MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-rajamoulif68f4a1a-9cf7-4736-93c8-c136ae4a92e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-rajamoulif68f4a1a-9cf7-4736-93c8-c136ae4a92e1-415x250-IndiaHerald.jpgతొలిసారిగా టాలీవుడ్ హీరోలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న సినిమా రౌద్రం రణం రుధిరం. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ విదేశాల్లోని ప్రేక్షకుల్లో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. డివివి దానయ్య దాదాపు రూ. 500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాకి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా ఇందులో ఆలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. rrr teaser;ram charan jr ntr;ntr;ram charan teja;geetha;m m keeravani;pawan kalyan;ram pothineni;rajamouli;apherald;alluri sitarama raju;komaram bheem;bollywood;tollywood;rrr movie;cinema;sangeetha;january;hollywood;nandamuri taraka rama rao;nijam;olivia morris'ఆర్ఆర్ఆర్' కి గట్టి ముహూర్తం పెట్టారుగా .... మొత్తానికి పండగ మొదలు ....?'ఆర్ఆర్ఆర్' కి గట్టి ముహూర్తం పెట్టారుగా .... మొత్తానికి పండగ మొదలు ....?rrr teaser;ram charan jr ntr;ntr;ram charan teja;geetha;m m keeravani;pawan kalyan;ram pothineni;rajamouli;apherald;alluri sitarama raju;komaram bheem;bollywood;tollywood;rrr movie;cinema;sangeetha;january;hollywood;nandamuri taraka rama rao;nijam;olivia morrisMon, 30 Nov 2020 21:11:48 GMTటాలీవుడ్ హీరోలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న సినిమా రౌద్రం రణం రుధిరం. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ విదేశాల్లోని ప్రేక్షకుల్లో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. డివివి దానయ్య దాదాపు రూ. 500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాకి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా ఇందులో ఆలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి తర్వాత ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమా పరిశ్రమలకు చెందిన పలువురు దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన హీరోలిద్దరి ఫస్ట్ లుక్ టీజర్ లు మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. 1920ల కాలం నాటి కథగా పేట్రియాటిక్ నేపద్యంలో ఎంతో భారీగా పలు కమర్షియల్ హంగులు కలబోతగా రాజమౌళిసినిమా తెరకెక్కిస్తున్నట్లు టాక్.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా నుండి ఒక భారీ అప్డేట్ జనవరి 1న రానున్నట్లు తెలుస్తోంది. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అవుతాయని ఇక ఒక్కొక్కటిగా సినిమాలో నటిస్తున్న పాత్రల యొక్క పరిచయం, పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి బయటకు వస్తాయని అలానే వీలైనంత త్వరగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్ సిద్దమవుతున్నట్లు టాక్.  మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త గనుక నిజమైతే నిజంగా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ పంట పండినట్లే.....!!






గ్రేటర్ లో సెటిలర్లు ఎవరివైపు ఉంటారు..?

గ్రేటర్‌ యుద్ధం : పార్టీల మధ్య హోరాహోరీ !

గ్రేటర్ యుద్దం : పార్టీల జిమ్మీకులు..చిన్న పిల్లలతో డబ్బు పంపిణీ ..!!

బిగ్ రిస్క్ చేస్తున్న బెల్లంకొండ...?

మరో పదినెలల్లో జగన్ సంచలన నిర్ణయం..?

గ్రేటర్ యుద్ధం : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పై కేఏ పాల్ వ్యాఖ్యలు...

గ్రేటర్ యుద్ధం : నరాలు తెగిపోయే టెన్షన్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>