MoviesSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/alayaa256d15c2-a8c1-4a34-a172-aaf7dfdc992f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/alayaa256d15c2-a8c1-4a34-a172-aaf7dfdc992f-415x250-IndiaHerald.jpgఅలయా ఎఫ్ శనివారం 23వ ఏట అడుగుపెట్టింది. అయితే, ఈ యువ నటి తన పుట్టినరోజు వేడుకను చాలా వెరైటీగా జరుపుకుంది. ముంబైలోని సముద్ర తీర పట్టణం అలీబాగ్‌లో తన స్నేహితులతో కలిసి శుక్రవారం అర్ధరాత్రి తన స్టైల్లో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంది. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది అలయా. ఈ పోస్ట్‌లో తన పుట్టినరోజు వేడుకకు సంబంధించి ఒక ఫొటోను పొందుపరిచింది. ఈ ఫొటోలో అలయా బికినీలో దర్శనమిచ్చింది.alayaa;beauty;nithin;alia bhatt;aly khan;pooja bedi;pooja hegde;priya;saif ali khan;ali;priyanka;cinema;instagram;heroine;yuva;nithin reddyబికినీలో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న యంగ్ హీరోయిన్!బికినీలో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న యంగ్ హీరోయిన్!alayaa;beauty;nithin;alia bhatt;aly khan;pooja bedi;pooja hegde;priya;saif ali khan;ali;priyanka;cinema;instagram;heroine;yuva;nithin reddySat, 28 Nov 2020 21:40:00 GMTఅలీ ఖాన్ కూతురిగా నటించి సినీ పరిశ్రమకు పరిచయమైన అలయా ఎఫ్ శనివారం 23వ ఏట అడుగుపెట్టింది. అయితే, ఈ యువ నటి తన పుట్టినరోజు వేడుకను చాలా వెరైటీగా జరుపుకుంది. ముంబైలోని సముద్ర తీర పట్టణం అలీబాగ్‌లో తన స్నేహితులతో కలిసి శుక్రవారం అర్ధరాత్రి తన స్టైల్లో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంది. అయితే, తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది అలయా. ఈ పోస్ట్‌లో తన పుట్టినరోజు వేడుకకు సంబంధించి ఒక ఫొటోను పొందుపరిచింది. ఈ ఫొటోలో అలయా బికినీలో దర్శనమిచ్చింది. అంటే, సముద్ర తీరంలో బికినీలో బర్త్‌డేను ఎంజాయ్ చేసింది అలయా.


ఈ ఫొటోతో పాటు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక బూమెరాంగ్ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఈ వీడియోలో అలయా మోకాళ్ల వరకు గౌను, కాళ్లకు హై హీల్స్‌తో కనిపించింది. అంతేకాదు, తన పేరులోని A F అక్షరాలను పెద్దగా మంచి లైటింగ్‌తో పెట్టారు. ఆ అక్షరాల ముందు నుంచి అలయా నడుచుకుంటూ వెళ్తోంది. మొత్తం తన 23వ పుట్టినరోజును ఈ యంగ్ బ్యూటీ ఫుల్‌గా ఎంజాయ్ చేసినట్టుంది. కాగా, ప్రముఖ నటి పూజా బేడి కూతురే ఈ అలయా. ఈ ఏడాది జనవరిలో వచ్చిన ‘జవాని జానేమన్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైంది అలయా. ఈ చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహించారు. 21 ఏళ్ల గర్భవతిగా ఈ సినిమాలో అలయా కనిపించింది. అలయాకు తండ్రిగా సైఫ్ అలీ ఖాన్, తల్లిగా టబు నటించారు.



సినిమా విడుదలైన తరవాత అలయా కూడా నెపోటిజం విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే, తనపై వచ్చిన నెపోటిజం విమర్శలను ఆమె తిప్పి కొట్టారు కూడా. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించే బయటి వ్యక్తులతో పోలిస్తే తమకు ఛాన్స్ కాస్త ఎక్కువగానే ఉంటుందని అలయా అభిప్రాయపడింది. తాము 10 సార్లు ఆడిషన్స్‌లో రిజెక్ట్ అయితే.. బయట వాళ్లు 100 సార్లు రిజెక్ట్ కావచ్చని అంది. తమ పోరాటంతో పోలిస్తే వాళ్ల పోరాటం ఎక్కువగానే ఉంటుందని ఒప్పుకుంది. అంతమాత్రాన తమ వద్ద ప్రతిభ లేదని కాదని కూడా చెప్పింది. ఇండస్ట్రీలో ప్రియాంక చోప్రా, అలియా భట్, దీపికా పదుకొనే అంటే తనకు ఇష్టమని.. అయితే బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకోవాలి అనేది తన కోరిక అని చెప్పింది.








">




ముంచుకొస్తున్న మరొక తుఫాన్ ముప్పుపై మంత్రి బొత్స సమీక్ష...

గ్రేటర్ యుద్ధం : కారు జోరుకు బ్రేకులేసేవి అవేనా..?

గ్రేటర్ యుద్దం : వరద బాధితులకు గుడ్ న్యూస్..మళ్ళీ 7 నుండి వరద సాయం..!!

1300 కోట్లు అడిగితే... 13 పైసలు కూడా ఇవ్వలేదు - కేసీఆర్!

గ్రేటర్ యుద్ధం: 100 సీట్లు మావేనన్న కవిత!

తన సుఖం కోసం కొడుకును అతి దారుణంగా చంపిన కసాయి తల్లి.. చివరికి

బాలీవుడ్ హిట్ మూవీ రీమేక్‌లో చెన్నై బ్యూటీ త్రిష!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>