరుస ఘటనలతో అటవీ ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు.


సౌత్ బ్యూటీస్ తమ పవరేంటో చూపిస్తున్నారు..!

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?

గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>