CookingPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/cooking/81/cooking43eeb865-aeff-4696-b13d-7e41f20c93e3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/cooking/81/cooking43eeb865-aeff-4696-b13d-7e41f20c93e3-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...అరటికాయ, క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచివి.ఇవి శరీరానికి మంచి పోషకాలు అందించి మేలు చేస్తాయి. వీటిని విడివిడిగా తింటేనే ఎన్నో పోషకాలను పొందుతాము. అలాంటి కలిపి తింటే ఇంకెన్ని పోషకాలు పొందుతామో ఇంకెన్ని ఆరోగ్యప్రయోజనాలు పొందుతామో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అదికూడా గారెల రూపంలో తీసుకుంటే.. ఎవ్వరైనా సరే లొట్టలేసుకుంటూ ఆనందంగా తినాల్సిందే. అరటికాయ- క్యారెట్‌ గారెల తయారీ విధానం కూడా సులభంగా ఉంటుంది. పిల్లలకు మంచి ఆరోగ్యం కూడా. స్కూల్ నుంచి రాగానే ఇష్టంcooking;india;school;onion;chilli;oil;garlic;cumin;salt;coriander.;ishtam;anandamనోరూరించే క్యారెట్ అరటికాయ గారెలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి....నోరూరించే క్యారెట్ అరటికాయ గారెలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి....cooking;india;school;onion;chilli;oil;garlic;cumin;salt;coriander.;ishtam;anandamMon, 30 Nov 2020 12:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...అరటికాయ, క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచివి.ఇవి శరీరానికి మంచి పోషకాలు అందించి మేలు చేస్తాయి. వీటిని  విడివిడిగా తింటేనే ఎన్నో పోషకాలను పొందుతాము. అలాంటి కలిపి తింటే ఇంకెన్ని పోషకాలు పొందుతామో ఇంకెన్ని ఆరోగ్యప్రయోజనాలు పొందుతామో వేరే  చెప్పాల్సిన అవసరం లేదు. అదికూడా గారెల రూపంలో తీసుకుంటే.. ఎవ్వరైనా సరే లొట్టలేసుకుంటూ ఆనందంగా తినాల్సిందే. అరటికాయ- క్యారెట్‌ గారెల తయారీ విధానం కూడా సులభంగా ఉంటుంది. పిల్లలకు మంచి ఆరోగ్యం కూడా. స్కూల్ నుంచి రాగానే ఇష్టంగా తినే ఈ స్నాక్స్ ని చాలా ఇష్టంగా తింటారు. ఎలా  తయారు చెయ్యాలో చూడండి...


క్యారెట్ అరటికాయ గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు....

ఉడికించిన అరటికాయ (తొక్కతో సహా )- ఒకటి,
బియ్యం పిండి - కప్పు,
క్యారెట్‌ తురుము - కప్పు,
ఉల్లిపాయ - ఒకటి,
వెల్లుల్లి రెబ్బలు - పది,
పచ్చిమిర్చి - ఐదు,
కొత్తిమీర తురుము - అరకప్పు,
ఉప్పు - తగినంత,
జీలకర్ర - చెంచా,
నూనె - వేయించడానికి సరిపడా.


క్యారెట్ అరటికాయ గారెలు తయారుచేసే విధానం....

ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పును మిక్సీలో వేసి పేస్టు సిద్ధం చేసుకోవాలి.తర్వాత ఓ గిన్నెలో ఉడికించిన అరటికాయను తొక్క తీసి ముక్కలుగా కోసుకుని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో క్యారెట్‌ తురుము, తగినంత బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలి.ఈ మిశ్రమంలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్టుతో పాటు తగినంత ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి గారెల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గారెల్లా వత్తి కాగిన నూనెలో వేయించి తీస్తే రుచికరమైన అరటికాయ క్యారెట్‌ గారెలు రెడీ అయినట్లే.. సాయంత్రపు స్నాక్స్‌గా వీటిని లొట్టలేసుకుంటూ  తినవచ్చు. టమాటా సాస్‌తో తింటే మరింత రుచిగా ఉంటుంది... చేసేయండి మరి.ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటాకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...


తెలంగాణ లో మనిషిని చంపి అంబులెన్స్ కి అడ్డంగా నిలబడిన పులి

గ్రేటర్ యుద్ధం: ‘‘అభివృద్ధి కోసం టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి’’

గ్రేటర్ యుద్ధం : ఓటర్ కార్డు లేదా.. అయితే ఇలా చేయండి..?

గ్రేటర్ యుద్ధం : అసలు కథ మొదలైంది.. డబ్బులు పంచుతున్నారు..?

నాయకులు హైదరాబాద్ వదిలి వెళ్ళాలి

ఈసారి నామినేషన్లలో అభిజిత్, అవినాష్...?

గ్రేటర్ యుద్దం: టీఆరెఎస్ మహిళ కార్యకర్తల పై దాడులకు దిగిన బీజేపి శ్రేణులు..దారుణం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>