WomenP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/women_healthcare/jewelry83432a5b-5229-458c-9e26-4a1a0d20a50d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/women_healthcare/jewelry83432a5b-5229-458c-9e26-4a1a0d20a50d-415x250-IndiaHerald.jpgమహిళల మనసును ఆకర్షించే వస్తువుల్లో ముందు వరుసలో ఉండేవి ఆభరణాలు. నగలంటే చాలా మంది స్త్రీలకు పిచ్చి. మరి మన సంప్రదాయాల ప్రకారం మహిళలు ఎక్కువగా ధరించే ఆభరణాలు కేవలం చూపులకు కనువిందు చేయడమేనా? లేక ఇంకేమైనా ఉపయోగపడతాయా? అంటే కచ్చితంగా ఇతర లాభాలు కూడా ఉన్నాయని కొందరు నిపుణులు చెప్తున్నారు. మరి ఆ లాభాలు ఏంటో ఓసారి పరిశీలిద్దామా..jewelry;marriage;heart;bp;gift;fashion;yoga;v;shaktiమహిళల మనసుదోచే అభరణాలు.. వాటి వెనుక సైన్స్ ఇదేనట!మహిళల మనసుదోచే అభరణాలు.. వాటి వెనుక సైన్స్ ఇదేనట!jewelry;marriage;heart;bp;gift;fashion;yoga;v;shaktiSat, 28 Nov 2020 10:09:20 GMT

1. పాపిడి బిళ్ల
తల మధ్యలో ధరించే ఈ ఆభరణం వల్ల చాలా ఉపయోగాలున్నాయట. హిందూ సైన్స్ ప్రకారం శరీరంలో రకరకాల చక్రాలు ఉంటాయని తెలుసు కదా. వీటిలో ఆరో చక్రం ఉండే స్థానంలోకి ఈ పాపిడి బిళ్ల వస్తుంది. పాపిడి బిళ్ల ధరించడం వల్ల ఈ చక్రం శక్తి పెరుగుతుందట. అలాగే ఈ ఆభరణం మూడో కన్ను ఉండే ప్రాంతంపై కూడా ప్రభావం చూపుతుందట. ఈ ప్రాంతంలో ఆత్మ శక్తి కేంద్రీకృతం అవుతుందని కూడా అంటారు.

2. చెవికమ్మలు
ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ఆకృతుల్లో చెవికమ్మలు దొరుకుతున్నాయి. ఇవి కూడా మహిళలకు చాలా ముఖ్యమైన ఫ్యాషన్ యాక్సెసరీస్‌లో ఒకటిగా మారిపోయాయి. మరి వీటి వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. చెవులు కుట్టించుకొని కమ్మలు పెట్టుకోవడం వల్ల మనలో అలర్ట్ నెస్ పెరుగుతుందట. చిన్న చిన్న శబ్దాలను కూడా పసిగట్టడానికి ఇలా చేయడం చాలా ఉపయోగపడుతుందట.

3. నెక్లేస్
మెడలో నెక్లేస్ వేసుకోవడం అమ్మాయిలకు చాలా ఇష్టం. ఇలాంటి గిఫ్ట్ ఇస్తే వారి మనసు గెలుచుకోవడం చాలా సులభం. మరి నెక్లేస్ వల్ల ఆరోగ్యానికి ఏదైనా లాభం ఉందా? ఉందట. నెక్లేస్ ధరించడం వల్ల శరీరంలో బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్‌ను రెగ్యులేట్ అవుతుందట. ఈ నెక్టేస్ మన హృదయానికి దగ్గరగా ఉండటం వల్లే ఈ ఎఫెక్ట్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే మన ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసి, ప్రేమను బలంగా చేస్తుందట నెక్లేస్.

4. ముక్కు పుడక
ముక్కు పుడక.. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది.  ఆడ పిల్లలు అందరూ ముక్కు పుడకలు ధరిస్తారు. మరి దీని వల్ల ఉపయోగం ఏంటి? ముక్కు పుడక ధరించడం వల్ల మహిళల ఆరోగ్యం మెరుగు అవుతుందట. అలాగే వారి సంతానోత్పత్తి మీద కూడా ముక్కు పుడక ప్రభావం ఉంటుందని తెలుస్తోంది.

