MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/kollywood-hero-seems-to-understand-nowe45de752-6ffa-4025-840b-ad2f63574bdb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/kollywood-hero-seems-to-understand-nowe45de752-6ffa-4025-840b-ad2f63574bdb-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ కుర్రహీరో శింబు గేర్ మార్చాడు. అయిపోయిందనుకున్న కెరియర్ ను కరెక్ట్ ట్రాక్ లోకి తీసుకువస్తున్నాడు. డిసిప్లిన్ లేకపోవడంతో సైడైపోయిన ఈ తమిళ తంబీ త్వరలో లీడింగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా తన సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. తాజాగా తన కొత్త సినిమా "మానాడు" పోస్టర్ తో హల్చల్ చేస్తున్నాడు. kollywood hero seems to understand now;dhanush;cinema;kollywood;tamil;love;hero;posters;romantic;tambi;silambarasanకోలీవుడ్ హీరోకు ఇప్పుడు అర్థమైనట్టుంది..!కోలీవుడ్ హీరోకు ఇప్పుడు అర్థమైనట్టుంది..!kollywood hero seems to understand now;dhanush;cinema;kollywood;tamil;love;hero;posters;romantic;tambi;silambarasanMon, 30 Nov 2020 16:00:00 GMTకోలీవుడ్ కుర్రహీరో శింబు గేర్ మార్చాడు. అయిపోయిందనుకున్న కెరియర్ ను కరెక్ట్ ట్రాక్ లోకి తీసుకువస్తున్నాడు. డిసిప్లిన్ లేకపోవడంతో సైడైపోయిన ఈ తమిళ తంబీ త్వరలో లీడింగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా తన సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. తాజాగా తన కొత్త సినిమా "మానాడు" పోస్టర్ తో హల్చల్ చేస్తున్నాడు.

కోలీవుడ్ కుర్ర హీరోలకున్న పోటీ.... సౌత్ లో ఏ పరిశ్రమలోనూ కనిపించదు. స్వింగ్ లో ఉన్నప్పుడే ఇక్కడి హీరోలు ఐదారు హిట్లు ఇచ్చేస్తారు. ఆ తర్వాత రెమ్యునరేషన్ పెంచేసి ర్యాంక్ పెరిగిందంటూ హల్చల్ చేస్తారు. అయితే ఈ కల్చర్ ను ఇప్పుడు ఫామ్ లో ఉన్న యంగ్ హీరోలందరికంటే ముందుగానే స్టార్ట్ చేసిన హీరో శింబునే. వరుస ప్రయోగాలు, రొమాంటిక్ యాక్షన్ వెంచర్లు చేసి యూత్ లో ఎక్కువ ఫోకస్ అయ్యాడు.

శింబు యంగ్ హీరోలలో టాప్ కు వెళ్తున్న సమయంలో అనవసర గొడవలు, పార్టీలు, లవ్ స్టోరీలతో తన కెరియర్ ను స్పాయిల్ చేసుకున్నాడు. వీటితో పాటు పరిశ్రమలో డిసిప్లిన్ లేకపోవడంతో షేపవుట్ అయిపోయి అటు యాక్షన్ ,ఇటు రొమాంటిక్ ఫిలింస్ కు కాకుండా  అయిపోయాడు. అయితే గత కొంతకాలంగా శింబు యాక్టింగ్ పై సీరియస్ గా దృష్టి పెడుతున్నాడు. తనని తాను షేప్  చేసుకుంటూ మునుపటి రూపాన్ని తెచ్చుకున్నాడు. అక్కడితో ఊరుకోకుండా లీడింగ్ హీరోలకు పోటీగా సినిమాలను రూపొందిస్తున్నాడు. తాజాగా ఈశ్వరన్, మానాడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్ లు తనకు పూర్వవైభవాన్ని తెస్తాయని ఆశపడుతున్నాడు.

శింబు గత కొన్ని రోజులుగా తన అప్ కమింగ్ ఫిలిం "మానాడు" పోస్టర్లతో ట్రెండ్ లో ఉన్నాడు. ఈ పిక్స్ లో శింబు లుక్ చూసినవారికి మనోడు మళ్లీ లైమ్లో లైట్లోకి రావడం ఖాయమంటున్నారు. గతంలో తనకు ఎంతో పోటీ ఇచ్చి సైడ్ చేసిన ధనుష్ ను ఈసారి తాను సైడ్ చేస్తానని ధీమాగా చెబుతున్నాడు. ఒకే ఒక్క పోస్టర్ తో శింబుకు అతనికి ఫ్యాన్స్ కు ఎక్కడలేని ఎనర్జీ వచ్చేసింది.


హీరో సురేష్ భార్య మన అందరికి తెలిసిన వ్యక్తే ..ఎవరో చూడండి.

గ్రేటర్ యుద్ధం: ఆ ఘనత కవితకే.. బీజేపీ ఎంపీ అరవింద్ ఫైర్!

బుడుగు: కరోనా కారణంగా పిల్లల్లో పెరుగుతున్న నెగెటివ్ ఆలోచనలు..!

TSPSC: HMWS పరీక్ష కీ విడుదల

గ్రేటర్ యుద్ధం: ‘‘టీఆర్ఎస్ గెలుపు తథ్యం’’

మహేష్ ఇండస్ట్రీకి వచ్చి 41 వసంతాలు పూర్తి. శుభాకాంక్షలు తెలిపిన నమ్రత

గ్రేటర్ యుద్ధం: ‘‘అప్పుడు బండ్ల గణేష్.. ఇప్పడు బండి సంజయ్’’




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>