PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp3a2331b1-63f3-4c6b-bcf3-d687eefcf455-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp3a2331b1-63f3-4c6b-bcf3-d687eefcf455-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో బీజేపీ ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని విశ్లేష‌కులు, అంచ‌నాలు, అభిప్రాయాలు వెలువ‌డుతున్న నేప‌థ్యంలో మీడియా మలుపు తీసుకున్న‌ట్లుగా తోస్తోంది. గ‌తానికి భిన్నంగా బీజేపీ పార్టీ కార్యాల‌యం వ‌ద్ద‌, నాయ‌కుల ఇళ్ల వ‌ద్ద మీడియా ప్ర‌తినిధుల ఎదురుచూపులు, హ‌డావుడి క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి గ‌త ఆరేళ్లుగా టీఆర్ ఎస్ త‌ప్పా రాష్ట్రంలో మిగ‌తా పార్టీల‌కు మీడియాలో పెద్ద‌గా ప్రియారిటీ ల‌భించ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. రాష్ట్రం ఆవిర్భావం... ఆత‌ర్వాత టీఆర్ ఎస్ అధికారంలోకి రావ‌డం వంటివి చ‌క‌చ‌క జ‌రిగిపోయాయి.bjp;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;media;partyగ్రేట‌ర్ యుద్ధం : మీడియా బీజేపీ వైపు చూస్తోందిగా... రాష్ట్రంలో మారుతున్న ప‌రిస్థితుల‌కు సంకేత‌మేనా..?గ్రేట‌ర్ యుద్ధం : మీడియా బీజేపీ వైపు చూస్తోందిగా... రాష్ట్రంలో మారుతున్న ప‌రిస్థితుల‌కు సంకేత‌మేనా..?bjp;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;media;partyMon, 30 Nov 2020 09:00:00 GMTబీజేపీ ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని విశ్లేష‌కులు, అంచ‌నాలు, అభిప్రాయాలు వెలువ‌డుతున్న నేప‌థ్యంలో మీడియా మలుపు తీసుకున్న‌ట్లుగా తోస్తోంది. గ‌తానికి భిన్నంగా బీజేపీ పార్టీ కార్యాల‌యం వ‌ద్ద‌, నాయ‌కుల ఇళ్ల వ‌ద్ద మీడియా ప్ర‌తినిధుల ఎదురుచూపులు, హ‌డావుడి క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి గ‌త ఆరేళ్లుగా టీఆర్ ఎస్ త‌ప్పా రాష్ట్రంలో మిగ‌తా పార్టీల‌కు మీడియాలో పెద్ద‌గా ప్రియారిటీ ల‌భించ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. రాష్ట్రం ఆవిర్భావం... ఆత‌ర్వాత టీఆర్ ఎస్ అధికారంలోకి రావ‌డం వంటివి చ‌క‌చ‌క జ‌రిగిపోయాయి. సంక్షేమ ప‌థ‌కాల‌కు రెండోసారి కూడా జేజేలు ప‌లుకుతూ  టీఆర్ ఎస్‌కే అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. అయితే పార్ల‌మెంట‌రీ ఎన్నిక‌ల్లో మిశ్ర‌మ ఫ‌లితాన్ని, దుబ్బాక ఉప ఎన్నిక‌లో చేదు ఫ‌లితాన్ని టీఆర్ ఎస్‌కు అందించారు ఓట‌ర్లు.


 దీంతో రాష్ట్రంలో గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఉత్కంఠ నెల‌కొంది. గ్రేట‌ర్ ఫ‌లితాల తర్వాత రాష్ట్ర రాజ‌కీయాల ముఖ‌చిత్రం మారుతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక్క‌డ బీజేపీ మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకోకున్నా... సాధ్య‌మైన‌న్ని ఎక్కువ సీట్లు గెలిచినా నైతిక విజ‌యంగా భావించాల్సి ఉంటుంద‌ని తెలుపుతున్నారు.అలాగే అంతిమంగా రాష్ట్రంలో పార్టీ బ‌ల‌ప‌డ‌టానికి దోహ‌దం చేస్తుంద‌ని చెబుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ బ‌ల‌ప‌డుతున్న‌ట్లుగా భావిస్తున్న కొన్ని మీడియా సంస్థ‌లు త‌ద‌నుగుణంగా ఆ పార్టీ ప్ర‌చారానికి, నాయ‌కుల క‌వ‌రేజికి త‌గు ప్రాధాన్యం క‌ల్పిస్తున్న‌ట్లుగా కొంత‌మంది సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు అభిప్రాయం వెల్ల‌డిస్తున్నారు.


ఆదివారం మీడియా సంస్థ‌లు వ్య‌వ‌హ‌రించిన తీరును ఇందుకు ఉదాహ‌రిస్తున్నారు. వాస్త‌వానికి గతంలో వందలాది మంది టీఆర్ఎస్ భవన్ ముందు పడిగాపులు కాసేవారు.  సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల ప్రెస్‌మీట్లు, బైట్స్ కోసం గంటల తరబడి  వేచి ఉండేవారు. అయితే గ‌త కొద్దిరోజులుగా మీడియా వ్య‌వ‌హ‌రింపులో స్ప‌ష్ట‌మైన తేడా క‌నిపిస్తోంది. టీఆర్ ఎస్ నాయ‌కుల ఇళ్ల వ‌ద్ద హ‌డావుడి త‌గ్గ‌డం... బీజేపీ నేత‌ల ఇళ్ల వ‌ద్ద‌, ఆ పార్టీ కార్యాల‌యం వ‌ద్ద సంద‌డి క‌నిపిస్తుండ‌టం మారుతున్న ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతున్నాయ‌ని భావించాల్సి వ‌స్తోంది.


గ్రేటర్ యుద్ధం: మతాల మధ్య చిచ్చుపెట్టి విడగొట్టాలని చూస్తున్నారు... మోసపోవద్దు- కేటీఆర్...!

గ్రేటర్ యుద్ధం : ఇలా చేశారో జైలే ? వారంతా నగరాన్ని వీడల్సిందే ! ఎస్ఈసీ కీలక ఆదేశాలు ?

గ్రేటర్ యుద్దం: ప్రచారం ముగిసింది.. సోషల్ మీడియా మీద పడ్డ పార్టీలు..

సమంత బికినీ లుక్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అమిత్ షా ప్రచారానికి అడ్డు పడ్డ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

గ్రేటర్ యుద్ధం: బండి సంజయ్‌వి మతిస్థిమితం లేని మాటలు.. కాంగ్రెస్ నేత ఫైర్!

గ్రేటర్ యుద్ధం: ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది? ప్రశ్నించిన కేటీఆర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>