MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagababu42d6e62d-e316-49f0-8141-78498d2fc2c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagababu42d6e62d-e316-49f0-8141-78498d2fc2c3-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి కొణిదల నాగబాబు. అలాగే ఆయన కొన్ని సినిమాల్లోనూ హీరోగా నటించి మంచి గుర్తింపును కూడా తెచ్చుకున్నారు. అయితే ఈయన సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొంటూ తన మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలపై తరచూ మాట్లాడుతూ ఉంటారు. అయితే తాజాగా ఈ మెగా బ్రదర్ తన కుటుంబం గురించి, వారి తల్లిదండ్రుల గురించి మాట్లాడారు. ఈయన మాట్లాడిన మాటలు చాలా ఆసక్తికరంగా మారాయి. మా తల్లిదండ్రులు మమ్మల్ని పట్టించుకున్నంత మేము మా పిల్లల విషయంలో వారిలా ఉండకపోయామని తెలిపారు. అnagababu;auto;pawan;chiranjeevi;apple;east;letter;european union;custard apple;father;maa annayya;annayyaమా తల్లిదండ్రులు మాపై ఎప్పుడూ ఒత్తిడి పెంచలేదు: నాగబాబుమా తల్లిదండ్రులు మాపై ఎప్పుడూ ఒత్తిడి పెంచలేదు: నాగబాబుnagababu;auto;pawan;chiranjeevi;apple;east;letter;european union;custard apple;father;maa annayya;annayyaMon, 30 Nov 2020 19:35:00 GMTతెలుగు ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి కొణిదల నాగబాబు. అలాగే ఆయన కొన్ని సినిమాల్లోనూ హీరోగా నటించి మంచి గుర్తింపును కూడా తెచ్చుకున్నారు.  అయితే ఈయన సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొంటూ తన మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలపై తరచూ మాట్లాడుతూ ఉంటారు. అయితే తాజాగా ఈ మెగా బ్రదర్ తన కుటుంబం గురించి, వారి తల్లిదండ్రుల గురించి మాట్లాడారు. ఈయన మాట్లాడిన మాటలు చాలా ఆసక్తికరంగా మారాయి. మా తల్లిదండ్రులు మమ్మల్ని పట్టించుకున్నంత మేము మా పిల్లల విషయంలో వారిలా ఉండకపోయామని తెలిపారు. అలాగే ఏడాదికి ఒక్కసారైనా మా అమ్మానాన్న మమ్మల్ని పర్యాటక స్థలాలకు తీసుకెళ్లేవారు.

కాని నేను ఆ విషయంలో కాస్త వెనకనే ఉన్నానని నాగబాబు అన్నారు. అయితే అలా విహార యాత్రలకు పిల్లలను తీసుకెళితేనే వారిలో ఉండే ప్రతిభలేంటో మనకు తెలుస్తాయన్నారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు వారి తండ్రి గురించి, వారు పెంచిన విధానం గురించి తెలిపిన విషయాలు చాలా ఆసక్తిని కలిగించాయి.  మరీ ముఖ్యంగా నేటి తల్లిదండ్రులు పిల్లల పట్ల ఏవిధంగా ప్రవర్తించాలనే విషయాలను, పలు సూచనలను నాగబాబు తెలియజేశారు. మరి అవేంటో చదివేయండి..నేటి కాలం పిల్లలపై చదువు పట్ల ఒత్తిడి ఎక్కువగా ఉంది. కాని మా కాలంలో అయితే మా తల్లిదండ్రులు ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. మరీ ముఖ్యంగా చదువులో మేము పాస్  అయినా లేక ఫెయిల్ అయినా ఏం అనేవారు కాదు. 


కేవలం మేము పాస్ అయితే చాలనుకునేవారంతే. కాని ఎప్పుడు స్ట్రెస్ చేసేవారు కాదు. మా నిర్ణయాలకు వారి పూర్తి మద్దతును తెలిపేవారు మా తల్లిదండ్రులు. మా నాన్న గారు ఎక్సైజ్ డిపార్ట్ మెంట్లో పనిచేసేవారు. మా నాన్న చాలా తెలివిమంతులు. మా ప్రతి పనిని ఆయన గౌరవించేవారు. మా కోరికలను తెలుసుకుంటూనే మా నాన్న గారు మాకు మార్గ నిర్ధేశం చేస్తుండేవారు. మరీ ముఖ్యంగా మా అన్నయ్య చిరంజీవి సినిమాల్లోకి వెళతానని చెప్పడంతో ఆయన దానికి పూర్తి అంగీకారం తెలిపారు. అలాగే నేను సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా మారడానికి నాకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవడానికి మా అన్నయ్యే  ముఖ్య కారణం. అలాగే పవన్ కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని నాగబాబు వివరించారు. 


మరీ ముఖ్యంగా మేము ఏదైనా ఒక వర్క్ ను ఎంచుకున్నప్పుడు దానికి సంబంధించిన నిర్ణయాలను మా నాన్నగారు మాకే కేటాయించేవారు. దానితో పాటుగా ఆ వర్క్ కు సంబంధించి ప్లాన్స్ ను కూడా మాకు వివరించి నిర్ణయం తీసుకోమని చెప్పేవారని నాగబాబు వారి తల్లిదండ్రుల గురించి గుర్తుచేశారు. కాని మా కాలంలో పిల్లలకున్న స్వేచ్ఛ నేటి తరం పిల్లలకు లేకుండా పోతోంది. వారికి పూర్తి స్వేచ్ఛని ఇచ్చినప్పుడు వారు మంచిగా నిర్ణయాలు తీసుకుంటారు. కాని మన భయాలు, ఆందోళలనల మూలంగా వారి స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఉంటే మంచిది. బయట ఆడుకోనీయకుండా చేస్తూ ప్రకృతిని ఆస్వాదించకుండా చేయకూడదు. వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరే దగ్గరుండి దాని ఎలా పరిష్కరించాలనే విషయాలను నేర్పించాలి. మరీ ముఖ్యంగా వారితో మీరు మీకు వీలైనంత సమయం కేటాయించాలి. దానితో మీకు వారికున్న అన్ని ఆలోచనలను తెలుపగలుగుతారని నాగబాబు తెలిపారు.



బిగ్ రిస్క్ చేస్తున్న బెల్లంకొండ...?

మరో పదినెలల్లో జగన్ సంచలన నిర్ణయం..?

గ్రేటర్ యుద్ధం : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పై కేఏ పాల్ వ్యాఖ్యలు...

గ్రేటర్ యుద్ధం : నరాలు తెగిపోయే టెన్షన్ ?

గ్రేటర్ యుద్ధం : ఐటీ ఉద్యోగులకు చక్కటి అవకాశం..!

గ్రేటర్ యుద్దం : "నేను లైలా అయితే వాళ్ళు నా మజ్నులు "..అసదుద్దీన్ !!

గ్రేటర్ యుద్ధం: ‘ఎన్నికలెందుకు? కార్పొరేటర్ సీట్లు అమ్మండి’




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>