PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-akkada-chikithsa-bayata-padda-nijalubcf96dad-0489-4709-bfae-64b84ad51c94-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-akkada-chikithsa-bayata-padda-nijalubcf96dad-0489-4709-bfae-64b84ad51c94-415x250-IndiaHerald.jpg రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గుముఖంప‌డుతున్నాయి. మిగ‌తా రాష్ట్రాల‌కు భిన్నంగా ఇక్క‌డ క‌రోనా వేవ్ కొన‌సాగుతుండ‌టం విశేషం. అయితే ఏమాత్రం నిర్ల‌క్ష్యం వ‌హించ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. సోమ‌వారం ఉదయం నాటికి వెల్ల‌డైన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం..తెలంగాణలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 593 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం ఇప్పటి వరకు 2,69,816 కేసులు నమోదయ్యాయి. corona;health;koti;sundayతెలుగు రాష్ట్రాల‌ను క‌రోనా వీడుతున్న‌ట్లేనా..? ‌కేసుల న‌మోదు ప‌డిపోతోందిగా..?!తెలుగు రాష్ట్రాల‌ను క‌రోనా వీడుతున్న‌ట్లేనా..? ‌కేసుల న‌మోదు ప‌డిపోతోందిగా..?!corona;health;koti;sundayMon, 30 Nov 2020 09:16:00 GMT హెల్త్ బులిటెన్ ప్ర‌కారం..తెలంగాణలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 593 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో తెలంగాణలో మొత్తం ఇప్పటి వరకు 2,69,816 కేసులు నమోదయ్యాయి.  ఇందులో 2,58,336 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  10,022 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు.

 దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 1458 మంది మృతి చెందారు.  తెలంగాణలో కొత్తగా 1058 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడం విశేషం.  మ‌రోవైపు  ఏపీలో కూడా కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. శ‌నివారం సాయంత్రం నుంచి ఆదివారంసాయంత్రం నాటికి గడిచిన 24 గంటల్లో 620 మందికి కరోనా నిర్ధారణ అయింది. తాజాగా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6,988కి చేరింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,67,683కి చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,787 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 8,52,298 మంది బాధితులు కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు.


 ప్రస్తుతం రాష్ట్రంలో 8,397 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదిలా ఉండ‌గా ప్రభుత్వం మొదటినుంచి రాష్ట్రంలో కరోనా టెస్టులు పెద్ద సంఖ్యలో నిర్వహిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా టెస్ట్‌ల సంఖ్య లక్షల్లోనే ఉండగా… తాజా టెస్టులతో కలిపి ఏపీలో టెస్టుల సంఖ్య కోటి దాటేసింది. ఆదివారం విడుదల చేసిన కరోనా బులిటెన్ వివరాల ప్రకారం… రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 1,00,17,126 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది.క‌రోనా పెరుగుతుంద‌ని వైద్య‌నిపుణులు సూచిస్తున్న జ‌నాలు ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.  కరోనా వ్యాప్తి సద్దుమణిగినట్టే అనిపించినా ప్రజల నిర్లక్ష్యంతో మళ్లీ విజృంభిస్తున్నది. మొదట్లో కరోనా అంటేనే హడలెత్తిన ప్రజలు ఇప్పుడు తమ ధోరణి మార్చుకున్నారు. మహాఅయితే వస్తుంది, పోతుంది దానితో పెద్ద నష్టం ఏమీలేదన్న నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు.





గ్రేటర్ యుద్ధం : ఇలా చేశారో జైలే ? వారంతా నగరాన్ని వీడల్సిందే ! ఎస్ఈసీ కీలక ఆదేశాలు ?

గ్రేటర్ యుద్దం: ప్రచారం ముగిసింది.. సోషల్ మీడియా మీద పడ్డ పార్టీలు..

సమంత బికినీ లుక్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అమిత్ షా ప్రచారానికి అడ్డు పడ్డ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

గ్రేటర్ యుద్ధం: బండి సంజయ్‌వి మతిస్థిమితం లేని మాటలు.. కాంగ్రెస్ నేత ఫైర్!

గ్రేటర్ యుద్ధం: ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది? ప్రశ్నించిన కేటీఆర్

మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>