5. ఉంగరం
దాదాపు పెళ్లి చేసుకున్న వారందరి ఉంగరపు వేలికీ ఓ ఉంగరం కచ్చితంగా ఉంటుంది. ఇలా ఉంగరం ధరించడం వల్ల కూడా ఆరోగ్య పరంగా కొన్ని ఉపయోగాలు ఉంటాయట. మన మనసులోని భావాలను రెగ్యులేట్ చేయడానికి ఈ ఉంగరం ఉపయోగ పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే మన హృదయానికి సంబంధించిన కొన్ని నాడులు ఉంగరపు వేలితో కనెక్ట్ అయ్యి ఉంటాయట. ఈ కారణంగా మనం ధరించే ఉంగరం మన ఎమోషన్స్‌ను అదుపులో ఉంచుతుందని తెలుస్తోంది.

6. మంగళసూత్రం
హిందూ సంప్రదాయంలో మంగళ సూత్రం ప్రాధన్యాతే వేరు. ఇది కూడా నెక్లేస్‌లాగే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని సమాచారం. శరీరంలో రక్త ప్రవాహాన్ని అదుపులో ఉంచడంతో పాటు, బ్లడ్ ప్రెషర్‌ను కూడా కంట్రోల్ చేస్తుందట. అందుకే పెద్ద వారు మంగళ సూత్రం ఎప్పుడూ మెడలోనే ఉండాలని చెప్పేవారేమో?

7. గాజులు
ఆడవాళ్లు బాగా ఇష్టపడే ఆభరణాల్లో గాజులు కచ్చితంగా ఉంటాయి. రకరకాల గాజులు ధరిస్తుంటారు మహిళలు. మరి ఈ గాజుల వల్ల ఉపయోగం ఏంటి? అంటే చాలానే ఉందని చెప్తున్నారు. అదేంటంటే.. మన శరీరంలో బ్లడ్ ప్రెషర్‌ను మెయిన్‌టైన్ చేయడానికి గాజులు ఉపయోగపడతాయట. మణికట్లు వద్ద గాజులు కొంత ఫ్రిక్షన్ సృష్టిస్తాయట. దీంతో శరీరంలో రక్త ప్రసరణ పెరిగి ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేస్తుందట.

8. బొట్టు
బొట్టు, పాపిడి బిళ్ల ఈ రెండూ మన శరీరంపై చూపించే ప్రభావాలు దాదాపు ఒకటే. యోగా ప్రకారం మన శరీరంలో ఉండే ఆరవ చక్రం వద్ద మనం బొట్టు పెట్టుకుంటాం. ఇది కచ్చితంగా కనుబొమల మధ్యే ఉంటుందని యోగా చెప్తోంది. ఇది మన జ్ఞానానికి సంబంధించిన విషయాలకు సంబంధించిన చక్రమని అంటారు. ఈ చక్రం వద్ద బొట్టు పెట్టుకోవడం వల్ల శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి వీలవుతుందట.

9. వడ్డాణం
వడ్డాణం వల్ల మహిళలకు ఉండే ఉపయోగాలు మానసికంగానే. వడ్డాణం ధరించడం వల్ల అమ్మాయిలు తమ నడుము లావు అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. దీని వల్ల శరీరం ఆకృతిపై ప్రత్యేక శ్రద్ధ పెడతారని నిపుణులు భావిస్తున్నారు. ఈ కారణంగా అమ్మాయిలు బరువు పెరగకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకొని, వారి నడుము లావు అవ్వకుండా చూసుకుంటారని చెప్తున్నారు.


నేడు ఒక్క రోజే మూడు నగరాలకు మోడీ

గ్రేటర్ యుద్దం :ఆ నాలుగు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం.. సీపీ

గ్రేటర్ యుద్ధం:హైదరాబాద్ ప్రచారంలో మోడీ...? కాకపోతే గంటే...?

గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం మోడీ ఆరోజు హైదరాబాద్ వస్తున్నాడా..?

ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేని అభిజిత్ టైటిల్ విన్నర్ అవుతాడా..?

ఏడాది పూర్తి చేసుకున్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ..

ఎలా అమ్మేస్తారు...? పవన్ ఆవేదన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>