MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-and-sukumar1cea6ad1-b6ce-4df1-9c30-1b5b1f38cede-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-and-sukumar1cea6ad1-b6ce-4df1-9c30-1b5b1f38cede-415x250-IndiaHerald.jpgరంగస్థలం సినిమాతోమంచి విజయాన్ని సొంతం చేసుకుని.. దర్శకుడిగా మరోసారి తన సత్తా చాటాడు సుకుమార్. ఇండ్రస్టీ లో సుకుమార్ తీసిన సినిమాల సంఖ్య తక్కువే అయినా.. ఆ సినిమాల్లో దాదాపు అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించినవే. ఇక ప్రస్తుతం సుకుమార్ మొట్టమొదటి సారిగా పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'. తెలుగుతో పాటు maro నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. గందపు చెట్ల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బనallu arjun and sukumar;kumaar;allu arjun;sethu;sukumar;vijay;vijay sethupathi;vikram;india;godavari river;cinema;telugu;tamil;november;driver;husband;hero;heroine;joseph vijay;arjun 1'పుష్ప' లో విలన్ విక్రమ్ కాదు.. ఎవరో తెలుసా..??'పుష్ప' లో విలన్ విక్రమ్ కాదు.. ఎవరో తెలుసా..??allu arjun and sukumar;kumaar;allu arjun;sethu;sukumar;vijay;vijay sethupathi;vikram;india;godavari river;cinema;telugu;tamil;november;driver;husband;hero;heroine;joseph vijay;arjun 1Sat, 28 Nov 2020 15:00:00 GMTసుకుమార్ తీసిన సినిమాల సంఖ్య తక్కువే అయినా.. ఆ సినిమాల్లో దాదాపు అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించినవే. ఇక ప్రస్తుతం సుకుమార్ మొట్టమొదటి సారిగా పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'. తెలుగుతో పాటు నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. గందపు చెట్ల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక బన్నీ సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి విలన్ గా ఎంతో మంది పేర్లు వినిపించాయి.

 కానీ ఇప్పటికీ వాటిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు దర్శకుడు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విక్రమ్..బన్నీ కి  విలన్‌గా నటించనున్నాడంటూ ఇటీవల ఆన్‌లైన్‌లో విరివిగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన 'పుష్ప'లో భాగం కావట్లేదని తెలిసింది. మొదట డేట్స్ సమస్య కారణంగా విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్ నుంచి అధికారికంగా తప్పుకున్నాడు. దాంతో చియాన్ విక్రమ్‌ను సుకుమార్ సంప్రదించి, ఆయనకు కథ వినిపించాడనీ, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ స్పెక్యులేషన్ జరిగింది.విక్రమ్ అయితే ఆ క్యారెక్టర్‌కు న్యాయం జరుగుతుందని బన్నీ కూడా భావించడానీ, ఆయన వస్తే ప్రాజెక్టుకు మరింత ప్రయోజనం చేకూరుతుందని అనుకున్నాడనీ చెప్పుకున్నారు.

అయితే విక్రమ్ సన్నిహిత వర్గాలు ఈ ప్రచారాన్ని తోసిపుచ్చాయి. అవన్నీ కేవలం వదంతులనీ, 'పుష్ప'లో విలన్‌గా విక్రమ్ నటించట్లేదనీ ఆ వర్గాలు స్పష్టం చేశాయి.ఈ ఏడాది మార్చిలో సెట్స్ మీదకు వెళ్లాల్సిన ఈ సినిమా కరోనా దెబ్బకు ఆగిపోయింది. ఇటీవల నవంబర్ 12న తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ ప్రారంభించారు. బన్నీ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా అతని లుక్ అనధికారికంగా బయటకు వచ్చి..ఎంతో వైరల్ అయ్యింది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్...!!


గ్రేటర్ యుద్ధం : అరెస్ట్ ఇవాళ చేస్తారా...రేపు చేస్తారా!?

అమ్మ: గర్భిణీలు డార్క్ చాక్లెట్ తింటే మంచిదేనా..!?

గ్రేటర్ యుద్దం: చంద్రబాబు పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్

గ్రేటర్ యుద్ధం: బీజీపీ నేతలకు ఎమ్మెల్సీ కవిత సవాల్!

గ్రేటర్ యుద్ధం : వాస్తుకు భయపడే వారు .. ప్రజాసేవ చేస్తారా ?

గ్రేటర్ యుద్ధం : మాటతో కాదు.. ఓటుతోనే వారికి బుద్ధి చెప్పండి..?

బుల్లిపిట్ట: గూగుల్, ఫేస్‌బుక్‌పై ఆంక్షలు?.. మార్కెట్‌పై ఆధిపత్యం తగ్గించడానికేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>