PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war2eb9456b-4be6-433c-9602-a45f861ff32e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war2eb9456b-4be6-433c-9602-a45f861ff32e-415x250-IndiaHerald.jpgమలక్ పేట డివిజన్ పరిధిలో ఎన్నికల జోరు కొనసాగుతోంది. ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ప్రచారాలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ మంత్రులు సైతం రంగంలోకి దిగారు. డివిజన్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూ.. మరోసారి పార్టీ అభ్యర్థులకు అవకాశం కల్పించండంటూ ప్రచారాలు చేస్తున్నారు.greater war;amala akkineni;nithya new;prasad;dussehra;bharatiya janata party;telangana rashtra samithi trs;kamma;telangana;jaan;chief minister;mla;minister;vijayadashami;service;ramzan;lie;john;petta;party;mantraగ్రేటర్ యుద్ధం: మత విద్వేషాలు రెచ్చగొట్టెలా ప్రయత్నం: మంత్రి సబితాగ్రేటర్ యుద్ధం: మత విద్వేషాలు రెచ్చగొట్టెలా ప్రయత్నం: మంత్రి సబితాgreater war;amala akkineni;nithya new;prasad;dussehra;bharatiya janata party;telangana rashtra samithi trs;kamma;telangana;jaan;chief minister;mla;minister;vijayadashami;service;ramzan;lie;john;petta;party;mantraSun, 29 Nov 2020 06:05:26 GMTపేట డివిజన్ పరిధిలో ఎన్నికల జోరు కొనసాగుతోంది. ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ప్రచారాలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ మంత్రులు సైతం రంగంలోకి దిగారు. డివిజన్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూ.. మరోసారి పార్టీ అభ్యర్థులకు అవకాశం కల్పించండంటూ ప్రచారాలు చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ అన్నారు. శనివారం ఆర్‌కేపురం డివిజన్‌ గ్రీన్‌హిల్స్‌కాలనీలో  మంత్రి క్యాంపు కార్యాలయంలో పలువురు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేశారు.

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. దేశంలోనే నంబర్‌ వన్ రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని, అభివృద్ధి, సంక్షేమం విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాజీపడకుండా పనిచేస్తోందన్నారు. హైదరాబాద్‌లో హిందూ, ముస్లింల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టేలా బీజేపీ వ్యవహరిస్తుందని హెచ్చరించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి చేకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప, ప్రజల బాగు కోసం ఒక్కరు కూడా ఆలోచించడం లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కరే తాపత్రయ పడుతారని తెలిపారు. రాష్ట్ర పండుగలకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపునిస్తున్నదని తెలిపారు.

బతుకమ్మ, దసరా, రంజాన్, క్రిస్మస్‌ పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ.. ప్రజలను ఏకం చేస్తుంటే.. బీజేపీ ప్రజల మధ్య మతం అనే చిచ్చుని రగిలించేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. కరోనా కష్టకాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందన్నారు. పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.1500 వేయడంతో పాటు రేషన్‌ను ఉచితంగా అందించిందన్నారు. కరోనాకు ఏమాత్రం భయపడకుండా నిత్యం ప్రజల్లో ఉండి సేవ చేసినట్లు తెలిపారు. ఆర్‌కేపురంలో డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మురుకుంట్ల విజయభారతిని భారీ మోజారిటీతో గెలిపించాలని కోరారు.

సీఎం కేసీఆర్‌ పరిపాలన, టీఆర్‌ఎస్‌ విధానాల పట్ల ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరడానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, యువకులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే, మూసారంబాగ్‌ డివిజన్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌ ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. డివిజన్‌ను చెందిన కాంగ్రెస్‌ నాయకులు కాసుల రవిగౌడ్, కాసుల మల్లేష్‌ గౌడ్, ప్రసాద్, చారి, శివగౌడ్, సంతోష్‌ శనివారం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి తీగల సునరితరెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాను కప్పి టీఆర్‌ఎస్‌లో ఆహ్వానించారు. పటేల్‌ నవీన్‌యాదవ్, జయప్రకాశ్, మధు, శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరడం అభినందనీయమని సునరితరెడ్డి అన్నారు.


మోడీ కూడా జమిలి ఎన్నికలపై ఆసక్తి గా ఉన్నాడా..ఎందుకు..?

గ్రేటర్ యుద్ధం : కారు జోరుకు బ్రేకులేసేవి అవేనా..?

గ్రేటర్ యుద్దం : వరద బాధితులకు గుడ్ న్యూస్..మళ్ళీ 7 నుండి వరద సాయం..!!

1300 కోట్లు అడిగితే... 13 పైసలు కూడా ఇవ్వలేదు - కేసీఆర్!

గ్రేటర్ యుద్ధం: 100 సీట్లు మావేనన్న కవిత!

తన సుఖం కోసం కొడుకును అతి దారుణంగా చంపిన కసాయి తల్లి.. చివరికి

బికినీలో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న యంగ్ హీరోయిన్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>