PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/crime0d0626a0-ec9d-4e04-b819-10d32ee8818f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/crime0d0626a0-ec9d-4e04-b819-10d32ee8818f-415x250-IndiaHerald.jpgప్రజలకు రక్షణ కల్పించాల్సిన అధికారులే వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కడప జిల్లా జమ్మలమడుగు నాగుల కట్టవీధిలో దంపతులు ఘర్షణ పడ్డారు. అయితే గొడవపై భార్య పోలీసులకు ఫోన్ చేశారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన పోలీసులకు సమీప బంధువు మార్క్. దంపతులు తరచూ గొడవ పడేవారని సముదాయించే ప్రయత్నం చేశారు. crime;naga;district;kadapa;smart phone;police;naga aswin;wife;police station;letter;traffic police;gharshanaకానిస్టేబుల్ దురుసు ప్రవర్తనతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం..!కానిస్టేబుల్ దురుసు ప్రవర్తనతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం..!crime;naga;district;kadapa;smart phone;police;naga aswin;wife;police station;letter;traffic police;gharshanaSat, 28 Nov 2020 21:39:22 GMTకడప జిల్లా జమ్మలమడుగు నాగుల కట్టవీధిలో దంపతులు ఘర్షణ పడ్డారు. అయితే గొడవపై భార్య పోలీసులకు ఫోన్ చేశారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన పోలీసులకు సమీప బంధువు మార్క్. దంపతులు తరచూ గొడవ పడేవారని సముదాయించే ప్రయత్నం చేశారు. పోలీసుల్లో ఒకరు మార్క్తో దురుసుగా ప్రవర్తించి, దాడిచేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో మనస్థాపానికి గురైన మార్క్ ఆత్మహత్యాయత్నం చేశారు. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భార్య భర్తల మధ్య గొడవ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దారి తీసింది. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని నాగుల కట్ట వీధిలో ఉంటున్న దంపతులు ఘర్షణ పడ్డారు. గొడవపై భార్య 100 నెంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరు కానిస్టేబుళ్లు సంఘటన స్థలానికి చేరుకుని దంపతులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సమీప బంధువైన మార్క్ పోలీసు వద్దకు వెళ్లి దంపతులు తరచూ గొడవ పడేవారని మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని సముదాయించే ప్రయత్నం చేశారు.

ఇక మార్క్పై పోలీసుల్లో ఒకరు దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసుల చర్యకు మనస్థాపానికి గురైన మార్క్ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. ఆయనను కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తీసుకెళ్లారు. పోలీసుల దురుసు ప్రవర్తన కారణంగానే మార్క్ ఆత్మహత్యాయత్నం చేశారని కుటుంబ సభ్యులు ఆగ్రహంతో జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఐ వెంకటేశ్వర్లు హామీ ఇవ్వడంతో మార్క్ కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.


తన సుఖం కోసం కొడుకును అతి దారుణంగా చంపిన కసాయి తల్లి.. చివరికి

బికినీలో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న యంగ్ హీరోయిన్!

బాలీవుడ్ హిట్ మూవీ రీమేక్‌లో చెన్నై బ్యూటీ త్రిష!

‘ఫైటర్’ మూవీపై బాలీవుడ్ హీరోయిన్ స్పందన ఇదీ!

కృష్ణా నది నీటిని పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల...

సామాన్యుడికి అందనంత ఎత్తులో 5G ఫోన్లు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>