PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/jagandee66923-65da-44f5-a050-d79d7c991581-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/jagandee66923-65da-44f5-a050-d79d7c991581-415x250-IndiaHerald.jpgఏపీలో పింఛన్ తీసుకునేవారికి జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. పింఛనుదారులందరికీ ప్రతినెలా డబ్బు అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏ ఒక్క లబ్ధిదారు పింఛను అందక ఇబ్బంది పడకూడదని.. ఇకపై మూడురోజుల పాటూ పింఛన్లు పంపిణీ చేయాలని సీఎంవో ఆదేశించింది. ఈ నిర్ణయం డిసెంబర్‌ నుంచే అమలుకానుంది. డిసెంబర్‌ పింఛన్లను 1, 2, 3 న వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయనున్నారు. jagan;amala akkineni;jagan;andhra pradesh;cm;lieపెన్షన్ దారులకు జగన్ సర్కారు శుభవార్త!పెన్షన్ దారులకు జగన్ సర్కారు శుభవార్త!jagan;amala akkineni;jagan;andhra pradesh;cm;lieTue, 01 Dec 2020 09:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో పించన్ల పంపిణీ జరుగుతుంది. ఈ పించన్ల పంపిణీ కార్యక్రమం ఏపీ లోని గ్రామ మరియు వార్డ్ వాలంటీర్ల ద్వారా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. వాలంటీర్లు లబ్దిదారుల వద్దకే వెళ్లి ఈ పించన్లు అందజేయటం జరుగుతుంది. ఇక ఏపీలో పింఛన్ తీసుకునేవారికి జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. పింఛనుదారులందరికీ ప్రతినెలా డబ్బు అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏ ఒక్క లబ్ధిదారు పింఛను అందక ఇబ్బంది పడకూడదని.. ఇకపై మూడురోజుల పాటూ పింఛన్లు పంపిణీ చేయాలని సీఎంవో ఆదేశించింది. ఈ నిర్ణయం డిసెంబర్‌ నుంచే అమలుకానుంది. డిసెంబర్‌ పింఛన్లను 1, 2, 3 న వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయనున్నారు. ఉద్యోగులకు ఒకటిన వేతనాలు అందినట్లే ప్రతినెలా ఒకటినే పింఛను డబ్బులు అందజేయాలని సీఎం ఆదేశించారు. ఈ ఏడాది జూలై నెల నుంచి పింఛన్ల పంపిణీని ఒకటికే పరిమితం చేశారు.


ఇప్పటి వరకు గిరిజన ప్రాంతాలు వంటి మారుమాల ప్రాంతాల్లో రెండురోజుల పాటు పంపిణీకి వీలు కల్పించారు. వాలంటీర్లు పంపిణీ చేసేందుకు వెళ్లిన సమయంలో ఊళ్లో లేకపోవడం వంటి కారణాలతో ఆ రోజు తీసుకోలేకపోయినవారికి తరువాత నెలలో బకాయితో సహా చెల్లిస్తున్నారు. లబ్ధిదారులెవరూ ఈ విధంగా ఇబ్బంది పడకూడదని, అందరికీ పింఛను అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. అందుకే డిసెంబర్‌ నుంచి ప్రతినెలా ఒకటి, రెండు, మూడున మూడు రోజుల పాటూ పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఏవైనా కారణాల వల్ల ఈ మూడు రోజుల్లో కూడా తీసుకోలేకపోయినవారికి ఆయా వార్డు, గ్రామ సచివాలయాల్లో ఇచ్చే ఏర్పాట్లు చేసేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు.


మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. డిసెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 61,69,832 మందికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,510.90 కోట్లను రాష్ట్రంలోని అన్ని వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శుల ఖాతాల్లో జమచేశారు. వరుసగా మూడునెలలు పింఛను తీసుకోని వారికి నిబంధనల ప్రకారం పింఛను తాత్కాలికంగా నిలిపేసి, మళ్లీ పరిశీలన అనంతరమే కొనసాగించాల్సి ఉంది. అలాంటి వారికీ ఊరట కలిగిస్తూ.. వరుసగా మూడునెలలు పింఛను తీసుకోని 7,462 మందికి మూడునెలల బకాయిలతో కలిపి ఈనెల డబ్బులను పంపిణీ చేయనున్నారు. మూడు రోజుల పాటూ పింఛన్లు పంపిణీ.. మూడు నెలల బకాయిలు ఇప్పుడు పంపిణీ చేయడంతో రెండు గుడ్‌న్యూస్‌లనే చెప్పాలి.


ఎన్నారైలతో బిడెన్ సమావేశం

కేటిఅర్ ఎక్కడ ఓటు వేసారు అంటే...!

గ్రేటర్ యుద్ధం : ఎన్ని బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారో తెలుసా..!?

గ్రేటర్ యుద్దం : ఎన్ని ప్రత్యేకతలో..నేడే పోలింగ్ !!

గ్రేటర్ యుద్ధం : జూబ్లీహిల్స్ లో ఏయే సెలబ్రిటీ ఎక్కడ ఓటు వేస్తారంటే ?

గ్రేటర్ యుద్ధం : అందరి దృష్టంతా ఆ నియోజకవర్గంపైనే..!

గ్రేటర్ లో సెటిలర్లు ఎవరివైపు ఉంటారు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>