MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/will-brahmanandam-bounce-back-with-that-movief7444c6e-4230-45cf-9d41-7a46fbbec885-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/will-brahmanandam-bounce-back-with-that-movief7444c6e-4230-45cf-9d41-7a46fbbec885-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమలో హాస్యబ్రహ్మ గా గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించిన నటుడు బ్రహ్మానందం. జంధ్యాల దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, రజిని జంటగా నటించిన అహ నా పెళ్ళంట సినిమా ద్వారా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చారు బ్రహ్మానందం. అప్పట్లో అది పెద్ద సంచలన విజయం అందుకున్న ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ కి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత నుంచి జంధ్యాల సహా పలువురు దర్శకుల సినిమాల్లో కమెడియన్ గా మంచి పాత్రలు దక్కించుకున్న బ్రహ్మానందం మరింత మంచి పేరు గడించారు. brahmanandam;tollywood;rajendra prasad;tollywood;cinema;heart;comedy;comedian;hero;heroine;ala vaikunthapurramloo;jandhyala ravishankarపాపం బ్రహ్మానందం ... మళ్ళి బౌన్స్ బ్యాక్ అవుతారా .....?పాపం బ్రహ్మానందం ... మళ్ళి బౌన్స్ బ్యాక్ అవుతారా .....?brahmanandam;tollywood;rajendra prasad;tollywood;cinema;heart;comedy;comedian;hero;heroine;ala vaikunthapurramloo;jandhyala ravishankarTue, 01 Dec 2020 00:05:39 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమలో హాస్యబ్రహ్మ గా గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించిన నటుడు బ్రహ్మానందం. జంధ్యాల దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, రజిని జంటగా నటించిన అహ నా పెళ్ళంట సినిమా ద్వారా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చారు బ్రహ్మానందం. అప్పట్లో అది పెద్ద సంచలన విజయం అందుకున్న ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ కి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత నుంచి జంధ్యాల సహా పలువురు దర్శకుల సినిమాల్లో కమెడియన్ గా మంచి పాత్రలు దక్కించుకున్న బ్రహ్మానందం మరింత మంచి పేరు గడించారు.

ఆపై వరుస అవకాశాలతో దూసుకెళ్లిన బ్రహ్మానందం ఇప్పటివరకు మొత్తంగా కెరీర్పరంగా వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గొప్ప రికార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఏదైనా సినిమాలో బ్రహ్మానందం ఉన్నారు అంటే ప్రేక్షకుల కడుపు చెక్కలు కావాల్సిందే అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఆ విధంగా బ్రహ్మానందం కెరీర్ లో మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒకటి కొన్నేళ్ళ క్రితం శ్రీనువైట్ల హీరో విష్ణు ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఢీ. జెనీలియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో చారి అనే పాత్రలో బ్రహ్మానందం అత్యద్భుతమైన కామెడీని పండించి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నారు. ఇక అతి త్వరలో ఈ సినిమాకి సీక్వెల్ గా డి డి (డబుల్ డోస్) సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఇకపోతే ఇటీవల హార్ట్ సర్జరీ చేయించుకున్న బ్రహ్మానందం కొన్నాళ్ల నుంచి సినిమాలకు దూరంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితం అలవైకుంఠపురములో సినిమాలో ఒక చిన్న ప్రత్యేకపాత్రలో మెరిశారు బ్రహ్మి. ఇక అతి త్వరలో ఢీ సీక్వెల్ అయిన డి డి సినిమాలో బ్రహ్మానందం ఒక ముఖ్య పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. మొదటిభాగం మాదిరిగానే ఇందులో కూడా బ్రహ్మానందం క్యారెక్టర్ అదిరిపోతుందని అలాగే తప్పకుండా ఈ క్యారెక్టర్ తో టాలీవుడ్ లో కమెడియన్ గా ఆయన బౌన్స్ బ్యాక్ అవటం ఖాయమని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త గనుక నిజమైతే మళ్లీ టాలీవుడ్ లో బ్రహ్మీ నవ్వులు మొదలైనట్లే....!!




గ్రేటర్ యుద్ధం : అందరి దృష్టంతా ఆ నియోజకవర్గంపైనే..!

గ్రేటర్ లో సెటిలర్లు ఎవరివైపు ఉంటారు..?

గ్రేటర్‌ యుద్ధం : పార్టీల మధ్య హోరాహోరీ !

గ్రేటర్ యుద్దం : పార్టీల జిమ్మీకులు..చిన్న పిల్లలతో డబ్బు పంపిణీ ..!!

బిగ్ రిస్క్ చేస్తున్న బెల్లంకొండ...?

మరో పదినెలల్లో జగన్ సంచలన నిర్ణయం..?

గ్రేటర్ యుద్ధం : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పై కేఏ పాల్ వ్యాఖ్యలు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>