PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war8a6a1247-31e8-414f-b9bd-b2594158e625-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war8a6a1247-31e8-414f-b9bd-b2594158e625-415x250-IndiaHerald.jpgఏ ఎన్నిక అయినా ఓటరు ఓటు వేస్తాడు. అయితే ఓటరు ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి చేరుకోవడానికి కూడా చాలా ప్లాన్ ఉంది. ఆలోచనతో కదిలించాలి. ప్రచారంతో చెప్పాల్సింది చెప్పాలి. చివరాఖరుగా అతని ఓటు పొందేందుకు చేసే ప్రయత్నమే పోల్ మేనేజ్మెంట్. ఒక బూత్ లో ఉన్న ఓట్లతో తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకోవడం ప్రత్యర్ధి ఓట్లకు గండి పెట్టడం కూడా పోల్ మేనేజ్మెంట్ లో భాగమే. greater-war;hyderabad;policeగ్రేటర్ యుద్ధం : పోల్ మేనేజ్మెంట్ తో ఎత్తుకు పై ఎత్తులు ?గ్రేటర్ యుద్ధం : పోల్ మేనేజ్మెంట్ తో ఎత్తుకు పై ఎత్తులు ?greater-war;hyderabad;policeMon, 30 Nov 2020 22:00:00 GMT
ఈ విధంగా ఆలోచిస్తే తలపండిన పార్టీలే గ్రేటర్ సమరంలో సై అంటే సై అంటున్నాయి. దాంతో ఈసారి పోల్ మేనేజ్మెంట్  కూడా ఎత్తుకు పై ఎత్తులతో అదిరిపోయేలా ఉంటుందని అంటున్నారు. నిజానికి రాజకీయ పార్టీలకు కార్యకర్తలు అభిమానులు మాత్రమే ఉంటారు. కానీ మిగిలిన లక్షలాది మంది ప్రజలంతా కూడా తటస్థులే. వారు ప్రతీ ఎన్నికకూ అప్పటికి తగినట్లుగా స్పందిస్తారు. అందువల్ల వారి ఓట్లను రాబట్టడమే అసలైన పోల్ మేనేజ్మెంట్.

అనుకున్న టైం కి తమకు పడే ఓట్లను కూడా చాలా జాగ్రత్తగా బాక్స్ లో వేయించుకోవడంలోనూ టాలెంట్ ఉంటుంది. ఆ విధంగా చూస్తే రేపటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ ఎలా ఉండబోతోంది. అసలు ఎవరు ఎవరి మీద పై చేయి సాధిస్తారు అన్నది కూడా చాలా ఆసక్తికరమైన అంశంగా ఉండబోతోంది. ఈ పోల్ మేనేజ్మెంట్ సందర్భగానే పెద్ద ఎత్తున గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి.

దాంతో పోలీసులు మోహరించి అన్ని రకాలైన చర్యలు తీసుకున్నప్పటికీ రేపు ఎలా పోలింగ్ జరుగుతుందో. అది తమకు అనుకూలం ఎలా చేసుకోవాలో అన్న టెన్షన్ లో రాజకీయ పార్టీలు తలమునకలై ఉన్నాయి. ఈసారి గట్టి పోటీ ఉండడంతో పోలీసులకు ఎన్నికల యంత్రాంగానికి కూడా పెను సవాల్ గా గ్రేటర్ ఎన్నికలు పరిణమించాయని అంటున్నారు. ఇంటలిజెన్స్ వర్గాలు కూడా గట్టి పహరాతో కాపు కాస్తున్నాయి మరి. చూడాలి ఏం జరుగుతుందో.








గ్రేటర్ యుద్ధం : ఇవ్వాల్సిన హామీ ఇచ్చేశారు.. ఓటర్ తీర్పు ఏమిస్తాడో ?

గ్రేటర్ యుద్ధం : అందరి దృష్టంతా ఆ నియోజకవర్గంపైనే..!

గ్రేటర్ లో సెటిలర్లు ఎవరివైపు ఉంటారు..?

గ్రేటర్‌ యుద్ధం : పార్టీల మధ్య హోరాహోరీ !

గ్రేటర్ యుద్దం : పార్టీల జిమ్మీకులు..చిన్న పిల్లలతో డబ్బు పంపిణీ ..!!

బిగ్ రిస్క్ చేస్తున్న బెల్లంకొండ...?

మరో పదినెలల్లో జగన్ సంచలన నిర్ణయం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>