EditorialMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war7466c8cc-b104-4ddc-bce9-702072f4647d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war7466c8cc-b104-4ddc-bce9-702072f4647d-415x250-IndiaHerald.jpgఈ బక్క కెసిఆర్ ను ఎదుర్కొనేందుకు ఇంత మంది నేతలు గ్రేటర్ లో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు అంటూ, బీజేపీ జాతీయ నేతలను ఉద్దేశించి, కేసీఆర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. నిజమే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల అనేవి ఒక మున్సిపల్ కార్పొరేషన్ వరకు పరిమితం. కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల తంతు చూస్తుంటే అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల స్థాయిని మించి పోయే విధంగా హోరాహోరీగా పోరు నడుస్తోంది. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలోని అన్ని జిల్లాలు, అన్ని మండల స్థాయి నాయకులను గ్రేటర్ లో మోహరించి డివిజన్ల వారీగా బాధ్యతలను అప్పగgreter- war ghmc kcr bjp;auto;amit shah;kcr;yogi;hyderabad;bharatiya janata party;telangana;yogi adityanath;amith shah;congress;bahubali;chief minister;parliment;assembly;uttar pradesh;minister;letter;central government;nijam;party;mantraఎడిటోరియల్ : బక్క కేసీఆర్ కాదు బాహుబలి ! బీజేపీ భయమూ అదేనాఎడిటోరియల్ : బక్క కేసీఆర్ కాదు బాహుబలి ! బీజేపీ భయమూ అదేనాgreter- war ghmc kcr bjp;auto;amit shah;kcr;yogi;hyderabad;bharatiya janata party;telangana;yogi adityanath;amith shah;congress;bahubali;chief minister;parliment;assembly;uttar pradesh;minister;letter;central government;nijam;party;mantraSun, 29 Nov 2020 16:00:00 GMTఈ బక్క కెసిఆర్ ను ఎదుర్కొనేందుకు ఇంత మంది నేతలు గ్రేటర్ లో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు అంటూ, బీజేపీ జాతీయ నేతలను ఉద్దేశించి, కేసీఆర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. నిజమే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల అనేవి ఒక మున్సిపల్ కార్పొరేషన్ వరకు పరిమితం. కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల తంతు చూస్తుంటే అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల స్థాయిని మించి పోయే విధంగా హోరాహోరీగా పోరు నడుస్తోంది. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలోని అన్ని జిల్లాలు, అన్ని మండల స్థాయి నాయకులను గ్రేటర్ లో మోహరించి డివిజన్ల వారీగా బాధ్యతలను అప్పగించింది ఎమ్మెల్యేలు,  ఎంపీలు, మంత్రులు ,జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇలా అందరూ ఎన్నికల ప్రచారంలోనూ బాధ్యతలను నిమగ్నం అయ్యారు. ఇక కాంగ్రెస్ ఉన్నంతలోనే గ్రేటర్ లో తమ సత్తా చాటేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. కాకపోతే ఈ ఎన్నికలను బిజెపి చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే గల్లీ నుంచి జాతీయ స్థాయి నేతల వరకు అంతా గ్రేటర్ కు క్యూ కట్టేశారు. 





పూర్తిగా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేసేందుకు ఆ పార్టీ నాయకులంతా కష్టపడుతున్నారు.ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారం చేస్తూ ఎన్నో ఎన్నెన్నో హామీలను ప్రజలకు బిజెపి జాతీయ నాయకులు ఇస్తూ... గ్రేటర్ లో ఎన్నికల ప్రచార వేడి ని పెంచేశారు. అసలు కెసిఆర్ పెద్దగా జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టలేదు. అయినా బిజెపి జాతీయ నాయకులంతా హడావుడి చేస్తుండడం చూస్తుంటే,  నిజంగానే టిఆర్ఎస్ పార్టీకి, కెసిఆర్ కు బిజెపి అంతగా భయపదుతుందా అనే అనుమానాలు ప్రజల్లోనూ వ్యక్తమవుతున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీ బలంగా ఉంది. కాంగ్రెస్ బాగా బలహీనం కావడం, జాతీయ స్థాయిలో బీజేపీ కి ఎదురు లేకుండా ఉండడం ఇవన్నీ కలిసి వస్తున్నాయి. 




ఒక్కో రాష్ట్రంలోను పాగా వేసేందుకు బిజెపి ప్రయత్నిస్తున్న క్రమంలో, తెలంగాణపై పూర్తిగా ఫోకస్ పెంచింది. ఇదిలా ఉంటే, కెసిఆర్ శక్తిసామర్థ్యాలు ఏమిటో బిజెపి పెద్దలకు బాగా తెలుసు. ఏదో రకంగా సెంటిమెంట్ రగిల్చి ఫలితాలను తమ వైపు కు తిప్పుకోవడంలో కేసీఆర్ సిద్ధహస్తుడు. అందులోనూ తెలంగాణ గడ్డపై జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ గా ఉన్న టిఆర్ఎస్ ఆషామాషీగా అయితే రాజకీయం చేయదు , అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుందని బిజెపి ఆందోళన చెందుతోంది. అందుకే  ఈ స్థాయిలో బిజెపి అగ్రనేతలు అంతా తెలంగాణకు క్యూకడుతున్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు, అంతా రంగంలోకి దిగిపోయారు. అసలు బిజెపి తరుపున ఇంత మంది రంగంలోకి దిగడానికి ప్రధాన కారణం కెసిఆర్ చెప్పినట్టుగానే ఆ బక్క కెసిఆర్ బలం బలగం ఏంటో తెలుసు కాబట్టే. ఆయన బక్క కెసిఆర్ కాదు బాహుబలి కేసీఆర్ అనే విషయం వారికి అర్థం కాబట్టే అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.



కేజీఎఫ్ డైరెక్టర్‌తో తారక్ సినిమా?.. కథ ఇదేనా?

బుల్లిపిట్ట: అమెజాన్‌కు చెక్ పెట్టే యోచనలో భారత్?

కృష్ణా జిల్లాలో దారుణం: బంగారం కోసం డాక్టర్ ని చంపేసిన దుండగులు

విజయ్ ‘మాస్టర్’ సినిమా రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్‌కు మీ మద్దతు కావాలి: ఎమ్మెల్సీ కవిత

టెర్రరిస్టు కోర్టుకు మహిళా ఉద్యమకారిణి.. సౌదీ సంచలన నిర్ణయం!

గ్రేటర్ యుద్దం : ఎన్నికల వేళ 'లిక్కర్ కిక్కు;..భారీగా మద్యం సరఫరా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>