TechnologyP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/amazon05971ddb-bf0f-4ce0-9f4a-b672d63bbe4b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/amazon05971ddb-bf0f-4ce0-9f4a-b672d63bbe4b-415x250-IndiaHerald.jpgఅమెజాన్.. ఈ పేరు తెలియని వారుండటం చాలా అరుదు. ఎందుకంటే ప్రస్తుత మోడ్రన్ యుగంలో మనకు కావలసిన వస్తువులన్నీ ఆన్‌ లైన్‌ లోనే కొనేసు కుంటున్నాం. ఇలాంటి సమయంలో మన అవసరాలు అన్నీ తీరుస్తున్న ప్లాట్‌ఫామ్ అమెజాన్. బైక్స్ నుంచి బోల్టుల వరకూ అన్నీ మనకు అమెజాన్‌లో దొరుకుతాయి. ఈ కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా ఈ యాప్ ఉపయోగించే వారు చాలామంది ఉన్నారు. దీంతో ప్రపంచంలో నెంబర్ వన్ ఈ-కామర్స్ వెబ్‌ సైట్‌గా అమెజాన్ నిలిచిందిamazon;india;amazon;cheque;flipkartబుల్లిపిట్ట: అమెజాన్‌కు చెక్ పెట్టే యోచనలో భారత్?బుల్లిపిట్ట: అమెజాన్‌కు చెక్ పెట్టే యోచనలో భారత్?amazon;india;amazon;cheque;flipkartSun, 29 Nov 2020 13:24:37 GMTఅమెజాన్ నిలిచింది.

 అయితే భారత్ మాత్రం దీన్ని రీప్లేస్ చేసే యోచనలో ఉందట. ఇటీవల భద్రత కారణంగా చాలా చైనీస్ యాప్‌లను బ్యాన్ చేసిన భారత్.. ఇప్పుడు అమెజాన్‌పై దృష్టి పెట్టిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. త్వరలోనే ప్రభుత్వం నుంచి అమెజాన్ వంటి ఓ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ విడుదల అవబోతోందట. దీనిలో కూడా అమెజాన్‌లో లాగానే అన్ని వస్తువులూ లభిస్తాయని సమాచారం.

ఈ ప్లాట్‌ ఫామ్ ఏర్పాటు కోసం చర్చించేందుకు ఓ కమిటీని నియమించిందట భారత ప్రభుత్వం. యాప్ ఎప్పుడొస్తుంది? వంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇంకా తెలీదు. అయితే దీని కోసం ఏర్పాటు చేసిన కమిటీలో మాత్రం 11 మంది సీనియర్ అధికారులు ఉంటారట. వీరే ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ గురించి చర్చించి, ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. గతంలో అమెజాన్‌కు పోటీగా భారత్‌కు చెందిన ఫ్లిప్ కార్ట్ మార్కెట్‌లో ఉండేది.

అయితే ఇది కూడా తర్వాతి కాలంలో అమెరికాకు చెందిన అగ్ర కంపెనీ వాల్‌మార్ట్‌లో కలిసిపోయింది. దీంతో భారత్‌కు ప్రత్యేకంగా ఉన్న ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ లేవు. ఒక వేళ ఉన్నా అవి చాలా చిన్నవి కావడంతో పెద్దగా పాపులర్ అవ్వలేదు. అందుకే ఈ పరిస్థితిని మార్చడం కోసమే ప్రభుత్వం స్వయంగా ముందడుగు వేసి అమెజాన్ వంటి భారీ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేయాలని చూస్తోందని సమాచారం.


మరో 10 పరుగులు పెంచిన ఆసీస్.. ఇండియా ఏం చేస్తుందో..?

విజయ్ ‘మాస్టర్’ సినిమా రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్‌కు మీ మద్దతు కావాలి: ఎమ్మెల్సీ కవిత

టెర్రరిస్టు కోర్టుకు మహిళా ఉద్యమకారిణి.. సౌదీ సంచలన నిర్ణయం!

గ్రేటర్ యుద్దం : ఎన్నికల వేళ 'లిక్కర్ కిక్కు;..భారీగా మద్యం సరఫరా..!!

గ్రేటర్ యుద్ధం: ఎవరెన్ని కుట్రలు పన్నినా పాతబస్తీ మాదే...!

మోడీ కూడా జమిలి ఎన్నికలపై ఆసక్తి గా ఉన్నాడా..ఎందుకు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>