MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/politics7e21fb89-fb37-404c-8e9e-164a2fcb40df-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/politics7e21fb89-fb37-404c-8e9e-164a2fcb40df-415x250-IndiaHerald.jpgరాజకీయాలు సినిమా పడుగూ పేకల్లాంటివి. అత్యంత శక్తివంతమైన సినిమా మాధ్యమం నుంచి రాకకీయాల్లోకి వచ్చి అధికార అందలాన్ని అందుకున్నవారెందరో ఉన్నారు. తమిళ చిత్రసీనిమ ఇందుకు భిన్నం కాదు. నాటి ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత ఇలా చాలామంది ఈ రెండు రంగాల్లోనూ తమ ప్రతిభాప్రభావాలను చూపించారు. ప్రస్తుతానికి వస్తే తమిళ్ సూపర్ స్టార్ రజిని చాన్నాళ్లుగా తానూ రాజకీయాల్లోకి వస్తానంటూ ఊరిస్తూ వస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ తరహా వార్తలు వెల్లువెత్తడం...politics;view;kamal hassan;jayalalitha;apple;m. karunanidhi;cinema;rajani kanth;tamil;bengaluru 1;tamilnadu;letter;european union;custard apple;party;raghavendraఅత్యంత శక్తివంతమైన సినిమా మాధ్యమం నుంచి రాకకీయాల్లోకి..అత్యంత శక్తివంతమైన సినిమా మాధ్యమం నుంచి రాకకీయాల్లోకి..politics;view;kamal hassan;jayalalitha;apple;m. karunanidhi;cinema;rajani kanth;tamil;bengaluru 1;tamilnadu;letter;european union;custard apple;party;raghavendraMon, 30 Nov 2020 15:58:38 GMTరాజకీయాలు సినిమా పడుగూ పేకల్లాంటివి.  అత్యంత శక్తివంతమైన సినిమా మాధ్యమం నుంచి రాకకీయాల్లోకి వచ్చి అధికార అందలాన్ని అందుకున్నవారెందరో ఉన్నారు. తమిళ చిత్రసీనిమ ఇందుకు భిన్నం కాదు. నాటి ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత ఇలా చాలామంది ఈ రెండు రంగాల్లోనూ తమ ప్రతిభాప్రభావాలను చూపించారు. ప్రస్తుతానికి వస్తే తమిళ్ సూపర్ స్టార్ రజిని చాన్నాళ్లుగా తానూ రాజకీయాల్లోకి వస్తానంటూ ఊరిస్తూ వస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ తరహా వార్తలు వెల్లువెత్తడం...తర్వాత తాను ఈ ఎన్నికల్లో పాల్గొనడం లేదని ఓ ప్రకటన చేయడం ఆనవాయితీ అయిపొయింది. ఇంతలో విలక్షణ నటుడు కమల్ హాసన్ పార్టీ పెట్టి కాస్త హడావుడి చేశారు కూడా. త్వరలో తమిళనాట సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో మళ్ళీ రజిని అభిమానులతో సమావేశం ఏర్పాటు చేసారు. 


దాంతో ఈసారి రజని నుంచి కొత్త పార్టీ వార్త హల్చల్ చేయబోతోందని మీడియాలో గుప్పుమంది. కార్తీక సోమవారం రోజున తాను స్వయంగా నిర్మించిన రాఘవేంద్ర కళ్యాణ మండపంలో ఫాన్స్ తో మీట్ ఏర్పాటు చేశారు. రజిని పిలుపు అందుకున్న తమిళనాడులోని వాడవాడల నుంచి అభిమానులు వెల్లువెత్తారు. వారిలో కొంతమంది రజిని ఇంటి ముందుకొచ్చి జై జై నాదాలతో పాటు ఓ షరతు విధించి రజిని కాళ్లకు బంధం వేశారు. కొత్త పార్టీ అయితే ఒకే కానీ కాషాయదళంతో కలిసి రాజకీయాలు చేస్తామంటే తాము అంగీకరించమని బాహాటంగా నినదించారు. తమిళనాడులో ఎప్పటినుంచో రాజ్యాధికారాన్ని సొంతం చేసుకోవాలని ఎంతగానో ఉవ్విల్లూరుతున్న కమలం పార్తీ ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వానికి తెరవెనుక నుంచి వ్యూహరచన చేస్తూ వస్తోంది. అంతేకాదు...గతంలో రజినీని తమ పార్టీకి అండగా నిలువాల్సిందిగా విత్రిది కూడా తెచ్చింది.


 ప్రస్తుతం రజిని రాజకీయ అరంగేట్రం గురించి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా అభిమానులు మాత్రం సూపర్ స్టార్ కి గట్టి షాక్ ఇచ్చారనే చెప్పాలి. అభిమానులతో సమావేశం తర్వాత రజిని ఈ బాట ఎంచుకుంటారో ఉత్కంఠ గానే ఉంది. ఈ లోపున జయలలలిత నెచ్చెలి శశికళ బెంగళూర్ జైలు నుంచి రిలీజ్ అవుతారన్న సమాచారం కూడా తమిళ రాజకీయాలని హీటెక్కిస్తున్నాయి. వచ్చే ఏడాది తమిళ నాట ఎన్నికల సంవత్సరం. ఇప్పటినుంచే పొలిటికల్ హీట్ అన్ని పార్టీలని తాకుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని ఎన్నికల సిత్రాలున్నాయో? వేచి చూడాల్సిందే.  


మరో స్టోరీ తో మహేష్ ను సుకుమార్ ఒప్పించాడా..?

గ్రేటర్ యుద్ధం: ఆ ఘనత కవితకే.. బీజేపీ ఎంపీ అరవింద్ ఫైర్!

బుడుగు: కరోనా కారణంగా పిల్లల్లో పెరుగుతున్న నెగెటివ్ ఆలోచనలు..!

TSPSC: HMWS పరీక్ష కీ విడుదల

గ్రేటర్ యుద్ధం: ‘‘టీఆర్ఎస్ గెలుపు తథ్యం’’

మహేష్ ఇండస్ట్రీకి వచ్చి 41 వసంతాలు పూర్తి. శుభాకాంక్షలు తెలిపిన నమ్రత

గ్రేటర్ యుద్ధం: ‘‘అప్పుడు బండ్ల గణేష్.. ఇప్పడు బండి సంజయ్’’




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>