MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna4ba5e970-2220-4236-b793-d6e5b4fee5bc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna4ba5e970-2220-4236-b793-d6e5b4fee5bc-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది రచయితలు.. దర్శకులుగా మారి సినిమాలను తెరకెక్కిస్తూ మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు.కానీ కొంతమంది స్టార్ రైటర్ లు మాత్రం తెరవెనుక కథలను, మాటలను అందిస్తూ.. సినిమా విజయంలో కేవలం ఓ భాగంగానే మిగిలిపోతున్నారు. వారికి టాలెంట్ ఉన్నా.. అవకాశం రావట్లేదు. అలా ఎప్పటినుంచో చాలా హిట్ సినిమాలకు కథ మరియు స్క్రీన్ ప్లే అందించి మంచి రచయిత గా పేరు తెచ్చుకున్న 'కోన వెంకట్' తాజాగా బాలకృష్ణ కు ఓ మాస్ కథను వినిపించి ఓకే చెప్పించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. మీడియా వర్గbalakrishna;balakrishna;boyapati srinu;kona venkat;pragya jaiswal;srivas;venkat;hyderabad;tollywood;cinema;media;writer;success;father;yashasvi jaiswal;massఆ రైటర్ చెప్పిన కథకు ఓకే చెప్పిన బాలయ్య..!!ఆ రైటర్ చెప్పిన కథకు ఓకే చెప్పిన బాలయ్య..!!balakrishna;balakrishna;boyapati srinu;kona venkat;pragya jaiswal;srivas;venkat;hyderabad;tollywood;cinema;media;writer;success;father;yashasvi jaiswal;massSun, 29 Nov 2020 20:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది రచయితలు.. దర్శకులుగా మారి సినిమాలను తెరకెక్కిస్తూ మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు.కానీ కొంతమంది స్టార్ రైటర్ లు మాత్రం తెరవెనుక కథలను, మాటలను అందిస్తూ.. సినిమా విజయంలో కేవలం ఓ  భాగంగానే మిగిలిపోతున్నారు. వారికి టాలెంట్ ఉన్నా.. అవకాశం రావట్లేదు. అలా ఎప్పటినుంచో చాలా హిట్ సినిమాలకు కథ మరియు స్క్రీన్ ప్లే అందించి మంచి రచయిత గా పేరు తెచ్చుకున్న 'కోన వెంకట్' తాజాగా బాలకృష్ణ కు ఓ మాస్ కథను వినిపించి ఓకే చెప్పించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. మీడియా వర్గాల్లో వినిపిస్తున్న టాక్ మేరకు బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న సినిమాతో పాటు ఇప్పటికే కమిట్ అయిన ఒక సినిమాను చేసిన తర్వాత కోన సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాడట.

 బాలకృష్ణ కోసం మాస్ ఎంటర్ టైనర్ కథను కోనా రెడీ చేశాడట.ఆ కథ బాగా నచ్చడంతో కోన వెంకట్ కు బాలయ్య ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు శ్రీవాస్ డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. మాస్ ఎంటర్ టైనర్ సినిమాలను శ్రీవాస్ చక్కగా డీల్ చేయగలడు అంటూ ఇప్పటికే నిరూపితం అయ్యింది. అందుకే ఆయనకు ఈ దర్శకత్వ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు.త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. 2022లో వీరి కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు రావచ్చు అంటున్నారు. ఇక ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

 లాక్ డౌన్ కు ముందు ఓ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. సినిమాలో బలయ్య రెండు విభిన్న పాత్రలను పోషిస్తున్నాడు. అందులో ఒకటి అఘోర పాత్ర అని తెలుస్తోంది. బాలయ్యకు జోడిగా ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తోంది.ఇక గత కొంత కాలంగా వరుస అపజయాలతో డీలా పడ్డ మన బాలయ్యకు ఈ సినిమా హిట్ అవ్వడం కచ్చితంగా మారింది. అటు అభిమానులు సైతం ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు...!!


బాబర్ నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు.. పాక్ క్రికెటర్‌పై మహిళ సంచలన ఆరోపణలు

అమిత్ షా ప్రచారానికి అడ్డు పడ్డ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

గ్రేటర్ యుద్ధం: బండి సంజయ్‌వి మతిస్థిమితం లేని మాటలు.. కాంగ్రెస్ నేత ఫైర్!

గ్రేటర్ యుద్ధం: ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది? ప్రశ్నించిన కేటీఆర్

మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం

దరిద్రపు పాలన అంటూ టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు...!

వడ్డే నవీన్, ఎన్టీఆర్ ఇంటి అల్లుడు అనే విషయం మీకు తెలుసా..అయన మొదటి భార్య ఎవరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>