Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war8b79433c-72ba-45b7-a764-9859256713ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war8b79433c-72ba-45b7-a764-9859256713ce-415x250-IndiaHerald.jpgతెలంగాణలోని అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ నేడు జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో కరోనా బాధితులందరికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిహెచ్ఎంసి అధికారులు అవకాశం కల్పించారు అన్న విషయం తెలిసిందే. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు. ఇక మొనgreater-war;prasanna;congress;partyగ్రేటర్ యుద్ధం : పోలింగ్ కేంద్రాల్లో గులాబిరంగు మాస్కులు..?గ్రేటర్ యుద్ధం : పోలింగ్ కేంద్రాల్లో గులాబిరంగు మాస్కులు..?greater-war;prasanna;congress;partyTue, 01 Dec 2020 13:30:00 GMT



 ఇక మొన్నటి వరకు అన్ని పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకుని భారీ మెజారిటీ సాధించి విజయం సాధించడమే లక్ష్యంగా ముమ్మర ప్రచారం నిర్వహించారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేశారు. అయితే ఇక ప్రచార రంగంలో ఏ అభ్యర్థులు ఓటర్లను ఎంతమేరకు ఆకట్టుకున్నారు ఎంతమేరకు అభివృద్ధి చేస్తారు అనే నమ్మకాన్ని ఓటర్లలో కల్పించారు అన్న విషయం నేడు తేల్చేయనున్నారు ఓటర్ మహాశయులు . కాగా ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి పార్టీ గుర్తులకు కానీ అనుమతి ఇవ్వడం లేదు ఎన్నికల అధికారులు అన్న విషయం తెలిసిందే.




 ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ కేంద్రాలు టిఆర్ఎస్కు చెందిన వారు కొంతమంది గులాబీ రంగు మాస్కులు ధరించి రావడం చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే.. టిఆర్ఎస్ కు చెందిన వారు గులాబీ రంగు మాస్కులు ధరించడం పై కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు పిసిసి ఎన్నికల కమిటీ కన్వీనర్ నిరంజన్ ఎన్నికల కమిషనర్ పార్థసారథికి  ఫిర్యాదు చేశారు. ఇక వెంటనే స్పందించిన పోలీసు అధికారులు వారు  గులాబీ మాస్కులు తీసివేసే విధంగా చర్యలు తీసుకున్నారు. కాగా ప్రస్తుతం నగరంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.


గ్రేటర్ యుద్ధం: శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి.. 105 స్ల్రయిక్ పోర్స్ రంగంలోకి?

గ్రేటర్ యుద్ధం: ‘‘గెలుపు కోసం టీఆర్ఎస్ డబ్బుల దందా’’

మహేశ్‌ను పట్టుకున్న సితార.. నాన్న నా నుంచి తప్పించుకోలేవంటూ...

కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు

తెలుగు హీరోస్ ఆటోగ్రాఫ్స్ ఎలా ఉంటాయి..మీరెన్నడు చూడని హీరోల సంతకాలు

గ్రేటర్ యుద్ధం: చిరంజీవి సహా సినీ వర్గం ఓటు ఎటువైపు..?

బ్రేకింగ్: గ్రేటర్ లో ఎగ్జిట్ పోల్స్ నిషేధం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>