MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ntr6f721b27-5b0d-4563-98e2-500cc460e005-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ntr6f721b27-5b0d-4563-98e2-500cc460e005-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసిన భారీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ అరవింద సమేత. రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ హిట్ కొట్టింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందించగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ దీనిని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించిన విషయం తెలిసిందే. ఇక దీని అనంతరం రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. jr ntr;trivikram srinivas;ntr;ram charan teja;pooja hegde;ram pothineni;rajamouli;trivikram srinivas;andhra pradesh;alluri sitarama raju;tollywood;rrr movie;cinema;media;dvv entertainment;heroine;nandamuri taraka rama rao;aravinda sametha veera raghava;ntr artsఏంటీ ..... ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీయబోయేది ఆ కథ కాదా ..... ?ఏంటీ ..... ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీయబోయేది ఆ కథ కాదా ..... ?jr ntr;trivikram srinivas;ntr;ram charan teja;pooja hegde;ram pothineni;rajamouli;trivikram srinivas;andhra pradesh;alluri sitarama raju;tollywood;rrr movie;cinema;media;dvv entertainment;heroine;nandamuri taraka rama rao;aravinda sametha veera raghava;ntr artsSun, 29 Nov 2020 22:53:27 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసిన భారీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ అరవింద సమేత. రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ హిట్ కొట్టింది. పూజా హెగ్డే  హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందించగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ దీనిని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించిన విషయం తెలిసిందే. ఇక దీని అనంతరం రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ లో ఎన్టీఆర్ నటిస్తున్నారు.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరొక హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రని, అలానే చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రని పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో భారీ ఖర్చుతో తీస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ కనబడుతోంది. ఇకపోతే దీని తరువాత మరొక్కసారి త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవల దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మించనున్న ఈ సినిమాకి అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ పరిశీలనలో ఉందని, అలానే ఈ సినిమాని మంచి పొలిటికల్ సెటైరికల్ ఎంటర్టైనర్ గా త్రివిక్రమ్ తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ని కలగలిపి తీయనున్నట్లు గా కొద్దిరోజుల నుండి పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి.

అయితే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా కథ ని ఇటీవల త్రివిక్రమ్ మార్పు చేయడం జరిగిందని, కాగా ఆ తాజా కథని ఎన్టీఆర్ కి వినిపించి ఆయన నుండి త్రివిక్రమ్ గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నారని అంటున్నారు. అయితే ఈ విషయమై మరొక విధమైన వార్త కూడా ప్రచారం అవుతోంది. దాని ప్రకారం గతంలో ఎన్టీఆర్ కి చెప్పిన కథలో త్రివిక్రమ్ కొంత మార్పులు చేర్పులు చేసారని, అంతే తప్ప సినిమా యొక్క మెయిన్ పాయింట్ అదేనని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ కథనాల్లో ఏది నిజమో, అసలు వీటిలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే ఈ సినిమాకి సంబంధించి మూవీ యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు......!!







బిగ్ బాస్ 4 : 13వ వారం ఆ ఇద్దరిలో ఒకరు ఎగ్జిట్..!

సమంత బికినీ లుక్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అమిత్ షా ప్రచారానికి అడ్డు పడ్డ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

గ్రేటర్ యుద్ధం: బండి సంజయ్‌వి మతిస్థిమితం లేని మాటలు.. కాంగ్రెస్ నేత ఫైర్!

గ్రేటర్ యుద్ధం: ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది? ప్రశ్నించిన కేటీఆర్

మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం

దరిద్రపు పాలన అంటూ టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>