CookingPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/cooking/81/cooking84905ed2-c63e-4204-a051-69a11ec2e38d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/cooking/81/cooking84905ed2-c63e-4204-a051-69a11ec2e38d-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఇడ్లీలు చాలా బలమైన ఆహారం.పొద్దున్నే మనం తీసుకొనే అల్పాహారాల్లో అన్నికంటే ఇడ్లీలే ఎంతో ఆరోగ్యకరమైనవి.. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఇడ్లీకి వుండే ప్రాధాన్యమే వేరుగా ఉంటుంది. చిన్న పిల్లల దగ్గరనుంచి.. ముసలివాళ్ల దాకా అందరూ ఇడ్లీని ఇష్టంగా తింటారనడంలో సందేహం లేదు. మరి రెగ్యూలర్ ఇడ్లీకి బదులుగా ఓట్స్‌తో ఇడ్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి... ఓట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మరి ఈ రుచికరమైన ఓట్స్ ఇడ్లిని ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్cooking;idili;india;coriander;chilli;oil;ghee;coriander.;ishtamఆరోగ్యకరమైన ఓట్స్ ఇడ్లి ఎలా చెయ్యాలో తెలుసుకోండి...ఆరోగ్యకరమైన ఓట్స్ ఇడ్లి ఎలా చెయ్యాలో తెలుసుకోండి...cooking;idili;india;coriander;chilli;oil;ghee;coriander.;ishtamTue, 01 Dec 2020 12:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఇడ్లీలు చాలా బలమైన ఆహారం.పొద్దున్నే మనం తీసుకొనే అల్పాహారాల్లో అన్నికంటే ఇడ్లీలే  ఎంతో  ఆరోగ్యకరమైనవి.. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఇడ్లీకి వుండే  ప్రాధాన్యమే వేరుగా ఉంటుంది. చిన్న పిల్లల దగ్గరనుంచి.. ముసలివాళ్ల దాకా అందరూ ఇడ్లీని ఇష్టంగా తింటారనడంలో సందేహం లేదు. మరి రెగ్యూలర్ ఇడ్లీకి బదులుగా ఓట్స్‌తో ఇడ్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి... ఓట్స్  ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మరి ఈ రుచికరమైన ఓట్స్ ఇడ్లిని ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి....

ఓట్స్ ఇడ్లి తయారీకి కావాల్సిన కావాల్సిన పదార్థాలు....

ఓట్స్‌- 2 కప్పులు,
పుల్లని పెరుగు-2 కప్పులు,
ఆవాలు-టీస్పూను,
మినప్పప్పు-టేబుల్‌స్పూను,
సెనగపప్పు- అర టేబుల్‌స్పూను,
నూనె-అరటీస్పూను,
పచ్చిమిర్చి-రెండు(సన్నగా తరగాలి),
క్యారెట్‌ తురుము-2 టేబుల్‌స్పూన్లు,
కొత్తిమీర తురుము-టేబుల్‌స్పూను,
పసుపు- చిటికెడు,
ఉప్పు- తగినంత,
ఇనో ఫ్రూట్‌ సాల్ట్‌-చిటికెడు.


ఆరోగ్యవంతమైన ఓట్స్ ఇడ్లి తయారు చేయు విధానం...

ఓట్స్ ఇడ్లి తయారీకి..మొదట బాణలిలో ఓట్స్‌ వేసి కాస్త రంగు మారేవరకూ వేయించాలి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి పొడిలా చేయాలి. ఇప్పుడు చిన్న కడాయిలో నూనె పోసి కాగాక ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు వేసి వేయించాలి. కొద్దిసేపటి తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, క్యారెట్‌ తురుము, పసుపు వేసి ఓ నిమిషం వేగాక దించి ఓట్స్‌ పొడిలో కలపాలి.అందులోనే పెరుగు, తగినంత ఉప్పు వేసి కలిపి ఇడ్లీ మిశ్రమంలా చేయాలి. ఇప్పుడు మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో వేసి సుమారు 15 నిమిషాలు ఉడికించి దించాలి. అంతే వేడివేడి ఓట్స్ ఇడ్లీలు రెడీ అయినట్లే..ఇంకెందుకు ఆలస్యం మరి మీరు ఈ ఆరోగ్యకరమైన ఇడ్లిని ట్రై చేసి చూడండి..ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది డైలీ తింటే పిల్లలు చాలా పుష్టిగా బలంగా ఉంటారు... ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...ఇంకా మరెన్నో వంటకాలు గురించి తెలుసుకోండి...






మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.... మరోసారి ట్రై చేస్తాడట....!!!!

బ్రేకింగ్: గ్రేటర్ లో ఎగ్జిట్ పోల్స్ నిషేధం

జబర్దస్త్ నుండి బిగ్ బాస్.. అవినాష్ తప్పు చేశాడా..?

టాప్ లెస్ ఫోజుల్లో ‘హార్ట్‌ ఎటాక్’ తెప్పిస్తున్న హీరోయిన్

గ్రేటర్ యుద్ధం : ఓటు హక్కు వినియోగించుకున్న సీపీ మహేష్ భగవత్..?

ఏఐసీసీ బాధ్యతలు రాహులకే

బరువు తగ్గే ఆపరేషన్ల వల్ల లాభమా ! నష్టమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>