WomenP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/women/70/saudiactivist92f9e322-fba0-4a70-a84c-40ec66ce03fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/women/70/saudiactivist92f9e322-fba0-4a70-a84c-40ec66ce03fc-415x250-IndiaHerald.jpgఎడారి రాజ్యం సౌదీ అరేబియాలో మహిళల హక్కుల కోసం పోరాడిన ఉద్యమ కారిణి, ఆడవారికి కూడా డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వాలని ఉద్యమం చేసిన మహిళ ప్రస్తుతం సౌదీ జైల్లో మగ్గుతోంది. ఈమెపై 2019 మార్చి నుంచి విచారణ కొనసాగుతోంది. ఈమె పేరు ఆల్-హాత్‌లోల్. 31 ఏళ్ల హాత్‌లోల్.. మహిళల హక్కుల కోసం చాలా ఉద్యమాలు చేసింది. saudiactivist;women;tiru;2019;donald trump;court;woman;marchటెర్రరిస్టు కోర్టుకు మహిళా ఉద్యమకారిణి.. సౌదీ సంచలన నిర్ణయం!టెర్రరిస్టు కోర్టుకు మహిళా ఉద్యమకారిణి.. సౌదీ సంచలన నిర్ణయం!saudiactivist;women;tiru;2019;donald trump;court;woman;marchSun, 29 Nov 2020 10:00:00 GMT మహిళ ప్రస్తుతం సౌదీ జైల్లో మగ్గుతోంది. ఈమెపై 2019 మార్చి నుంచి విచారణ కొనసాగుతోంది. ఈమె పేరు ఆల్-హాత్‌లోల్. 31 ఏళ్ల హాత్‌లోల్.. మహిళల హక్కుల కోసం చాలా ఉద్యమాలు చేసింది.

ఈ క్రమంలోనే సౌదీ శత్రు దేశాలతో హాత్‌లోల్‌కు డీలింగ్స్ ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఆమెను అరెస్టు చేశారు. గతేడాది మార్చి నుంచి విచారణ జరుగుతూనే ఉంది. ఇప్పుడు సడెన్‌గా ఆమెపై నమోదైన కేసును సాధారణ కోర్టులో విచారించే హక్కు లేదని న్యాయమూర్తి పేర్కొన్నారట. ప్రత్యేక న్యాయస్థానానికి ఈ కేసును పంపుతున్నట్లు ప్రకటించారట. ఈ ప్రత్యేక న్యాయస్థానంలో సాధారణంగా టెర్రరిస్టులు, దేశ ద్రోహులకు సంబంధించిన కేసుల విచారణ జరుగుతుందని సమాచారం. అగ్ర రాజ్యం అమెరికాలో ట్రంప్ సర్కారు.. మహిళల హక్కుల గురించి పెద్దగా పట్టించుకోదు. అయితే  ఈసారి ఎన్నికల్లో గెలిచిన బైడెన్ మాత్రం సౌదీతో సత్సంబంధాలు ఉండేలా చూస్తానని ప్రచారం సమయంలో వాగ్దానం చేశారు.

దీంతో బైడెన్ వైట్‌హౌస్‌లోకి వెళ్లే సమయంలో హాత్‌లోల్‌ను విడుదల చేసేస్తారని అందరూ భావించారు. అయితే సౌదీ ప్రభుత్వం మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించింది. సడెన్‌గా ఆమెను టెర్రరిస్టు కోర్టుకు పంపాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం మొత్తం ప్రభుత్వం ఆడిస్తున్న నాటకం అని కొందరు వాదిస్తున్నారు. మరి హాత్‌లోల్ కేసు ముందు ముందు ఎటువంటి మలుపులు తిరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

సౌదీలో ప్రస్తుతం మహిళలు డ్రైవింగ్ చేస్తున్నారన్నా, వారికి ప్రభుత్వం నుంచి డ్రైవింగ్ లైసెన్సులు లభిస్తున్నాయన్నా అది మొత్తం హాత్‌లోల్ చలవే. మహిళలూ డ్రైవింగ్ చేయగలరంటూ ఆమె సౌదీలో పెద్ద ఉద్యమమే చేసింది. దీని ఫలితంగానే ఎడారి రాజ్యం మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వాలని నిర్ణయించింది.


రాజా సింగ్ కి షాక్ ఇచ్చిన పోలీసులు

గ్రేటర్ యుద్దం : ఎన్నికల వేళ 'లిక్కర్ కిక్కు;..భారీగా మద్యం సరఫరా..!!

గ్రేటర్ యుద్ధం: ఎవరెన్ని కుట్రలు పన్నినా పాతబస్తీ మాదే...!

మోడీ కూడా జమిలి ఎన్నికలపై ఆసక్తి గా ఉన్నాడా..ఎందుకు..?

గ్రేటర్ యుద్ధం : కారు జోరుకు బ్రేకులేసేవి అవేనా..?

గ్రేటర్ యుద్దం : వరద బాధితులకు గుడ్ న్యూస్..మళ్ళీ 7 నుండి వరద సాయం..!!

1300 కోట్లు అడిగితే... 13 పైసలు కూడా ఇవ్వలేదు - కేసీఆర్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>