SmaranaSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/the-legend-socialist-pramdh-karan-sethif4daf716-8ac0-4a77-8ab9-6210e5089168-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/the-legend-socialist-pramdh-karan-sethif4daf716-8ac0-4a77-8ab9-6210e5089168-415x250-IndiaHerald.jpg ప్రమోద్ కరణ్ సేథీ (నవంబర్ 28, 1927 - జనవరి 7, 2007) కృత్రిమ పాదం (జైపూర్ ఫూట్) సృష్టికర్త. 1927, నవంబర్ 28 న ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో జన్మించాడు. కాళ్ళు కోల్పోయిన అనేకమందికి నడకనేర్పిన ఘనత పొందిన సేథీకి గిన్నిస్ బుక్ రికార్డులో కూడా నమోదు చేసి ప్రశంసా పత్రం అందజేశారు. 1981లో సామాజిక సేవా రంగంలో ఆసియా లోనే అత్యుత్తమమైన మెగ్సేసే అవార్డు కూడా లభించింది.భారత ప్రభుత్వం కూడా అతని సేవలను గుర్తించి పద్మశ్రీ పురష్కారంతో సత్కరించింది. dr.-pramod-karan-sethi-;karan johar;sudha chandran;bhavana;chandran new;russia;uttar pradesh;cinema;january;november;air;cycle;war;international;jaipur;padma shri;red;chitramకుంటుప‌డిన జీవితాల‌ను న‌డిపించిన ప్ర‌మోద్ క‌ర‌ణ్ సేథీ... నేడు జ‌యంతికుంటుప‌డిన జీవితాల‌ను న‌డిపించిన ప్ర‌మోద్ క‌ర‌ణ్ సేథీ... నేడు జ‌యంతిdr.-pramod-karan-sethi-;karan johar;sudha chandran;bhavana;chandran new;russia;uttar pradesh;cinema;january;november;air;cycle;war;international;jaipur;padma shri;red;chitramSat, 28 Nov 2020 08:00:55 GMTకరణ్ సేథీ (నవంబర్ 28, 1927 - జనవరి 7, 2007) కృత్రిమ పాదం (జైపూర్ ఫూట్) సృష్టికర్త. 1927, నవంబర్ 28 న ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో జన్మించాడు. కాళ్ళు కోల్పోయిన అనేకమందికి నడకనేర్పిన ఘనత పొందిన సేథీకి గిన్నిస్ బుక్ రికార్డులో కూడా నమోదు చేసి ప్రశంసా పత్రం అందజేశారు. 1981లో సామాజిక సేవా రంగంలో ఆసియా లోనే అత్యుత్తమమైన మెగ్సేసే అవార్డు కూడా లభించింది.భారత ప్రభుత్వం కూడా అతని సేవలను గుర్తించి పద్మశ్రీ పురష్కారంతో సత్కరించింది. పుట్టుకతోనే కాలు లేకుండా జన్మించిన వికలాంగులకు, యుద్ధంలో కాళ్ళు కోల్పోయిన సైనికులకు, దాడుల్లో గాయపడిన అమాయకులకు ఇలా ఎందరో జీవితాలలో వెలుగు నింపిన పి.కె.సేథీ 2008, జనవరి 7న జైపూర్లో మరణించారు.

జైపూర్ ఫుట్ ఆలోచన : ఎముకల వైద్య నిపుణుడైన సేథీ 1969లో నిరక్ష్యరాస్యుడైన చేతివృత్తి నిపుణుడు రామచంద్ర శర్మతో కలిసి జైపూర్ ఫుట్ ను రూపొందించాడు. కృత్రిమ కాలు రూపొందించాలనే మెరుపు ఆలోచన వచ్చింది రామచంద్రారావుకే. ఒకనాడు అతడు సైకిల్ తొక్కుతుండగా టైరులోని గాలి పోయిందనీ, అప్పుడు అతడికి హటాత్తుగా ఈ ఆలోచన వచ్చిందనే భావన ప్రచారంలో ఉంది.జైపూర్ ఫుట్ అభివృద్ధి : జైపూర్ ఫుట్ తయారుచేయక ముందు కృత్రిమ కాలు అమర్చుకోవాలంటే ఖర్చు విపరీతంగా ఉండేది. కాబట్టి సేథీ రబ్బరు, చెక్క, అల్యూమినియంతో దీని తయారుచేసి తక్కువ ధరలో సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చాడు. అయిననూ 1975 వరకు కూడా ఈ కృత్రిమ పాదాన్ని అమర్చుకున్నవారు కొద్దిమందే. అప్ఘనిస్తాన్ యుద్ధం తరువాత జైపూర్ ఫుట్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈ యుద్ధంలో సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా) అమర్చిన మందు పాతరల వల్ల కాళ్ళు కోల్పోయిన అనేక మందికి అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ జైపూర్ ఫుట్‌లను అమర్చింది. ఆ తరువాత కార్గిల్ యుద్ధంలో కాళ్ళు కోల్పోయిన అనేక సైనికులు కూడా జైపూర్ ఫుట్ లనే అమర్చుకున్నారు. ప్రముఖ నటి సుధా చంద్రన్ కూడా జైపూర్ ఫుట్‌నే అమర్చుకొని మయూరి చిత్రంలో నటించి పలువురి ప్రశంసలు అందుకొంది.

అవార్డులు : ప్రమోద్ కరణ్ సేథీ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురష్కారంతో సత్కరించగా, అత్యధికులకు కృత్రిమ అవయవం అమర్చినందులకు సేథీ పేరునే గిన్నిస్ బుక్ వారు రికార్డు చేశారు. ఆసియాలోనే అత్యుత్తమమైన మెగ్సేసే అవార్డు కూడా సేథీని వెదుక్కుంటూ వచ్చింది.కాళ్ళు కోల్పోయిన ఎందరికో కృత్రిమ కాళ్ళు అమర్చి వారి జీవితాలలో వెలుగులు నింపిన సేథీ 2007, జనవరి 7 న జైపూర్‌లో మరణించారు.




ఇప్పుడే మొదలు పెట్టా.. త్వరలో ముందుకొస్తా : హార్దిక్ పాండ్యా

గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం మోడీ ఆరోజు హైదరాబాద్ వస్తున్నాడా..?

ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేని అభిజిత్ టైటిల్ విన్నర్ అవుతాడా..?

ఏడాది పూర్తి చేసుకున్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ..

ఎలా అమ్మేస్తారు...? పవన్ ఆవేదన

గ్రేటర్ యుద్ధం : కేటిఆర్ కి కొత్త పేరు పెట్టిన డీకే అరుణ

అందుకే ఓడిపోయాం: కోహ్లీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>