KidsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/childrens9b8d5b80-80b5-4407-bfa6-afa114a4a432-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/childrens9b8d5b80-80b5-4407-bfa6-afa114a4a432-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది జీవితంలో పెను మార్పులు తీసుకొచ్చింది. దీంతో పిల్లల ఆలోచనలో కూడా మార్పులు తీసుకొచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ మహమ్మారి వచ్చినప్పటి నుండి పాజిటివిటీ అంటేనే ఒక నెగెటివ్ ఆలోచన మైండ్ లోకి వచ్చేసింది.childrens;jeevitha rajaseskhar;coronavirusబుడుగు: కరోనా కారణంగా పిల్లల్లో పెరుగుతున్న నెగెటివ్ ఆలోచనలు..!బుడుగు: కరోనా కారణంగా పిల్లల్లో పెరుగుతున్న నెగెటివ్ ఆలోచనలు..!childrens;jeevitha rajaseskhar;coronavirusMon, 30 Nov 2020 17:00:00 GMTకరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది జీవితంలో పెను మార్పులు తీసుకొచ్చింది. దీంతో పిల్లల ఆలోచనలో కూడా మార్పులు తీసుకొచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ మహమ్మారి వచ్చినప్పటి నుండి పాజిటివిటీ అంటేనే ఒక నెగెటివ్ ఆలోచన మైండ్ లోకి వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో అసలైన పాజివిటీని ఊహించగలగడం కొంచెం కష్టమే.

తాజా అధ్యయనం ప్రకారం..  కరోనా వచ్చినప్పటి నుండి పిల్లల్లో మరీ ముఖ్యంగా టీనేజర్లలో నెగెటివ్ ఆలోచనలు పెరిగిపోతున్నాయట. పాఠశాలలు తెరుచుకుంటాయా లేదా అన్న అనుమానాలు, పై తరగతికి వెళ్తామా లేదా అన్న సందేహాలు, పరీక్షలు ఉంటాయా ఉండవా అన్న ఆలోచనలు, జీవన విధానంలో నెలకొన్న గజిబిజి.. మొదలగునవి వారిలో నెగెటివిటీని పెంచుతున్నాయని అంటున్నారు.

ఇక పిల్లల హక్కులని పరిరక్షించే స్వచ్చంద సంస్థ నిర్వహించిన సర్వేలో 1598మంది పేరెంట్స్, 989మంది పిల్లలు పాల్గొన్నారు. దీని ద్వారా తేలిన విషయం ఏమిటంటే, నలుగురిలో ముగ్గురు పిల్లలు నెగెటివ్ ఆలోచనలకి గురవుతున్నారని సర్వేలో తేలింది. ఇక పాఠశాలలు తెరుచుకుంటాయో లేదో అన్న సంధిగ్ధం, తమ స్నేహితులు, ఉపాధ్యాయులతో కనుమరుగవుతున్న కాంటాక్ట్, కుటుంబ పరంగా తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు మొదలగునవన్నీ పిల్లల్లో ప్రతికూల ఆలోచనలకి ఆస్కారం కలిగిస్తున్నాయని చెబుతున్నారు.

అయితే బ్రతుకుదెరువు కోసం పట్టణాలకి వలస వెళ్ళిన కుటుంబాల్లో ఆదాయం లేకపోవడం, తినడానికి ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి సమస్యలు తలెత్తడం వల్ల ఆ కుటుంబాల్లో ఉండే పిల్లల్లో సమాజం పట్ల ఒకరకమైన నెగెటివ్ దృక్పథం ఏర్పడిందని సర్వేలో వెల్లడైయిందని అధికారులు తెలిపారు. అంతేకాదు తల్లిదండ్రులు తమ ఉద్యోగాలని కోల్పోవడంతో జీవన విధానంలో మార్పులు రావడం కారణంగా పిల్లల్లో ఇలాంటి ఆలోచనలు రేకెత్తుతున్నాయని తెలుస్తుంది. కరోనా వచ్చినప్పటి నుండి మొదలైన ఈ సమస్య ఎప్పుడు క్లియర్ అవుతుందో చూడాలి మరి. ఇలాంటి ఇబ్బందులకి కారణమైన కరోనా ఎప్పుడు వదిలిపెడుతుందో ఏమో..!


హీరో సురేష్ భార్య మన అందరికి తెలిసిన వ్యక్తే ..ఎవరో చూడండి.

గ్రేటర్ యుద్ధం: ఆ ఘనత కవితకే.. బీజేపీ ఎంపీ అరవింద్ ఫైర్!

TSPSC: HMWS పరీక్ష కీ విడుదల

గ్రేటర్ యుద్ధం: ‘‘టీఆర్ఎస్ గెలుపు తథ్యం’’

మహేష్ ఇండస్ట్రీకి వచ్చి 41 వసంతాలు పూర్తి. శుభాకాంక్షలు తెలిపిన నమ్రత

గ్రేటర్ యుద్ధం: ‘‘అప్పుడు బండ్ల గణేష్.. ఇప్పడు బండి సంజయ్’’

గ్రేటర్ యుద్ధం: ‘‘అభివృద్ధి కోసం టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి’’




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>