PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-ware3c984ab-e15d-43ea-8b74-e52e4b8bce70-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-ware3c984ab-e15d-43ea-8b74-e52e4b8bce70-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు. మామూలుగా చూస్తే ఇవి ఒక కార్పోరేషన్ కి సంబంధించిన ఎన్నికలు, ఇంకా సింపుల్ గా చెప్పుకోవాలంటే లోకల్ బాడీ ఎన్నికలు, మరి అటువంటి ఎన్నికలకు ఢిల్లీ నుంచి బడా నేతలు ఎందుకు దిగిపోయారు. వరసపెట్టి ముఖ్యమంత్రులు ఎందుకు హైదరాబాద్ కి క్యూ కట్టారు. అంటే అక్కడే ఉంది రాజకీయ తమాషా అంటున్నారు.greater-war;delhi;hyderabad;bharatiya janata party;congress;population;fort;local language;party;golcondaగ్రేటర్ యుద్ధం : ఒక్క దెబ్బతో లెక్కలు మారుతాయ్... ?గ్రేటర్ యుద్ధం : ఒక్క దెబ్బతో లెక్కలు మారుతాయ్... ?greater-war;delhi;hyderabad;bharatiya janata party;congress;population;fort;local language;party;golcondaSun, 29 Nov 2020 21:00:00 GMTహైదరాబాద్ ఎన్నికలు. మామూలుగా చూస్తే ఇవి ఒక కార్పోరేషన్ కి సంబంధించిన ఎన్నికలు, ఇంకా సింపుల్ గా చెప్పుకోవాలంటే లోకల్ బాడీ ఎన్నికలు, మరి అటువంటి ఎన్నికలకు ఢిల్లీ నుంచి బడా నేతలు ఎందుకు దిగిపోయారు. వరసపెట్టి ముఖ్యమంత్రులు ఎందుకు హైదరాబాద్ కి క్యూ కట్టారు. అంటే అక్కడే ఉంది రాజకీయ తమాషా అంటున్నారు.

ఒక్క హైదరాబాద్ చాలు.. కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి అన్నట్లుగా సీన్ ఉందిపుడు. మొత్తం తెలంగాణాకు ఆయువు పట్టు హైదరాబాద్. ఇక్కడే మూడవ వంతు జనాభా ఉంది. పైగా తెలంగాణాకు ఆర్ధిక వనరు, ఉపాధి గని,  గ్రోత్ ఇంజన్ ఇలా ఎన్ని చెప్పుకున్నా హైదరాబాద్ కి తక్కువే. పైగా రాజకీయాలు మార్చేసే జోరు కూడా హైదరాబాద్ కే సొంతం.

అందువల్లనే బీజేపీ గ్రేటర్ మీద ఉడుం పట్టు పట్టింది. గ్రేటర్ లో గెలిసి కాషాయం జెండా ఎగురవేస్తే చాలు ఇక తెలంగాణను గురి పెట్టేయవచ్చు అన్నట్లుగా లెక్కలు వేసుకుంటోంది. నిన్న దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది .ఫలితం బీజేపీకి అనుకూలంగా వచ్చింది. అది చాలు మొత్తం తెలంగాణా రాజాకీయాన్ని ఒక కుదుపు కుదిపేసింది. ఇపుడు గ్రేటర్ ఎన్నికలు అదే తీరు.

ఇక్కడ కనుక గట్టిగా కొడితే చాలు తెలంగాణాలోని కాంగ్రెస్ పని ముందు ఖతం అవుతుంది. కాంగ్రెస్ లో ఇప్పటికే నాయకత్వ సంక్షోభం ఉంది. గ్రేటర్ ఎన్నికలు ముంగిట పెట్టుకుని మరీ పూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. ఇపుడు కనుక బీజేపీ తొడగొట్టి టీయారెస్ కి ఎదురు నిలిస్తే  కాంగ్రెస్ కోట కుప్ప కూలడం ఖాయం. ముందుగా ఆ పార్టీ నుంచి వలసలు భారీ ఎత్తున ఉంటాయి. అవి కనుక పెద్ద స్థాయిలో వస్తే చాలు బీజేపీ ఫుల్ స్ట్రాంగ్ అవుతుంది. 2023 నాటికి టీయారెస్ కి అసలైన పోటీదారుగా మారుతుంది. అందుకే గ్రేటర్ నుంచే మొత్తం చక్రం తిప్పాలని బీజేపీ భావిస్తోందిట.




టీ ఆర్ ఎస్ కి కష్టకాలం మొదలయినట్లేనా..?

అమిత్ షా ప్రచారానికి అడ్డు పడ్డ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

గ్రేటర్ యుద్ధం: బండి సంజయ్‌వి మతిస్థిమితం లేని మాటలు.. కాంగ్రెస్ నేత ఫైర్!

గ్రేటర్ యుద్ధం: ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది? ప్రశ్నించిన కేటీఆర్

మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం

దరిద్రపు పాలన అంటూ టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు...!

వడ్డే నవీన్, ఎన్టీఆర్ ఇంటి అల్లుడు అనే విషయం మీకు తెలుసా..అయన మొదటి భార్య ఎవరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>