PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war8b79433c-72ba-45b7-a764-9859256713ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war8b79433c-72ba-45b7-a764-9859256713ce-415x250-IndiaHerald.jpg గ్రేటర్ ఎన్నికల్లో అన్ని పార్టీలు గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తున్నాయి. ప్రత్యర్థులకు అవకాశం దక్కకుండా గెలుపును తమ పార్టీ ఖాతాలో వేసేందుకు నాయకులందరూ గట్టిగానే కష్టపడుతున్నారు. ఈ ఎన్నికలు తమ పార్టీకి చావోరేవో తెల్చేయబోతోంది కాబట్టి జాగ్రత్తగా ఈ ఎన్నికల్లో గట్టెక్కేకపోతే ఫలితాల తరువాత జనాలకు దూరం కావాల్సి వస్తుందనే ఆందోళన అన్ని పార్టీల్లోనూ, నాయకుల్లోనూ ఉంది. అందుకే గ్రేటర్ ఓటర్ల అనుగ్రహం కోసం అంతగా పరితపిస్తున్నారు. కాంగ్రెస్ ,బిజెపి, టిఆర్ఎస్, ఎంఐఎం వంటి పార్టీలు పోటీలో ఉన్నా, ప్రధాన పోటీ అంతgreter-war ghmc telangana, elections,;auto;bharatiya janata party;congress;media;survey;letter;local language;partyగ్రేటర్ యుద్ధం : ఓటర్ల అనుగ్రహం ఎవరిమీదో ?గ్రేటర్ యుద్ధం : ఓటర్ల అనుగ్రహం ఎవరిమీదో ?greter-war ghmc telangana, elections,;auto;bharatiya janata party;congress;media;survey;letter;local language;partyMon, 30 Nov 2020 07:00:00 GMTగ్రేటర్ ఎన్నికల్లో అన్ని పార్టీలు గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తున్నాయి. ప్రత్యర్థులకు అవకాశం దక్కకుండా గెలుపును తమ పార్టీ ఖాతాలో వేసేందుకు నాయకులందరూ గట్టిగానే కష్టపడుతున్నారు. ఈ ఎన్నికలు తమ పార్టీకి చావోరేవో తెల్చేయబోతోంది కాబట్టి జాగ్రత్తగా ఈ ఎన్నికల్లో గట్టెక్కేకపోతే ఫలితాల తరువాత జనాలకు దూరం కావాల్సి వస్తుందనే ఆందోళన అన్ని పార్టీల్లోనూ, నాయకుల్లోనూ ఉంది. అందుకే గ్రేటర్ ఓటర్ల అనుగ్రహం కోసం అంతగా పరితపిస్తున్నారు. కాంగ్రెస్ ,బిజెపి, టిఆర్ఎస్, ఎంఐఎం వంటి పార్టీలు పోటీలో ఉన్నా, ప్రధాన పోటీ అంతా బిజెపి వైపు  అన్నట్టుగా ఉంది. అయితే వీరిలో ఏ పార్టీ వైపు గ్రేటర్ జనాలు అనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియడం లేదు. 


మొన్నటివరకు టిఆర్ఎస్ పార్టీకి ఇక్కడ సానుకూలత కనిపించినాా, అనూహ్యంగా బిజెపి సైతం బలం పెంచుకోవడం కాస్త ఇబ్బందికర పరిణామమే. వివిధ సర్వే సంస్థలకు సైతం గ్రేటర్ ఓటరు నాడి ఏంటో అర్థం కాని పరిస్థితి. దీనికి కారణం ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చేస్తూ రాజకీయ పార్టీలు యాక్టివ్  గా ఉండడమే. మీడియా సంస్థలు ఓటరు ఎటువైపు ఉన్నారు అనేది ముందుగా అంచనా వేసి ఆ మేరకు కథనాలు వండి వార్చే వారు . కాని ఇప్పుడు వారం రోజులుగా మీడియా సంస్థలు  గ్రేటర్ ఓటర్ నాడి తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ, ఓటర్ల తీర్పు ఏవిధంగా ఉండబోతుంది అనేది అంచనా వేద్దామని ప్రయత్నిస్తున్నా,  స్పష్టమైన క్లారిటీ రావడం లేదు. దీనికి కారణం స్థానికంగా నెలకొన్న సమస్యలే కారణంగా కనిపిస్తోంది. 



టిఆర్ఎస్ ప్రభుత్వం పై జనాల్లో ఎంత ఆగ్రహం ఉందో, అంతే స్థాయిలో బీజేపీ పైన ఉండడం తమను ఎవరు పట్టించుకోవడం లేదని, అంద రు రాజకీయ నాయకులు ఒక్కటే అన్నట్లుగా ఇటీవల వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితుల్లో ఆగ్రహం ఉందట  టిఆర్ఎస్ ప్రభుత్వం 10 వేలు నష్ట పరిహారం కింద పంపిణీ చేపట్టినా , చాలా మందికి ఇంకా అందకుండా నే గ్రేటర్ నోటిఫికేషన్ వెలువడింది. ఇక బిజెపి గ్రేటర్ పగ్గాలు చేపడితే వరద బాధితులకు 25,000 నష్టపరిహారం ఇస్తామని ప్రకటించడం, కాంగ్రెస్ ఈ పరిహారాన్ని 50వేలుగా ప్రకటించింది. ఎవరు ఎన్ని హామీలు ప్రకటించినా గ్రేటర్ ఓటరు తీర్పు అంచనా వేయడం కష్టంగానే మారింది.





భారత్ కోసం నాలుగడుగులు ముందుకేసిన సౌదీ.. మోడీ సక్సెస్..?

సమంత బికినీ లుక్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అమిత్ షా ప్రచారానికి అడ్డు పడ్డ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

గ్రేటర్ యుద్ధం: బండి సంజయ్‌వి మతిస్థిమితం లేని మాటలు.. కాంగ్రెస్ నేత ఫైర్!

గ్రేటర్ యుద్ధం: ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది? ప్రశ్నించిన కేటీఆర్

మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం

దరిద్రపు పాలన అంటూ టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>