PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmcf6c7c3d6-3198-4939-8d4a-00b3fad1048e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmcf6c7c3d6-3198-4939-8d4a-00b3fad1048e-415x250-IndiaHerald.jpgజీహెచ్ఎంసీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇటీవ‌లే అన్ని రాజ‌కీయ పార్టీలు ముమ్మ‌రంగా ప్ర‌చారం సాగించాయి. బ‌రిలో నిలిచి అభ్య‌ర్థులు నువ్వా నేనా అనే రీతిలో ప్ర‌చారాన్ని కొన‌సాగించి.. హాట్ హాట్ సంచ‌ల‌న కామెంట్ల‌తో ప్ర‌చారంలో దూసుకుపోతూ... ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకునే ప్ర‌త‌య్నం చేశారు. ప్ర‌చారం ముగిసి.. నేడు జ‌రుగుతున్న ఎన్నిక‌ల క్ర‌మంలో బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థుల‌తో పాటు స‌ర్వాత్రా ఓటర్లు ఏం తీర్పు ఇస్తారోనని ఉత్కంఠ నెల‌కొన్నిది.ghmc;auto;chiranjeevi;ktr;chinmayi;nagarjuna akkineni;anand malayalam actor;lakshmi;lakshmi manchu;tara;vijay;vijay deverakonda;bharatiya janata party;apple;g kishan reddy;east;polling booth;letter;joseph vijay;central government;european union;custard apple;chief commissioner of elections;reddy;malakpet;anand deverakonda;banjara hills;devarakonda;nampallyఉత్కంఠగా‌ జీఎహ్ఎంసీ ఎన్నిక‌లు.. ఓటు వేసిన ప్ర‌ముఖులు..! ప‌లు చోట్ల ఘ‌ర్ష‌ణ‌లు..! రీపోలింగ్.!ఉత్కంఠగా‌ జీఎహ్ఎంసీ ఎన్నిక‌లు.. ఓటు వేసిన ప్ర‌ముఖులు..! ప‌లు చోట్ల ఘ‌ర్ష‌ణ‌లు..! రీపోలింగ్.!ghmc;auto;chiranjeevi;ktr;chinmayi;nagarjuna akkineni;anand malayalam actor;lakshmi;lakshmi manchu;tara;vijay;vijay deverakonda;bharatiya janata party;apple;g kishan reddy;east;polling booth;letter;joseph vijay;central government;european union;custard apple;chief commissioner of elections;reddy;malakpet;anand deverakonda;banjara hills;devarakonda;nampallyTue, 01 Dec 2020 13:38:50 GMTజీహెచ్ఎంసీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇటీవ‌లే అన్ని రాజ‌కీయ పార్టీలు ముమ్మ‌రంగా ప్ర‌చారం సాగించాయి. బ‌రిలో నిలిచి అభ్య‌ర్థులు నువ్వా నేనా అనే రీతిలో ప్ర‌చారాన్ని కొన‌సాగించి.. హాట్ హాట్ సంచ‌ల‌న కామెంట్ల‌తో ప్ర‌చారంలో దూసుకుపోతూ... ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకునే ప్ర‌త‌య్నం చేశారు. ప్ర‌చారం ముగిసి.. నేడు జ‌రుగుతున్న ఎన్నిక‌ల క్ర‌మంలో బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థుల‌తో పాటు స‌ర్వాత్రా ఓటర్లు ఏం తీర్పు ఇస్తారోనని ఉత్కంఠ నెల‌కొన్నిది.

ఎందుకంటే ఓట‌రు ఎవ‌రివైపు మొగ్గు చూపుతారోన‌ని అంద‌రూ అస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం ప్రారంభ‌మైన ఓటు వేసే ప్ర‌క్రియ.. ప్ర‌స్తుతం అందిన స‌మాచారం ప్ర‌కారం.. చాలా మంద‌కొడిగా ఓటింగ్ ప్రక్రియ కొన‌సాగుతోంది. ప‌లు చోట్ల ఘ‌ర్ష‌ణ‌లు సైతం చోటుచేసుకున్నాయి. మ‌రికొన్ని చోట్ల ఓటింగ్‌ను సైతం నిలిపివేశారు. ఈ నేప‌థ్యంలోనే ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుని.. భారీగా పోలింగ్ బూతుల‌కు త‌ర‌లివ‌చ్చి అంద‌రూ త‌మ ఓటును ఉప‌యోగించుకోవాల‌ని పిలుపునిచ్చారు. 

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-4లోని పోలింగ్‌ కేంద్రంలో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.అలాగే, కుందన్‌బాగ్‌ చిన్మయి స్కూల్‌లో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ దంపతులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.  అంబర్‌పేట ఇండోర్‌ స్టేడియంలో హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ దంపతులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. నాంపల్లి వ్యాయామశాల హైస్కూల్‌లో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్ కుటుంబం ఓటు హ‌క్కును ఉప‌యోగించుకున్నారు. 

ఇక ప‌లువ‌రు సినీ తార‌లు కూడా త‌మ ఓటు హ‌క్కును ఉప‌యోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభంలోనే ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, మంచు లక్ష్మి, తనికెళ్లతో పాటు..రాజకీయ ప్రముఖులైన కేటీఆర్, కిషన్ రెడ్డి తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీ హిల్స్‌ పబ్లిక్ స్కూల్‌లోని పోలింగ్ కేంద్రంలో నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ కుటుంబసభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉండ‌గా ప‌లు  చోట్ల ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకోవ‌డం కూడా క‌లక‌లం రేపుతోంది.  టీఆర్‌ఎస్ కార్యకర్తలు  డబ్బులు పంచుతున్నారని బీజేపీ అభ్యర్థి ఆందోళనకు దిగిన నేప‌థ్యంలో న్యూ హఫీజ్‌పేట ఆదిత్యనగర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో గుర్తులు తారుమారు కావ‌డంతో రీపోలింగ్‌కు ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. బుధ‌వారం పోలింగ్ జ‌ర‌గ‌నుంది.



రాజమౌళిని సెలవడిగిన రామ్ చరణ్..! అందుకేనా?

కెప్టెన్ గా ధోనీ ఉన్నా.. నేను ఇదే మాట చెబుతా..?

ఆస్ట్రేలియాలో టీమిండియా అసలు సమస్య అదే : ఆకాశ్ చోప్రా

గ్రేటర్ యుద్ధం: శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి.. 105 స్ల్రయిక్ పోర్స్ రంగంలోకి?

గ్రేటర్ యుద్ధం: ‘‘గెలుపు కోసం టీఆర్ఎస్ డబ్బుల దందా’’

మహేశ్‌ను పట్టుకున్న సితార.. నాన్న నా నుంచి తప్పించుకోలేవంటూ...

కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>