Technologyyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/airtel-super-offer-to-new-customersd295c392-97d1-4c48-a6f2-8e3acf2eeb82-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/airtel-super-offer-to-new-customersd295c392-97d1-4c48-a6f2-8e3acf2eeb82-415x250-IndiaHerald.jpgపోటీని తట్టుకునేందుకు టెలికం సంస్థలు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ముఖ్యంగా రిలయన్స్ జియో వచ్చిన తరువాత మిగతా సంస్థలకు కంటిమీద కునుకు లేకుండా పోయిందనడంతో డౌటే లేదు. ఈ నేపథ్యంలోనే మిగిలిన బడా టెలికం సంస్థలు వినియోగదారులకు రకరకాల ఆఫర్లతోairtel;delhi;reliance;success;jio;airtelఎయిర్‌టెర్ బంపర్ ఆఫర్.. కేవలం వారికే!ఎయిర్‌టెర్ బంపర్ ఆఫర్.. కేవలం వారికే!airtel;delhi;reliance;success;jio;airtelTue, 01 Dec 2020 00:00:03 GMTన్యూఢిల్లీ: పోటీని తట్టుకునేందుకు టెలికం సంస్థలు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ముఖ్యంగా రిలయన్స్ జియో వచ్చిన తరువాత మిగతా సంస్థలకు కంటిమీద కునుకు లేకుండా పోయిందనడంతో డౌటే లేదు. ఈ నేపథ్యంలోనే మిగిలిన బడా టెలికం సంస్థలు వినియోగదారులకు రకరకాల ఆఫర్లతో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. అలాంటి ఓ బంపర్ ఆఫర్‌నే ఎయిర్‌టెల్ తాజాగా ప్రకటించింది.
                          
ఎయిర్‌టెల్‌ కొత్త కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్‌ను ఎయిర్‌టెల్ అందిస్తోంది. అంతేకాకుండా 3జీ నుంచి 4జీకి అప్‌గ్రేడ్ అయిన వారికి కూడా ఈ ఆఫర్ అందనుంది. ‘ఎయిర్‌టెల్ థ్యాంక్స్’ యాప్‌ ద్వారా వారికి ఈ ఆఫర్ లభించనుంది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న కొత్త వినియోగదారులకు, అప్‌గ్రేడ్ అయిన వారికి ఫ్రీగా 5 జీబీ డేటా అందించనున్నట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది.  తమ ప్రీపెయిడ్ మొబైల్ నంబరుతో రిజిస్టర్ అయితే, 1జీబీ చొప్పున ఐదు కూపన్లు 72 గంటల వ్యవధిలో యూజర్ల ఖాతాలో క్రెడిట్ అవుతాయి. అవసరం అయినప్పుడు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లోని ‘మై కూపన్స్’ సెక్షన్‌లోకి వెళ్లి రిడీమ్ చేసుకోవచ్చు.

ఈ ఆఫర్ అయిదు సార్లుగా కస్టమర్లకు అందనుంది. 1 జీబీ కూపన్ల రూపంలో లభించనుంది. సబ్‌స్క్రిప్షన్ అయిన తర్వాత 90 రోజుల్లోపు ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. ఒకసారి కూపన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒక్కో కూపన్ వ్యాలిడిటీ 3 రోజులు ఉంటుంది. మొదటి కూపన్ ఏ నెంబరుకైతే వినియోగించామో మిగిలిన కూపన్లు కూడా ఆ నెంబరుకే వినియోగించాల్సి ఉంటుంది.

అంతేకాదు ఈ కూపన్లు పొందిన కొత్త వినియోగదారులకు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ను ఫస్ట్ టైం ఇన్‌స్టాల్ చేసుకున్నందుకు అందించే 2జీబీ ఉచిత డేటా లభించదు. ఈ విధంగానైనా వినియోగదారులను పెంచుకునేందుకు ఎయిర్‌టెల్ ప్రయత్నిస్తోంది. మరి ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.


పాపం బ్రహ్మానందం ... మళ్ళి బౌన్స్ బ్యాక్ అవుతారా .....?

గ్రేటర్ యుద్ధం : అందరి దృష్టంతా ఆ నియోజకవర్గంపైనే..!

గ్రేటర్ లో సెటిలర్లు ఎవరివైపు ఉంటారు..?

గ్రేటర్‌ యుద్ధం : పార్టీల మధ్య హోరాహోరీ !

గ్రేటర్ యుద్దం : పార్టీల జిమ్మీకులు..చిన్న పిల్లలతో డబ్బు పంపిణీ ..!!

బిగ్ రిస్క్ చేస్తున్న బెల్లంకొండ...?

మరో పదినెలల్లో జగన్ సంచలన నిర్ణయం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>