PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-yuddam-geate-gelupevqridhi-partyla-sameekaranalivee5ba8cae-bf75-4395-aa75-1c678b9111b9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-yuddam-geate-gelupevqridhi-partyla-sameekaranalivee5ba8cae-bf75-4395-aa75-1c678b9111b9-415x250-IndiaHerald.jpgమేయర్‌ పీఠం సొంతం చేసుకోవాలంటే… కాస్త అటు ఇటు గా 102 ఓట్ల బలం అవసరమవుతుంది. ఇది ఇది ఆయా పార్టీల బలాల పై ఆధారపడి ఉంటుంది. ముందుగా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ లెక్కలు చూస్తే… ఆ పార్టీకి మొత్తం 37 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు ఉన్నారు. ఈ లెక్కప్రకారం టీఆర్‌ఎస్ గెలవాల్సిన డివిజన్లు 65గా ఉన్నాయి. మంచి జోరు మీదున్న కారుకు ఇది పెద్ద విషయం కాదని అంచనా వేస్తున్నారు. greater war;ktr;revanth;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;mp;car;minister;party;racchaగ్రేటర్ యుద్ధం: గ్రేటర్ గెలుపెవరిది పార్టీల సమీకరణాలు ఇవే...?గ్రేటర్ యుద్ధం: గ్రేటర్ గెలుపెవరిది పార్టీల సమీకరణాలు ఇవే...?greater war;ktr;revanth;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;mp;car;minister;party;racchaTue, 01 Dec 2020 11:00:00 GMTహైదరాబాద్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు  పలు పార్టీల నేతలు. రోడ్డు షోలు నిర్వహిస్తూ తమ పార్టీ గొప్పదంటూ... ఇతర పార్టీలను తెగ దూషిస్తూ, ఆరోపణలు చేస్తున్నారు కొందరు నాయకులు. అబద్దపు ప్రచారాలకు ఆగం కావొద్దు, ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలే.. తమ నినాదం విశ్వనగరం. వాళ్ల విధానం విద్వేష నగరం, టీఆర్ఎస్‌కే మీ ఓటు అని ఓ వైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తుతుంటే... మరోవైపు బిజెపి నాయకులు మరోసారి మోసపోవద్దని ప్రజలను హెచ్చరిస్తు తమకు అవకాశం ఇస్తే  అసలైన అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామంటున్నారు. ఇక ఇటు చూస్తే ఎన్నికల సమయం దగ్గరకు రానే వస్తోంది.... ఏ పార్టీకి ఎంత విషయం ఉందో తెలిసే సమయం ముందుంది.

కాగా యుద్ధాన్ని తలపించేలా పార్టీలు  తలపడుతున్న తరుణంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకోనున్నారన్న విషయం... అందుకు కావాల్సిన డివిజన్ల లెక్కలు, ఏ ఏ పార్టీలో ఎన్ని జమ కానున్నయో అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గ్రేటర్‌లో మొత్తం 150 డివిజన్లు ఉండగా, ఈ డివిజన్లలో కార్పొరేటర్ లను ప్రజలు స్వేచ్ఛగా ఎన్నుకోనున్నారు. మేయర్ ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరగనుంది. గ్రేటర్‌ ఓటు హక్కు కలిగిన ఎక్స్‌ అఫీషియో సభ్యులు కలిసి మేయర్‌ను తమకు నచ్చిన విధంగా ఎన్నుకొనే అవకాశం కలిగి ఉంటారు. ఇక అసలు విషయానికొస్తే..150 కార్పొరేటర్ల తో పాటు.. గ్రేటర్ లోని ప్రజాప్రతినిధులు… గవర్నర్‌ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలతో కలిసి మొత్తం 52 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులను కలిగి ఉన్నారు.

దీంతో మేయర్‌ ఎన్నికకు మొత్తం ఓట్ల సంఖ్య 202 గా లెక్కకు వచ్చింది. దీని అర్థం ఏంటంటే.. మేయర్‌ పీఠం సొంతం చేసుకోవాలంటే… కాస్త అటు ఇటు గా 102 ఓట్ల బలం అవసరమవుతుంది. ఇది ఇది ఆయా పార్టీల బలాల పై ఆధారపడి ఉంటుంది. ముందుగా అధికార పార్టీ  టీఆర్‌ఎస్‌ లెక్కలు చూస్తే… ఆ పార్టీకి మొత్తం 37 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు ఉన్నారు. ఈ లెక్కప్రకారం టీఆర్‌ఎస్ గెలవాల్సిన డివిజన్లు 65గా ఉన్నాయి. మంచి జోరు మీదున్న కారుకు ఇది పెద్ద విషయం కాదని అంచనా వేస్తున్నారు. ఇక  గ్రేటర్ ఎన్నికల ప్రచారాల లో రచ్చ రచ్చ చేస్తున్న బీజేపీ బలాబలాలను ఒకసారి పరిశీలిస్తే… ముగ్గురు ఎక్స్‌ అఫీసియో సభ్యులున్నారు. దీన్నిబట్టి గ్రేటర్‌లో మేయర్ పీఠం దక్కించుకోవాలంటే.. తక్కువలో తక్కువ బీజేపీ 99 డివిజన్లలో విజయం సాధించాల్సి ఉంటుంది. బిజెపి గ్రేటర్ పీఠం వరుసలో కాస్త దగ్గరగానే ఉన్న కష్టపడాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే.. ఒక్కరే ఎంపీ ఉన్నారు. మల్కాజ్‌గిరీ నియోజకవర్గం నుంచి గెలిచిన రేవంత్ రెడ్డికి ఓటు హక్కు ఉంది. ఈ పార్టీ మేయర్ పీఠం కోసం ఏకంగా 101 డివిజన్లలో విజయం సాదించాల్సి ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం ఎంఐఎం,కాంగ్రెస్ గెలవాలంటే మాత్రం చాలా కష్టపడాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


గ్రేటర్ యుద్ధం: ‘‘నిర్భయంగా ఓటేయండి.. మరోసారి గెలిపించండి..’’

సమంతే తల బాదుకుంటుంటే.. ఆమె బాటలో నడుస్తుందట !

గ్రేటర్ యుద్ధం: బయటకు రాని సెటిలర్లు.. అభ్యర్థుల్లో గుబులు..

ఆఖరి రోజు అగ్రనేతల హల్చల్.. విజయం ఎవరికీ దక్కేనో..?

గ్రేటర్ యుద్ధం : పలుచోట్ల బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఘర్షణ..?

గ్రేటర్ యుద్దం: ఓటు వేసి సైలెంట్ గా వెళ్ళిన చిరు..అందుకేనా ?

కొనసాగుతున్న రైతుల ఆందోళన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>