MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyanbc6d418f-fbcc-41d3-9648-aa1980bf3628-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyanbc6d418f-fbcc-41d3-9648-aa1980bf3628-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ తో సినిమా తీయడం కోన వెంకట్ జీవిత ధ్యేయం. తన కల నిజం చేసుకునేందుకు కోనవెంకట్ ఎన్నో కథలు పవన్ కు వినిపించినా ఇప్పటికీ పవన్ మనసు కరిగి కోనవెంకట్ కు ప్రామిస్ దక్కలేదు. ‘నిశ్శబ్దం’ ఫెయిల్యూర్ తో దిగాలు పడ్డ కోనవెంకట్ కు ఇప్పుడు బాలకృష్ణ ప్రామిస్ దక్కినట్లుగా వార్తలు హడావిడి చేస్తున్నాయి.ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమధ్య బాలయ్య కోనవెంకట్ తనకు చెప్పిన కథకు ఓకె చెప్పినట్లు హడావిడి జరుగుతోంది. బాలయ్య ఇప్పటికే కమిట్ అయిన ఒక సినిమాను చేసిన తర్వాత కోనవెంకట్ pavankalyan;pawan;balakrishna;boyapati srinu;jeevitha rajaseskhar;kalyan;kona venkat;srivas;venkat;cinema;industry;massపవన్ దగ్గర పొందలేని అభిమానం బాలయ్య దగ్గర పొందిన కోనవెంకట్ !పవన్ దగ్గర పొందలేని అభిమానం బాలయ్య దగ్గర పొందిన కోనవెంకట్ !pavankalyan;pawan;balakrishna;boyapati srinu;jeevitha rajaseskhar;kalyan;kona venkat;srivas;venkat;cinema;industry;massTue, 01 Dec 2020 09:00:00 GMTపవన్ కళ్యాణ్ తో సినిమా తీయడం కోన వెంకట్ జీవిత ధ్యేయం. తన కల నిజం చేసుకునేందుకు కోనవెంకట్ ఎన్నో కథలు పవన్ కు వినిపించినా ఇప్పటికీ పవన్ మనసు కరిగి కోనవెంకట్ కు ప్రామిస్ దక్కలేదు. ‘నిశ్శబ్దం’ ఫెయిల్యూర్ తో దిగాలు పడ్డ కోనవెంకట్ కు ఇప్పుడు బాలకృష్ణ ప్రామిస్ దక్కినట్లుగా వార్తలు హడావిడి చేస్తున్నాయి.


ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమధ్య బాలయ్య కోనవెంకట్ తనకు చెప్పిన కథకు ఓకె చెప్పినట్లు హడావిడి జరుగుతోంది. బాలయ్య ఇప్పటికే కమిట్ అయిన ఒక సినిమాను చేసిన తర్వాత కోనవెంకట్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. బాలకృష్ణ కోసం కోనవెంకట్ తయారు చేసిన ఒక మాస్ ఎంటర్ టైనర్ మూవీ కథకు బాలయ్య ఓకె చెప్పాడు అని అంటున్నారు.


ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు శ్రీవాస్ డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాస్ ఎంటర్ టైనర్ సినిమాలను శ్రీవాస్ చక్కగా డీల్ చేయగలడు అన్న నమ్మకం బాలయ్యకు ఉండటంతో పాటు గతంలో శ్రీవాస్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సందర్భంలో అప్పట్లోనే శ్రీవాస్ తో బాలయ్యకు సన్నిహిత సంబంధం ఏర్పడింది అని అంటారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే ఆస్కారం ఉంది. ప్రస్తుతం కోనవెంకట్ వైపు టాప్ హీరోలు ఎవరు చూడటంలేదు. ఇలాంటి పరిస్థితులలో బాలయ్య ఇస్తున్న అవకాశం కోనవెంకట్ కు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.


అంచనాల ప్రకారం బోయపాటి బాలయ్యల లేటెస్ట్ మూవీ వచ్చే ఏడాది విడుదలై సూపర్ హిట్ అందుకుంటే మళ్ళీ బాలయ్య ట్రాక్ లోకి రావడం ఖాయం. అదే జరిగితే బాలయ్యతో సినిమా తీయాలని ప్రయత్నిస్తున్న కోనవెంకట్ కష్టాలు అన్నీ ఒకేసారి తీరిపోయే ఆస్కారం ఉంది. అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈ మూవీ 2022 లో విడుదలయ్యే అవకాశం ఉంది..




ఎన్నారైలతో బిడెన్ సమావేశం

కేటిఅర్ ఎక్కడ ఓటు వేసారు అంటే...!

గ్రేటర్ యుద్ధం : ఎన్ని బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారో తెలుసా..!?

గ్రేటర్ యుద్దం : ఎన్ని ప్రత్యేకతలో..నేడే పోలింగ్ !!

గ్రేటర్ యుద్ధం : జూబ్లీహిల్స్ లో ఏయే సెలబ్రిటీ ఎక్కడ ఓటు వేస్తారంటే ?

గ్రేటర్ యుద్ధం : అందరి దృష్టంతా ఆ నియోజకవర్గంపైనే..!

గ్రేటర్ లో సెటిలర్లు ఎవరివైపు ఉంటారు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>