Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/testca3cff45-3da2-4cde-877b-c450b5d49834-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/testca3cff45-3da2-4cde-877b-c450b5d49834-415x250-IndiaHerald.jpgఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు ఆస్ట్రేలియా తో మొదటి వన్డే సిరీస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే మొదటి వన్డే సిరీస్లో భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. 2 వన్ డే మ్యాచ్ లలో కూడా ఘోర ఓటమి చవి చూడటం తో చివరికి సిరీస్ చేజార్చుకుంది భారత జట్టు. అయితే భారత బౌలింగ్ విభాగం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒక్క మ్యాచ్లో కూడా భారత బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ ని తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారు అనే విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా మాజీ కెamith;navdeep;audi;india;australia;geum;steve smith;mohammed shami;paruguస్మిత్ కు ఆ వీక్నెస్ వుంది.. భారత బౌలర్లకు ఆ మాత్రం తెలియదా..?స్మిత్ కు ఆ వీక్నెస్ వుంది.. భారత బౌలర్లకు ఆ మాత్రం తెలియదా..?amith;navdeep;audi;india;australia;geum;steve smith;mohammed shami;paruguTue, 01 Dec 2020 16:00:00 GMTఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు ఆస్ట్రేలియా తో మొదటి వన్డే సిరీస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే మొదటి వన్డే సిరీస్లో భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. 2 వన్ డే మ్యాచ్ లలో కూడా ఘోర ఓటమి చవి చూడటం తో చివరికి సిరీస్ చేజార్చుకుంది భారత జట్టు. అయితే భారత బౌలింగ్ విభాగం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒక్క మ్యాచ్లో కూడా భారత బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ ని  తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారు అనే విషయం తెలిసిందే.



 ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అయితే భారత బౌలర్లను ఒక్క ఆట ఆడుకున్నాడు. తొలి వన్డే మ్యాచ్లో 66 బంతుల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి 105 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక రెండో వన్డేలో భారత బౌలర్లు కట్టడి చేస్తారు అని అనుకుంటే.. రెండో వన్డేలో కూడా  64 బంతుల్లో 104 పరుగులు చేసి మరోసారి అజేయంగా నిలిచాడు. మొత్తంగా వన్డేలో స్మిత్  11 సెంచరీలు సాధించగా ఐదు శతకాలు భారత్ పైనే సాధించడం గమనార్హం. రెండు వన్డే మ్యాచ్లో కూడా కట్టడి చేయడంలో భారత వద్ద సరైన గేమ్ ప్లాన్ లేకపోవడంతో ఇక చివరికి పరుగులు సమర్పించుకోవాల్సి  వచ్చింది అన్న విషయం తెలిసిందే.



 వాస్తవానికి అయితే షార్ట్ పిచ్ బంతుల్ని ఆడటానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాడు స్మిత్  అనే విషయం తెలిసిందే.  అదే అతని బలహీనత అని కూడా చెప్పవచ్చు. అందుకే బౌలర్లు ఎక్కువగా షార్ట్ పిచ్ బంతులు వేసి విత్ వికెట్ పడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్లో కూడా అలాంటి బంతులను సందించడంలో భారత ఫాస్ట్ బౌలర్స్  బూమ్రా మహ్మద్ షమీ నవదీప్ సైని లు పూర్తిగా విఫలం అయ్యారు. దీంతో రెండు మ్యాచ్ లలో కూడా సెంచరీలు బాదిన  స్మిత్  తర్వాత జట్టుకి  సురక్షితమైన స్కోరు అందించడంలో కీలక పాత్ర వహించాడు. అయితే భారత బౌలర్లకు స్మిత్ బలహీనత గురించి తెలియదా అంటూ ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ వ్యాఖ్యానించారు. భారత బౌలర్లు వ్యూహం నాకు అర్థం కాలేదు అంటూ పెదవి విరిచారు.


ఒకరితో పెళ్లి.. మరొకరితో విహారం... ఆమె నా పెళ్లాం ఎవరికీ చెప్పొద్దని కోరిందన్న భర్త

కేసీఆర్ ఢిల్లీ వెళ్తారా...?

గ్రేటర్ యుద్ధం: తెరాస పార్టీ ఓడిపోతే ఇదే కారణం...?

ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్

చిత్రసీమలోనే కాదు.. సమాజ సేవలోనూ సూపర్ స్టార్..! మహేష్ బాబుపై నమ్రత ఎమోషనల్

గ్రేటర్ యుద్ధం: గ్రేటర్ ఎన్నికల్లో స్లో ఓటింగ్.. ఇంకా 20శాతమే

రుణాల వడ్డీ రేట్లను తగ్గించిన సీఎస్ బి... నేటి నుంచే అమలు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>