MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sweetie-no-matter-how-hard-the-result-ised7c8b37-a6c2-49f6-abdf-2b46e066ad08-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sweetie-no-matter-how-hard-the-result-ised7c8b37-a6c2-49f6-abdf-2b46e066ad08-415x250-IndiaHerald.jpgవామ్మో.. ఈ బరువు తగ్గించుకోవడం తన వల్ల కాదని సినిమాలు తగ్గించుకుంటోంది అనుష్క. ఇక స్వీటీనే లైట్‌ తీసుకోవడంతో, దర్శకనిర్మాతలు కూడా ఆమెను పక్కనపెట్టేస్తున్నారానే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే జేజమ్మ తన వల్ల కాదని హింట్స్‌ ఇస్తున్నా, జనాలు మాత్రం సైలెంట్ గా ఉండటం లేదు. మరి అభిమానుల కోసమైన అనుష్క మునుపటి లుక్‌తో తిరిగొస్తుందా అనే సందేహాలు వాళ్లలో నెలకొన్నాయి. sweetie no matter how hard the result is;anoushka;anushka;akshay;varsha;remake;bhagamathiస్వీటీ ఎంత కష్టపడినా.. ఫలితం మాత్రం..!స్వీటీ ఎంత కష్టపడినా.. ఫలితం మాత్రం..!sweetie no matter how hard the result is;anoushka;anushka;akshay;varsha;remake;bhagamathiTue, 01 Dec 2020 05:00:00 GMTఅనుష్క మునుపటి లుక్‌తో తిరిగొస్తుందా అనే సందేహాలు వాళ్లలో నెలకొన్నాయి.

అనుష్క 'నిశ్శబ్ధం' సినిమాలో చాలా దారుణంగా కనిపించిందనే కామెంట్స్‌ వచ్చాక అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. మరో మూవీకి సైన్‌ చేయకుండా సైలెంట్ అయ్యింది. ఇక స్వీటీ సైలెంట్ అవ్వడంతో దర్శకనిర్మాతలు కూడా ఈమెని లైట్‌ తీసుకున్నారు. అయితే 'దుర్గామతి' ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యాక, అనుష్కకి బోల్డన్ని రిక్వెస్టులు వస్తున్నాయి. మళ్లీ యాక్టివ్‌కమ్మని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు.

అనుష్క దెయ్యాల కథతో చేసిన 'భాగమతి'ని హిందీలో 'దుర్గామతి'గా రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్‌ నిర్మాణంలో భూమి పడ్నేకర్‌ లీడ్‌ రోల్‌లో ఈ రీమేక్‌ రెడీ అయ్యింది. రీసెంట్‌గా 'దుర్గామతి' ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇక ఈ ట్రైలర్ రిలీజ్ కావడం ఆలస్యం అనుష్కని పొగడటం స్టార్ట్ చేశారు నెటిజన్లు. అనుష్క లాంటి హీరోయిన్‌ రావడం కష్టమని కామెంట్‌ చేస్తున్నారు.

అనుష్కని భూమి పడ్నేకర్ అస్సలు మ్యాచ్ చెయ్యలేకపోయిందని, స్ట్రాంగ్‌ క్యారెక్టర్ చెయ్యాలంటే జేజమ్మే కరెక్ట్ అని కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేకాదు అనుష్క మళ్లీ సినిమాలు చెయ్యాలని, వెయిట్‌ తగ్గి కెమెరా ముందుకు రావాలని రిక్వెస్టులు పెడుతున్నారు. మరి అభిమానుల కోరిక మన్నించి అనుష్క మునుపటి లుక్‌తో మెరుస్తుందేమో చూడాలి. మొత్తానికి అనుష్క మళ్లీ సినిమాల్లో యాక్టివ్ కావాలని నెటిజన్లు బలంగా కోరుకుంటున్నారు. ఆమెలా ఎవరూ యాక్ట్ చేయలేరని స్వీటీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అనుష్క మాత్రం బరువు తగ్గించుకునేందుకు తెగ కష్టపడుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
చూద్దాం.. స్వీటీ మారుతుందో లేదో. నెటిజన్ల కోరిక నెరవేరుతుందో.











హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: నంద్యాలలో శిల్పా హవా నడుస్తుందా?

గ్రేటర్ యుద్ధం : అందరి దృష్టంతా ఆ నియోజకవర్గంపైనే..!

గ్రేటర్ లో సెటిలర్లు ఎవరివైపు ఉంటారు..?

గ్రేటర్‌ యుద్ధం : పార్టీల మధ్య హోరాహోరీ !

గ్రేటర్ యుద్దం : పార్టీల జిమ్మీకులు..చిన్న పిల్లలతో డబ్బు పంపిణీ ..!!

బిగ్ రిస్క్ చేస్తున్న బెల్లంకొండ...?

మరో పదినెలల్లో జగన్ సంచలన నిర్ణయం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>