MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/finally-manisharma-working-for-super-star-mahesh-babu-movie9d886534-10d8-46ee-82ae-ec74ea397285-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/finally-manisharma-working-for-super-star-mahesh-babu-movie9d886534-10d8-46ee-82ae-ec74ea397285-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ప్రస్తుతం ఒక్కో సినిమాతో మరింతగా పెరుగుతూ వెళ్తోంది. రాజకుమారుడు సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయమైన మహేష్, తొలి సినిమా సూపర్ సక్సెస్ తోనే తండ్రి కృష్ణ కి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు. ఇక ఇటీవల వరుసగా మూడు సక్సెస్ లు అందుకున్న సూపర్ స్టార్ మహేష్, అతి త్వరలో నటించనున్న సినిమా సర్కారు వారి పాట. యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఎంతో గ్రాండ్ లెవెల్లో రూపొందనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జmaheshbabu;manisharma;mahesh;suresh;anil music;anil ravipudi;keerthi suresh;kirti;krishna;mani sharma;parasuram;ram pothineni;rajamouli;srinivas;trivikram srinivas;vamsi;vamsi paidipally;rajaka;andhra pradesh;tollywood;cinema;rajani kanth;huzur nagar;january;blockbuster hit;heroine;success;yuva;film nagar;mythri movie makers;father;gmb entertainments;dilమొత్తానికి మహేష్ సినిమాకి పని చేయనున్న మణిశర్మ .... ఫ్యాన్స్ కి పండగే ....??మొత్తానికి మహేష్ సినిమాకి పని చేయనున్న మణిశర్మ .... ఫ్యాన్స్ కి పండగే ....??maheshbabu;manisharma;mahesh;suresh;anil music;anil ravipudi;keerthi suresh;kirti;krishna;mani sharma;parasuram;ram pothineni;rajamouli;srinivas;trivikram srinivas;vamsi;vamsi paidipally;rajaka;andhra pradesh;tollywood;cinema;rajani kanth;huzur nagar;january;blockbuster hit;heroine;success;yuva;film nagar;mythri movie makers;father;gmb entertainments;dilTue, 01 Dec 2020 19:00:00 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ప్రస్తుతం ఒక్కో సినిమాతో మరింతగా పెరుగుతూ వెళ్తోంది. రాజకుమారుడు సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయమైన మహేష్, తొలి సినిమా సూపర్ సక్సెస్ తోనే తండ్రి కృష్ణ కి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు. ఇక ఇటీవల వరుసగా మూడు సక్సెస్ లు అందుకున్న సూపర్ స్టార్ మహేష్, అతి త్వరలో నటించనున్న సినిమా సర్కారు వారి పాట. యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఎంతో గ్రాండ్ లెవెల్లో రూపొందనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి.

మహేష్ సొంత సంస్థ జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ కూడా నిర్మాణంలో భాగస్వామి కావడంతో ఈ సినిమా కథ, కథనాలు, రూపకల్పన విషయమై సూపర్ స్టార్ ప్రత్యేకంగా శ్రద్ధ వహించనున్నట్లు తెలుస్తోంది. జనవరి మొదటి వారంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక దీని అనంతరం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ ఒక సినిమా చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా విషయమై రాజమౌళి అధికారికంగా ప్రకటన కూడా చేసారు. ఇకపోతే దీనితో పాటు మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి వంటి దర్శకులతో కూడా పని చేయనున్నట్టు కొద్దిరోజుల నుండి పలు ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వాస్తవానికి సర్కారు వారి పాట సినిమా స్థానంలో వంశీ పైడిపల్లి సినిమాని మహేష్ చేయాల్సింది. అయితే ఆ సినిమా యొక్క పూర్తి స్క్రిప్ట్ సిద్ధం కాకపోవడంతో అదే సమయంలో పక్కా స్క్రిప్ట్ తో తనవద్దకు వచ్చి సూపర్ స్టోరీ వినిపంచిన పరశురామ్ కి పచ్చ జండా ఊపారు మహేష్.

ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి పరశురామ్ తో మహేష్ చేస్తున్న సర్కారు వారి పాట అనంతరం వంశీ పైడిపల్లి సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని, ఇప్పటికే ఈ సినిమా కోసం పవర్ఫుల్ స్క్రిప్ సిద్ధం చేసిన వంశీ, ఆ సినిమా కోసం క్యాస్టింగ్, టెక్నీకల్ టీమ్ ని కూడా ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. దిల్ రాజు, మహేష్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకి మ్యూజిక్ ని మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించనున్నారని, చాలా గ్యాప్ తరువాత సూపర్ స్టార్, మణి ల కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాలో సాంగ్స్ వండర్ఫుల్ గా ఉంటాయని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, మరొక్కసారి సూపర్ స్టార్ మహేష్, మణిశర్మ ల కాంబినేషన్ లో ఒక సూపర్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ని చూడవచ్చు....!!


సౌత్ బ్యూటీస్ తమ పవరేంటో చూపిస్తున్నారు..!

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?

గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>