MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shraddha-kapoor-kiava-advanie37692c5-3a17-400f-90e6-1bdf7c799be5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shraddha-kapoor-kiava-advanie37692c5-3a17-400f-90e6-1bdf7c799be5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమకి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది కియారా అద్వానీ. అంతకముందు బాలీవుడ్ లో ఎమ్ ఎస్ ధోని సినిమా ద్వారా అక్కడి సినిమా తెరకు ఎంట్రీ ఇచ్చిన కియారా, ఆ సినిమా తో అక్కడ మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఆ సినిమా అనంతరం భరత్ అనే నేను కోసం సూపర్ స్టార్ ప్రక్కన కియారాని హీరోయిన్ గా ఎంపిక చేసారు దర్శకడు కొరటాల. shraddha kapoor;kiava advani;mahesh;prabhas;ram charan teja;kiara advani;ms dhoni;shiva;shraddha kapoor;bhama;bharath;boyapati srinu;koratala siva;krishnam raju;ram pothineni;korea, south;bollywood;tollywood;sri bharath;cinema;telugu;rajani kanth;saaho;media;lord siva;heroine;success;shradda kapoor;vinaya vidheya ramaశ్రద్ధా, కియారా లకు ఆసక్తి ఉందట .... కానీ .....??శ్రద్ధా, కియారా లకు ఆసక్తి ఉందట .... కానీ .....??shraddha kapoor;kiava advani;mahesh;prabhas;ram charan teja;kiara advani;ms dhoni;shiva;shraddha kapoor;bhama;bharath;boyapati srinu;koratala siva;krishnam raju;ram pothineni;korea, south;bollywood;tollywood;sri bharath;cinema;telugu;rajani kanth;saaho;media;lord siva;heroine;success;shradda kapoor;vinaya vidheya ramaTue, 01 Dec 2020 23:13:10 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమకి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది కియారా అద్వానీ. అంతకముందు బాలీవుడ్ లో ఎమ్ ఎస్ ధోని సినిమా ద్వారా అక్కడి సినిమా తెరకు ఎంట్రీ ఇచ్చిన కియారా, ఆ సినిమా తో అక్కడ మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఆ సినిమా అనంతరం భరత్ అనే నేను కోసం సూపర్ స్టార్ ప్రక్కన కియారాని హీరోయిన్ గా ఎంపిక చేసారు దర్శకడు కొరటాల.

ఇక మంచి అంచనాలతో రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుని తెలుగులో ఫస్ట్ సినిమాతోనే కియారా అద్వానీకి గొప్ప క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక దాని తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన కియారా నటించిన సినిమా వినయ విధేయ రామ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఆ తరువాత కియారా పూర్తిగా బాలీవుడ్ సినిమాలకే పరిమితం అయ్యారు. ఇక తెలుగు తెరకి రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్.

అంతకముందు బాలీవుడ్ లో ఆషికి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ దక్కించుకున్న శ్రద్ధ, ఆపై హిందీలో పలు సినిమాలు చేసి మంచి పేరు దక్కించుకున్నారు. అనంతరం రెబల్ స్టార్ ప్రక్కన ఛాన్స్ రావడంతో సాహోలో నటించారు. అయితే ఆ సినిమా తెలుగులో యావరేజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ అటు నార్త్ లో మాత్రం సూపర్ గా దూసుకెళ్లింది. ఇకపోతే ఈ ఇద్దరు భామలు కూడా మరొక్కసారి సౌత్ సినిమాలు చేయకపోవడంతో వీరు ఇక్కడి చిత్ర పరిశ్రమపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు అంటూ ఇటీవల పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రసారం అయ్యాయి. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి , ఈ ఇద్దరు హీరోయిన్స్ కూడా తెలుగు సహా పలు సౌత్ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని, నిజానికి ఇటీవల పలు సినిమాల కథలు వారి వద్దకు వచ్చినప్పటికీ, అవి తాము ఆశించిన రేంజ్ లో లేకపోవడంతోనే వీరిద్దరూ ఆ సినిమాలు చేయలేదని అంటున్నారు. మంచి అవకాశం వస్తే తప్పకుండా ఎప్పుడైనా సౌత్ సినిమాలు చేయడానికి తాము సిద్ధం అని ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు చెప్తున్నారట....!!


 







బిగ్ బాస్ దివి.. రెచ్చిపోవడం చూశారా..!

గ్రేటర్ యుద్ధం : సంజయ్ బండి అక్కడ లాండ్ అవుతుందా?

ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో ఇంత దారుణమా...?

గోల్డ్ కొనే వారికి భారీ డిస్కౌంట్ .. 40శాతం కు పైగానే..

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

బిజీ ప్రభాస్ ని లైన్ లో పెట్టేసిన క్రేజీ డైరెక్టర్ ?

పోలింగ్ కేంద్రాలవద్ద మాములు హడావుడి లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>