Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/how-could-a-person-can-win-with-a-low-voting-percentage-in-ghmc-elections5e360376-ad3b-441f-96c3-65e8051b0f9e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/how-could-a-person-can-win-with-a-low-voting-percentage-in-ghmc-elections5e360376-ad3b-441f-96c3-65e8051b0f9e-415x250-IndiaHerald.jpgప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకం. ప్రభుత్వాలను ఎన్నుకోవాలన్నా.. నేలకు దించాలన్నా ప్రజలకున్న ఏకైక ఆయుధం ఈ ఓటు. ప్రజలంతా తమ ఓటును వినియోగించుకుని నాయకులను గెలిపిస్తేనే ప్రజాస్వామ్యం సార్థకమవుతుంది. మరి అలాంటి ఓటు వేయడానికి...greater war;hyderabad;election;election commission;nijamఇదేనా ప్రజాస్వామ్యం.. విజేతను ఇలా ఎలా నిర్ణయిస్తారు..?ఇదేనా ప్రజాస్వామ్యం.. విజేతను ఇలా ఎలా నిర్ణయిస్తారు..?greater war;hyderabad;election;election commission;nijamTue, 01 Dec 2020 20:20:00 GMTఇంటర్నెట్ డెస్క్: ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకం. ప్రభుత్వాలను ఎన్నుకోవాలన్నా.. నేలకు దించాలన్నా ప్రజలకున్న ఏకైక ఆయుధం ఈ ఓటు. ప్రజలంతా తమ ఓటును వినియోగించుకుని నాయకులను గెలిపిస్తేనే ప్రజాస్వామ్యం సార్థకమవుతుంది. మరి అలాంటి ఓటు వేయడానికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యకరం.

ఓటింగ్ ప్రారంభమైన 2 గంటల వరకు కేవలం 3 శాతం ఓటింగ్. సాయంత్రం వరకూ కొద్ది కొద్దిగా పెరుగుతూ మొత్తానికి ఎలాగోలా 30 శాతం దాటింది. అంటే దాదాపు 70 శాతం ఓటింగ్ లోటు ఉంది. మరి పోలైన 30 శాతం ఓటింగ్‌తోనే విన్నర్‌ను నిర్ణయిస్తారా..? నిజంగా ప్రజల తీర్పు అదేనంటారా..? 30 శాతం ప్రజల తీర్పుతోనే విజేతను నిర్ణయిస్తే మరి 70 శాతం ప్రజల నిర్ణయమే లేకుండా విజేతను ఎలా నిర్ణయిస్తారు..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలను నిపుణులు సంధిస్తున్నారు. ఇప్పటికే ప్రజాస్వామ్య పద్ధతిలో విజేతను నిర్ణయించడాన్ని అనేక మంది వ్యతిరేకిస్తున్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల పోటీలో ఎంతమందైనా పోటీ చేయవచ్చు. నిలబడిన అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎన్నికల కమిషన్ విజేతగా నిర్ణయిస్తుంది. ఒకవేళ పోటీలో నలుగురు అభ్యర్థులుంటే ఇద్దరికి 25శాతం ఓట్లు, ఒకరికి 20 శాతం ఓట్లు, మరొకరికి 30 శాతం ఓట్లు పోలయ్యాయనుకుందాం. ఆ సమయంలో 30 శాతం ఓటింగ్ వచ్చిన వ్యక్తినే విజేతగా ప్రకటిస్తుంది ఎన్నికల కమిషన్. దీనర్థం 70 శాతం ప్రజలు వ్యతిరేకించిన వ్యక్తే గెలుస్తున్నారు. మరి ఇదేనా నిజమైన ప్రజాస్వామ్యం. ఇలా గెలిచిన వ్యక్తి మొత్తం 100 శాతం మంది ప్రజలకు ప్రాతినిథ్యం ఎలా వహించగలడనే ప్రశ్న ఎప్పటినుంచో వినిపిస్తోంది. అయితే ఈ రోజు జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో ఈ ప్రశ్న మళ్లీ ఊపందుకుంది.

జీహెచ్‌ఎంసీ పోలింగ్ పూర్తయ్యేసరికి 149 డివిజన్లలో 37% వరకు ఓటింగ్ నమోదైంది. మరో చోట రీపోలింగ్ జరుగుతుందని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. అంటే గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల్లో దాదాపు 37% ప్రజలు మాత్రమే తమ నిర్ణయాన్ని తెలిపారు. అంటే 63% మంది ప్రజల నిర్ణయం బహిర్గతం  కాలేదు. బరిలో ఉన్న 4 ప్రధాన పార్టీలు, ఇండిపెండెంట్లనూ లెక్కలోకి తీసుకుంటే ఈ ఓటింగ్ శాతం కూడా చీలిపోతుంది. అలాంటప్పుడు వీళ్ల మధ్య వచ్చిన ఓటింగ్ లెక్కలతోనే విజేతను నిర్ణయించడం సబబేనా..? అదెలా ప్రజాస్వామ్యమవుతుంది..? ‘ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల ద్వారా ఏర్పాటు చేయబడిన వ్యవస్థ’ ఎలా అవుతుంది..? ఇవే ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మిగిలాయి.





ఆసిఫాబాద్ జిల్లాలో మరో సారి పెద్ద పులి కలకలం..!

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?

గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>