PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cyclone1a9f6561-c49a-4951-b90c-7941a1311b15-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cyclone1a9f6561-c49a-4951-b90c-7941a1311b15-415x250-IndiaHerald.jpgగత నాలుగైదు రోజులుగా నివర్ తుఫాన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరొక షాకింగ్ వార్త. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. డిసెంబరు 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉంది. దాని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువనున్నాయి. cyclone;koshta;andhra pradesh;puducherry;rayalaseema;tamilnaduబీ కేర్ఫుల్... ముంచుకొస్తున్న మరొక తుఫాన్ కారణంగా భారీ వర్షాల సూచనలు!బీ కేర్ఫుల్... ముంచుకొస్తున్న మరొక తుఫాన్ కారణంగా భారీ వర్షాల సూచనలు!cyclone;koshta;andhra pradesh;puducherry;rayalaseema;tamilnaduSun, 29 Nov 2020 12:30:00 GMTగత నాలుగైదు రోజులుగా నివర్ తుఫాన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరొక షాకింగ్ వార్త. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. డిసెంబరు 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉంది. దాని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువనున్నాయి. నేడు, రేపు తెలంగాణలో పొడి వాతావరణం ఉండనుంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రాగల 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారి.. డిసెంబర్‌ 2న దక్షిణ తమిళనాడు- పాండిచ్చేరి మధ్య తీరందాటే అవకాశం ఉందని పేర్కొంది.




డిసెంబర్‌ 1 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో భారీవర్షాలు కురువనున్నాయి. వాయుగుండం పశ్చిమదిశగా కదిలి 2న దక్షిణ తమిళనాడులోని కోస్తా ప్రాంతాన్ని తాకుతుందని చెప్పాయి. దీని ప్రభావంతో వచ్చే రోజుల్లో దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మంగళ, బుధవారాల్లో తమిళనాడు, పుదుచ్చేరి కరైకల్‌, మహే, లక్షద్వీప్‌, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ తీరం, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించాయి. అటు, అల్పపీడన ప్రభావంతో డిసెంబరు 1 నుంచి తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తీర ప్రాంతంలో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. ఇప్పటికే నివర్ తుఫాన్ ప్రభావంతో భారీగా నష్టపోయిన రైతాంగాన్ని ఇప్పుడు మరో అల్పపీడనం తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తోంది. పంట చేతికొచ్చిన సమయంలో వరుసగా ఇలాంటి తుఫాన్లు ముంచుకు రావడంతో అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. నివర్ తుఫాను తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లో రైతాంగానికి కడగండ్లు మిగిల్చింది. దీనికి సంబంధించిన సహాయం ఇంకా ప్రభుత్వాల నుండి రైతన్నలకు అందాల్సి ఉంది.


మరో 10 పరుగులు పెంచిన ఆసీస్.. ఇండియా ఏం చేస్తుందో..?

బుల్లిపిట్ట: అమెజాన్‌కు చెక్ పెట్టే యోచనలో భారత్?

విజయ్ ‘మాస్టర్’ సినిమా రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్‌కు మీ మద్దతు కావాలి: ఎమ్మెల్సీ కవిత

టెర్రరిస్టు కోర్టుకు మహిళా ఉద్యమకారిణి.. సౌదీ సంచలన నిర్ణయం!

గ్రేటర్ యుద్దం : ఎన్నికల వేళ 'లిక్కర్ కిక్కు;..భారీగా మద్యం సరఫరా..!!

గ్రేటర్ యుద్ధం: ఎవరెన్ని కుట్రలు పన్నినా పాతబస్తీ మాదే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>