KidsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/kids38b422ec-3fc0-4d03-a43e-e4ddc3cc6fdc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/kids38b422ec-3fc0-4d03-a43e-e4ddc3cc6fdc-415x250-IndiaHerald.jpgపిల్లల పెరుగుదల విషయంలో పేరెంట్స్ చాల జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే పిల్లలు వయస్సుకు తగట్టు బరువు, ఉంటె చూడడానికి చాల మంచిగా అనిపిస్తుంది. అయితే కొంత మంది పిల్ల‌ల్లో వ‌య‌సుకు త‌గ్గ‌ట్టుగా పెరుగుద‌ల ఉండ‌కుండా పొట్టిగా ఉండిపోతారు. అలాగే, బ‌రువు కూడా పెర‌గ‌రు.kids;nithya new;tara;ayurvedaబుడుగు: పిల్ల‌ల్లో పెరుగుద‌ల క‌నిపించ‌డం లేదా.. అయితే ఇలా చేయండి..!?బుడుగు: పిల్ల‌ల్లో పెరుగుద‌ల క‌నిపించ‌డం లేదా.. అయితే ఇలా చేయండి..!?kids;nithya new;tara;ayurvedaSun, 29 Nov 2020 07:09:30 GMT
సాధార‌ణంగా పిల్లుల శ‌రీర పెరుగుద‌ల అనేది టీనేజీ వయస్సులో అధికంగా ఉంటుంది.  ఈ సమయంలో గనక శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే.. పెరుగుదల హార్మోన్ సరైన క్రమంలో విడుదల అవుతుంది. దీంతో పిల్లల్లో శరీర పెరుగుదల మెరుగైన స్థాయిలో ఉంటుంది.  ప్రత్యేకంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు సైతం శ‌రీర పెరుగుద‌ల‌లో మంచి ఫ‌లితాల‌ను అందిస్తాయ‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏంటో చూద్దామా.

అయితే ఉసిరికాయ‌లో అనేక ర‌కాలైప పోష‌కాలు ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా సీ విట‌మిన్‌తో పాటు పాస్ఫ‌ర‌స్‌, కాల్షియం, మిన‌ర‌ల్స్ ఇందులో ఉంటాయి. అందువ‌ల్ల ఉసిరికాయ‌ల‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల పోడ‌వు పెర‌గ‌టానికి ఉప‌యుక్తంగా ఉంటుంది. ఆయుర్వేద వైద్యుల సూచ‌న‌ల ప్ర‌కారం.. గుమ్మ‌డికాయ‌తో చేసిన ప‌దార్థాలు కూడా శ‌రీర పెరుగుద‌ల‌కు తొడ్ప‌డ‌తాయి. మ‌రీ ముఖ్యంగా ప్ర‌తి రోజు టిఫిన్ తినే స‌మ‌యానికి ముందు ఉడ‌కబెట్టిన గుమ్మ‌డికాయా గోరువెచ్చ‌గా ఉన్న టైంలోనే దానికి తేనే, ప‌టిక బెల్లం పొడిని క‌లిపి నిత్యం కొద్దిగా తీసుకుంటే శ‌రీర పెరుగుద‌ల‌కు అవ‌స‌ర‌మైన టిష్యూలు మెరుగుప‌డ‌టంతో పాటు, కండ‌రాలు బ‌ల‌ప‌డ‌టాని ఉప‌యోగ‌ప‌డుతుంది.

అలాగే, కొద్దిగా అశ్వ‌గంధ పొడి, బెల్లం, ఐదు మిరియాలను గ్లాస్ పాల‌లో క‌లిపి రాత్రి పూట ప్ర‌తిరోజు తీసుకోవ‌డంవ‌ల్ల కూడా మంచి ఫ‌లితాలు వుంటాయి. అలాగే, ప్ర‌తిరోజు తాజా ఆకు కూర‌గాయాలు తీసుకోవ‌డం వ‌ల్ల కూడా శ‌రీర పెరుగుద‌ల మెరుగ‌వుతుంది. మ‌రీ ముఖ్యంగా బ‌చ్చ‌లికూర‌, గోంగూర‌, క్యారెట్‌, సోయాబిన్‌, బెండ‌కాయ‌లు వంటివి తీసుకోవ‌డం వ‌ల్ల పోడ‌వు పెరుగుతారు. ఎందుకంటే వీటిలో శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఫైబ‌ర్‌, కాల్షియం, ఐర‌న్‌లు అధికంగా ఉంటాయి. అలాగే, నీరు కూడా అధికంగా తాగుతూ ఉండాలి.


మోడీ కూడా జమిలి ఎన్నికలపై ఆసక్తి గా ఉన్నాడా..ఎందుకు..?

గ్రేటర్ యుద్ధం : కారు జోరుకు బ్రేకులేసేవి అవేనా..?

గ్రేటర్ యుద్దం : వరద బాధితులకు గుడ్ న్యూస్..మళ్ళీ 7 నుండి వరద సాయం..!!

1300 కోట్లు అడిగితే... 13 పైసలు కూడా ఇవ్వలేదు - కేసీఆర్!

గ్రేటర్ యుద్ధం: 100 సీట్లు మావేనన్న కవిత!

తన సుఖం కోసం కొడుకును అతి దారుణంగా చంపిన కసాయి తల్లి.. చివరికి

బికినీలో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న యంగ్ హీరోయిన్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>