SatireMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiranjeevi-powerstar-pawan-kalyanf86b9fd6-29f2-4b1e-9d32-088503ba1fc6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiranjeevi-powerstar-pawan-kalyanf86b9fd6-29f2-4b1e-9d32-088503ba1fc6-415x250-IndiaHerald.jpgఅన్నియ్య రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అసలు ఈ రాజకీయాలతో తనకు సంబంధం లేదని ప్రకటించకపోయినా, ప్రకటించినట్టుగానే వ్యవహరిస్తున్నారు. పూర్తిగా సినిమా వ్యవహారాలను భుజాన వేసుకుని ముందుకు వెళ్తున్నాడు. అటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరిని వదిలిపెట్టకుండా, ఇద్దరికీ కావలసిన వ్యక్తిగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను పొగుడుతూ, మీ అంతటి గొప్ప మహానుభావులు లేరు. మీరే లేకపోతే తెలుగు ప్రజలు ఏమైపోయి ఉండేవారు అని అదే పనిగా పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. పొలిటిషన్ అనే పిలుపును దూరం చేసుకుని , మళ్ళీ మెగాసmega brothers chiru pavan;auto;pawan;chiranjeevi;kcr;kalyan;pawan kalyan;jagan;telangana;janasena;cinema;industry;letter;janasena party;annayyaసెటైర్ : తమ్ముడు కంగారు పడుతున్నాడు అన్నియ్యా ...!!సెటైర్ : తమ్ముడు కంగారు పడుతున్నాడు అన్నియ్యా ...!!mega brothers chiru pavan;auto;pawan;chiranjeevi;kcr;kalyan;pawan kalyan;jagan;telangana;janasena;cinema;industry;letter;janasena party;annayyaMon, 30 Nov 2020 14:00:00 GMT
అన్నియ్య రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అసలు ఈ రాజకీయాలతో తనకు సంబంధం లేదని ప్రకటించకపోయినా, ప్రకటించినట్టుగానే వ్యవహరిస్తున్నారు. పూర్తిగా సినిమా వ్యవహారాలను భుజాన వేసుకుని ముందుకు వెళ్తున్నాడు. అటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరిని వదిలిపెట్టకుండా, ఇద్దరికీ కావలసిన వ్యక్తిగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను పొగుడుతూ, మీ అంతటి గొప్ప మహానుభావులు లేరు. మీరే లేకపోతే తెలుగు ప్రజలు ఏమైపోయి ఉండేవారు అని అదే పనిగా పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు.



 పొలిటిషన్ అనే పిలుపును దూరం చేసుకుని , మళ్ళీ మెగాస్టార్ అనే పిలుపులే పిలవాలని, ఇండస్ట్రీ మొత్తానికి తానే పెద్ద దిక్కుగా ఉండాలని కోరుకుంటూ, అటు ఆంధ్రా సీఎం జగన్ , తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరిని అదే పనిగా ని పొగుడుతూ , మెగాస్టార్ అనబడే చిరంజీవి చేస్తున్న రాజకీయం ఆయన తమ్ముడు జనసేన అధినేత ప్లస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చాలా.. చాలా చాలా ఇబ్బందికరంగా మారింది. అసలు ఏపీలో జగన్ పరిపాలన అస్సలు ఏమీ బాగా లేదని, గత చంద్రబాబు పాలన తనకు నచ్చింది అన్నట్లుగా వ్యవహరిస్తూ ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు జగన్ పైన జగన్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ వస్తుంటే,  సరిగ్గా అదే సమయంలో జగన్ పాలన బ్రహ్మాండంగా ఉంది అంటూ పొగుడుతూ ఉండడం తమ్ముడు పాలిటిక్స్ కు చాలా ఇబ్బందికరంగా మారింది. 



ఇక్కడ సంగతి ఇలా ఉంది కదా అని,  అక్కడి కేసీఆర్ ప్రభుత్వం ను తిట్టి పొద్దాం అని చూస్తుంటే ,ఇప్పుడు అక్కడ కూడా అన్నయ్య ఎంట్రీ ఇచ్చి కెసిఆర్ పాలన కూడా, జగన్ పాలన మాదిరిగానే బ్రహ్మాండంగా ఉంది అంటూ మళ్ళీ అవే అవే ప్రశంసలు కురిపిస్తూ వస్తుండడం తో జనసేన కు ఏర్పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదు. అసలు కుదురుగా తనను రాజకీయం చేసుకో నివ్వకుండా అన్నయ్య అడుగడుగునా అడ్డం పడుతూ ఉండటం తో, మెగా ఫ్యాన్స్ సైతం ఇబ్బంది పడి పోతున్నారని  , అన్నయ్యను తిట్టి పోయే లేక తనను తిట్టుకుంటూ, తమ్ముడు రాజకీయం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయ్యో పాపం ! ఎంతపని చేస్తున్నావ్ అన్నియ్యా..!!!



జగన్ పై దాడికి, మంత్రిపై దాడికి దగ్గరి సంబంధం

గ్రేటర్ యుద్ధం: ‘‘అప్పుడు బండ్ల గణేష్.. ఇప్పడు బండి సంజయ్’’

గ్రేటర్ యుద్ధం: ‘‘అభివృద్ధి కోసం టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి’’

గ్రేటర్ యుద్ధం : ఓటర్ కార్డు లేదా.. అయితే ఇలా చేయండి..?

గ్రేటర్ యుద్ధం : అసలు కథ మొదలైంది.. డబ్బులు పంచుతున్నారు..?

నాయకులు హైదరాబాద్ వదిలి వెళ్ళాలి

ఈసారి నామినేషన్లలో అభిజిత్, అవినాష్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>