PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-appeals-people-to-vote-for-tdpfb4d5cd6-c8ae-4af8-b206-554fa0bd18d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-appeals-people-to-vote-for-tdpfb4d5cd6-c8ae-4af8-b206-554fa0bd18d2-415x250-IndiaHerald.jpgటీడీపీ ఆదివారం నాడు గ్రేటర్ ఎన్నికల ప్రచారం వేగాన్ని పెంచి ప్రచారం చేసింది. ముషీరాబాద్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచి టీడీపీకి ఓటు వేయాలని కోరారు. టీడీపీ అధినేత, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని ట్విట్టర్ ద్వారా కోరారు. బిల్‌గేట్స్, బిల్ క్లింటన్‌లను నగరానికి తీసుకువచ్చి ఐటీ కంపెనీలను స్తాపించిన ఘనత తమదేనని, నగరం సర్వతోముఖాభివృద్ధి జరగాలంటే టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.greater-war;achyuth;bharatiya janata party;telangana rashtra samithi trs;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;congress;ram madhav;huzur nagar;twitter;cycle;tdp;research and analysis wing;reddyగ్రేటర్ యుద్ధం: ‘‘అభివృద్ధి కోసం టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి’’గ్రేటర్ యుద్ధం: ‘‘అభివృద్ధి కోసం టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి’’greater-war;achyuth;bharatiya janata party;telangana rashtra samithi trs;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;congress;ram madhav;huzur nagar;twitter;cycle;tdp;research and analysis wing;reddyMon, 30 Nov 2020 11:22:04 GMTటీడీపీ ఆదివారం నాడు గ్రేటర్ ఎన్నికల ప్రచారం వేగాన్ని పెంచి ప్రచారం చేసింది. ముషీరాబాద్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచి టీడీపీకి ఓటు వేయాలని కోరారు. టీడీపీ అధినేత, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని ట్విట్టర్ ద్వారా కోరారు. బిల్‌గేట్స్, బిల్ క్లింటన్‌లను నగరానికి తీసుకువచ్చి ఐటీ కంపెనీలను స్తాపించిన ఘనత తమదేనని, నగరం సర్వతోముఖాభివృద్ధి జరగాలంటే టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ప్రజాశ్రేయస్సు పట్ల తమకున్న ఆకాంక్షల ఫలితమే సైబరాబాద్ అన్నారు. హైటెక్ సిటీ, ఔటర్ రింగ్‌రోడ్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, జినోమ్ వ్యాలీ.. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది టీడీపీయే అన్నారు. మళ్లీ నగరానికి పూర్వ వైభవం రావాలంటే ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటేసి, టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం అడిక్‌మెట్ డివిజన్ టీడీపీ అభ్యర్థి ఎం.చిత్ర డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. నాగమయ్యకుట, ఆజామాబాద్, పద్మాకాలనీ, శంకరమఠం, లక్కీ చౌరస్తా, అచ్యుత్ రెడ్డి మార్గ్, రాంనగర్ గుండు తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. అడిక్‌మెట్ డివిజన్ అభివృద్ధి కోసం టీడీపీకి ఒక్కసారి అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. ఇప్పటి వరకు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీకి అవకాశం ఇచ్చారని ఒక్కసారి టీడీపీకి అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

కవాడిగూడ సమగ్రాభివృద్ధి కోసం టీడీపీని గెలిపించండి అని డివిజన్ టీడీపీ అభ్యర్థి జి.శోభారాణి ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజు ఆదివారం డివిజన్‌లోని ముగ్గుబస్తీ, ఉన్నికోట, తాళ్లబస్తీ, బీమామైదాన్, తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్, బీజేపీ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని అన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

" style="height: 554px;">




తెలంగాణ లో మనిషిని చంపి అంబులెన్స్ కి అడ్డంగా నిలబడిన పులి

గ్రేటర్ యుద్ధం : ఓటర్ కార్డు లేదా.. అయితే ఇలా చేయండి..?

గ్రేటర్ యుద్ధం : అసలు కథ మొదలైంది.. డబ్బులు పంచుతున్నారు..?

నాయకులు హైదరాబాద్ వదిలి వెళ్ళాలి

ఈసారి నామినేషన్లలో అభిజిత్, అవినాష్...?

గ్రేటర్ యుద్దం: టీఆరెఎస్ మహిళ కార్యకర్తల పై దాడులకు దిగిన బీజేపి శ్రేణులు..దారుణం..

గ్రేటర్ యుద్ధం : హైదరాబాదులో నిశ్శబ్ద విప్లవం తప్పదు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>