PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-wara05f05bc-ffe2-412b-99d0-5f427b29e266-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-wara05f05bc-ffe2-412b-99d0-5f427b29e266-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎలక్షన్ల పోలింగ్ మొదలైంది. నియోజక వర్గాల్లో పార్టీల పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ బూతుల వద్ద పహారా కాస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడా ఘర్షణలు జరగకుండా చూసుకునేందుకు ఎన్నికల సంఘం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతి పోలింగ్ బూత్ వద్ద పోలీసులు శాంతి భద్రతలు విఘాతం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరే కాకుండా అవసరమైతే అత్యవసర దళాలు కూడా రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాయి. greater-war;bharatiya janata party;telangana rashtra samithi trs;telugu desam party;telangana;congress;telugu;police;survey;tdp;chief commissioner of elections;partyగ్రేటర్ యుద్ధం: శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి.. 105 స్ల్రయిక్ పోర్స్ రంగంలోకి?గ్రేటర్ యుద్ధం: శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి.. 105 స్ల్రయిక్ పోర్స్ రంగంలోకి?greater-war;bharatiya janata party;telangana rashtra samithi trs;telugu desam party;telangana;congress;telugu;police;survey;tdp;chief commissioner of elections;partyTue, 01 Dec 2020 13:00:00 GMT
ఈ క్రమంలో ఎలక్షన్ల కోసం తీసుకున్న జాగ్రత్తలపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి పెదవి విప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతోందని, ఇప్పటి వరకూ పెద్దగా ఘర్షణలు వెలుగు చూడలేదని పార్థసారధి తెలిపారు. పరిస్థితులను పర్యవేక్షించడానికి ఫ్లైయింగ్ స్వ్కాడ్స్, స్టాటిస్టిక్స్ సర్వే టీమ్‌లు అందుబాటులో ఉన్నాయని, ఈ బృందాలు చురుగ్గా పని చేస్తూ డేగ కళ్లతో పహారా కాస్తున్నాయని ఆయన అన్నారు. నగరంలో ఎక్కడైనా శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఎక్కడైనా ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించడానికి 105 స్ట్రైకింగ్ ఫోర్స్ సిద్ధంగా ఉందని చెప్పారు. వారితో పాటు 56 స్పెషల్  స్ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా రెడీగా ఉన్నాయని వెల్లడించారు.

లైవ్ క్యాస్టింగ్ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, పోలింగ్ సమయంలో ఎటువంటి పొరబాట్లు జరగకుండా నిఘా పెట్టామని ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి వెల్లడించారు. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎలక్షన్లు కావడంతో గ్రేటర్ ఎన్నికలపై చాలా ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ కూడా దుబ్బాకలో ఘోర పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కొద్దొ గొప్పో ఉనికి మిగిలి ఉంది భాగ్య నగరంలోనే. అందుకే ఈ ఎన్నికల్లో గెలిచి తాము కూడా పోటీలో ఉన్నామని నిరూపించుకోవాలని టీడీపీ భావిస్తోంది. మరి ఫలితాలు వస్తే గానీ ఎవరి బలా బలాలేమిటో తెలియవు.


గ్రేటర్ యుద్ధం : పోలింగ్ కేంద్రాల్లో గులాబిరంగు మాస్కులు..?

గ్రేటర్ యుద్ధం: ‘‘గెలుపు కోసం టీఆర్ఎస్ డబ్బుల దందా’’

మహేశ్‌ను పట్టుకున్న సితార.. నాన్న నా నుంచి తప్పించుకోలేవంటూ...

కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు

తెలుగు హీరోస్ ఆటోగ్రాఫ్స్ ఎలా ఉంటాయి..మీరెన్నడు చూడని హీరోల సంతకాలు

గ్రేటర్ యుద్ధం: చిరంజీవి సహా సినీ వర్గం ఓటు ఎటువైపు..?

బ్రేకింగ్: గ్రేటర్ లో ఎగ్జిట్ పోల్స్ నిషేధం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>