PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/modicae8967d-ebc4-42ac-8422-a285943ae0e6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/modicae8967d-ebc4-42ac-8422-a285943ae0e6-415x250-IndiaHerald.jpgదేశంలో క‌రోనా వైర‌స్ (కోవిడ్‌-19) చాప‌కింద నీరులా వ్యాపిస్తూనే ఉంది. ప‌లు రాష్ట్రాల్లో అయితే, ఆందోళ‌న‌క‌ర స్థాయిలో వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే దేశంలో మ‌రో ద‌శ క‌రోనా వైర‌స్ విజృంభించే అవకాశ‌ముంద‌నే నేప‌థ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మయ్యాయి. ఈ నేప‌థ్యంలోనే దేశంలో క‌రోనా వైర‌స్ మ‌హమ్మారి ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై చ‌ర్చించ‌డానికి ఈ నెల 4న (డిసెంబ‌ర్ 4) అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించ‌డానికి ప్ర‌ధాని మోడీ స‌ర్కారు నిర్ణ‌యించింది.modi;auto;modi;joshiy;apple;east;minister;letter;118;central government;european union;custard appleపెరుగుతున్న క‌రోనా ప్ర‌భావం.. ఈ నెల 4న ప్ర‌ధాని మోడీ నేతృత్వంలో అఖిల‌ప‌క్ష స‌మావేశంపెరుగుతున్న క‌రోనా ప్ర‌భావం.. ఈ నెల 4న ప్ర‌ధాని మోడీ నేతృత్వంలో అఖిల‌ప‌క్ష స‌మావేశంmodi;auto;modi;joshiy;apple;east;minister;letter;118;central government;european union;custard appleTue, 01 Dec 2020 15:52:18 GMTదేశంలో క‌రోనా వైర‌స్ (కోవిడ్‌-19) చాప‌కింద నీరులా వ్యాపిస్తూనే ఉంది. ప‌లు రాష్ట్రాల్లో అయితే, ఆందోళ‌న‌క‌ర స్థాయిలో వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే దేశంలో మ‌రో ద‌శ క‌రోనా వైర‌స్ విజృంభించే అవకాశ‌ముంద‌నే నేప‌థ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మయ్యాయి. ఈ నేప‌థ్యంలోనే దేశంలో క‌రోనా వైర‌స్ మ‌హమ్మారి ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై చ‌ర్చించ‌డానికి ఈ నెల 4న (డిసెంబ‌ర్ 4) అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించ‌డానికి ప్ర‌ధాని మోడీ స‌ర్కారు నిర్ణ‌యించింది.

ఈ స‌మావేశం ప్ర‌ధాని మోడీ నేతృత్వంలో వ‌ర్చువ‌ల్ మోడ్‌లో జ‌ర‌గ‌నున్న‌ది. ఆన్‌లైన్‌లో జ‌రిగే ఈ స‌మావేశంలో పార్ల‌మెంట్ స‌భ్యుల‌తో పాటు అన్ని పార్టీల ఫ్లోర్ లీడ‌ర్లు పాల్గొన‌నున్నారు. పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ఈ అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని స‌మ‌న్వ‌యం చేస్తోంది. దీనికి సంబంధించి ఆ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. ఈ నెల 4న జ‌రిగే అఖిల‌ప‌క్ష స‌మావేశానికి సంబంధించి అన్ని పార్టీల‌కు ఇప్ప‌టికే ఆహ్వానాలు పంపించారు. శుక్ర‌వారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంద‌ని తెలిపింది. 

కారోనా నేప‌థ్యంలో అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించ‌డం ఇది రెండో సారి. ఈ స‌మావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంమంత్రి అమిత్‌షా, ఆరోగ్యశాఖ మంత్రి హర్ష్‌వర్ధన్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రులు కూడా హాజ‌రుకానున్న‌ట్టు స‌మాచారం. 

కాగా, దేశంతో క‌రోనా వైర‌స్ బారినప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రి‌త్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 31,118 పాజిటివ్ కేసులు, 482 మ‌ర‌ణాలు న‌మోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 94,62,810కి చేరింది. మొత్తం మ‌ర‌ణాలు 1,37,621కి పెరిగాయి. ఇప్ప‌టివ‌ర‌కూ దేశంలో మొత్తం 88,89,585 మంది కోలుకున్నారు. దీంతో రిక‌వ‌రీ రేటు 93.94 శాతానికి మ‌ర‌ణాల రేటు 1.5 శాతానికి చేరింది.



పాపం ..బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన యేళ్ళ తరబడి ఇంకో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న దర్శకులు

ఒకరితో పెళ్లి.. మరొకరితో విహారం... ఆమె నా పెళ్లాం ఎవరికీ చెప్పొద్దని కోరిందన్న భర్త

కేసీఆర్ ఢిల్లీ వెళ్తారా...?

స్మిత్ కు ఆ వీక్నెస్ వుంది.. భారత బౌలర్లకు ఆ మాత్రం తెలియదా..?

గ్రేటర్ యుద్ధం: తెరాస పార్టీ ఓడిపోతే ఇదే కారణం...?

ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్

చిత్రసీమలోనే కాదు.. సమాజ సేవలోనూ సూపర్ స్టార్..! మహేష్ బాబుపై నమ్రత ఎమోషనల్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>